అన్వేషించండి

Esther Anil: ‘దృశ్యం’ నటి ఎస్తేర్.. ఈమె వయస్సు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఆ పాత్రలకు గ్రీన్‌సిగ్నల్?

‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి కంటే ‘దృశ్యం’ బాలనటి ఎస్తేరే పెద్దదట. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే.. చూడండి.

‘దృశ్యం’ మూవీ సీరిస్‌లో బాలనటిగా కనిపించిన ఎస్తేర్ అనిల్.. ఇప్పుడు హాట్ అవతారం ఎత్తింది. అదేంటీ.. ఇంత చిన్న పిల్ల ఇలా అందాలు ఆరబోస్తుందని అంతా ముక్కున వేలు వేసుకుంటున్నారు. అవకాశాల కోసం అప్పుడే.. డేరింగ్ స్టెప్స్ వేస్తోందని అంటున్నారు. అయితే, ఆమె వయస్సు తెలిసిన తర్వాత.. మళ్లీ మీరు ఆ మాట అనరు. ఎందుకంటే.. ఈమె ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి కంటే పెద్దది. నమ్మబుద్ధి కావడం లేదా?

కేరళకు చెందిన మలయాళ కుట్టి.. వయనాడ్‌లో 2001లో జన్మించింది. 2010లో అంటే దాదాపు తొమ్మిదేళ్ల వయస్సులో ‘నల్లవన్’ అనే మలయాళ చిత్రంతో బాలనటిగా వెండితెరపైకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో ఆమె బాలనటిగా నటించి ఆకట్టుకుంది. ఫలితంగా ఆమెకు 2013లో మలయాళ చిత్రం ‘దృశ్యం’లో అవకాశం వచ్చింది. అప్పటికి ఆమె వయస్సు 12 ఏళ్లు. ఆ తర్వాత 2014లో తెలుగులో రిమేక్ చేసిన ‘దృశ్యం’లో కూడా ఆమే నటించింది. అప్పటికి ఆమెకు 13 ఏళ్లు. చూసేందుకు చిన్న పిల్లగా కనిపించడంతో ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది.

‘దృశ్యం’ హిట్ కొట్టినా.. ఆ చిత్ర దర్శక నిర్మాతలు ‘దృశ్యం-2’ను తెరకెక్కించేందుకు చాలా టైమ్ తీసుకున్నారు. మొదటి పార్ట్‌ కంటే థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీయరెన్స్ ఇచ్చేందుకు ఆరేళ్లు కష్టపడ్డారు. ఈలోపు ఆ చిత్రంలో చిన్నారిగా మెప్పించిన ఎస్తేర్ వయస్సు కూడా పెరిగిపోయింది. గతేడాది ‘జోహార్’ మూవీలో తళుక్కుమంది. మొత్తానికి ‘దృశ్యం 2’ కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో విడుదలైన తెలుగు ‘దృశ్యం 2’కు మంచి రేటింగ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్తేర్ కూడా తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది. 

Pics: 'దృశ్యం 2'లో చిన్నమ్మాయి.. గ్లామర్ డాల్ గా మారిందే..

ప్రస్తుతం ఎస్తేర్‌కు 20 ఏళ్లు. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కృతి శెట్టికి 18 ఏళ్లు. ఈ లెక్కన చూసుకుంటే.. ఎస్తేర్ హీరోయిన్‌గా తన లక్‌ను పరీక్షించుకోడానికి అన్నివిధాలా అర్హురాలే. అయితే.. ముందుగా ఆమె ‘బాలనటి’ మార్క్ నుంచి బయటపడాలి. అందుకే.. అందాల ఆరబోతతో ఎలాంటి పాత్రలకైనా సిద్ధమేనని గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మరి.. టాలీవుడ్ పెద్దలు ఈమెను గమనించారో లేదో!

Also Read: ఓటీటీలో ‘బిగ్ బాస్-6’: బాలకృష్ణ హోస్టింగ్‌పై స్పందించిన నాగార్జున

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Embed widget