Shankar: చరణ్, కమల్ సినిమాలు ఒకేసారి షూటింగ్ - క్లారిటీ ఇచ్చిన శంకర్!
'ఇండియన్ 2' సినిమాను రీస్టార్ట్ చేయడంతో చరణ్ సినిమాను పక్కన పెట్టినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు శంకర్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను(RC15) రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూణే, హైదరాబాద్, రాజమండ్రిలలో చిత్రీకరించారు. సగానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.
ఈ సినిమా చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనేది శంకర్ ప్లాన్. కానీ సడెన్ గా ఆయన 'ఇండియన్ 2' సినిమాను రీస్టార్ట్ చేయడంతో చరణ్ సినిమాను పక్కన పెట్టినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు శంకర్. 'ఇండియన్ 2', 'RC15' సినిమాలను సమాంతరంగా చిత్రీకరించబోతున్నట్లు చెప్పారు. చరణ్ సినిమా కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్, వైజాగ్ లలో సినిమాను చిత్రీకరించబోతున్నట్లు చెప్పారు.
ఒకేసారి శంకర్ రెండు భారీ ప్రాజెక్ట్స్ ను టేకప్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. చరణ్ అభిమానులు తమ హీరో సినిమా క్వాలిటీ దెబ్బ తింటుందేమోనని భయపడుతున్నారు. కానీ శంకర్ మాత్రం తన సినిమాలను తెరకెక్కించే విషయంలో ఫుల్ క్లారిటీతోనే ఉన్నట్లు ఉన్నారు. మరి ఈ సినిమాల రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి!
Hi Everyone, Indian 2 and #RC15 will be shot simultaneously. Ready to shoot the next schedule of #RC15 from first week of September in Hyderabad and Vizag! @DilRajuOfficial @AlwaysRamCharan @SVC_official. pic.twitter.com/20yYQGxIgE
— Shankar Shanmugham (@shankarshanmugh) August 24, 2022
చరణ్ కు విలన్ గా ఎస్ జె సూర్య:
'RC15'లో నటుడు ఎస్ జె సూర్య ముఖ్యమంత్రి కొడుకుగా.. మెయిన్ విలన్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. అధికారం, డబ్బు కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకడుగు వేయని పాత్ర అది. ఈ అన్యాయాలను ఎదుర్కోవడానికి ఒక ఐఏఎస్ అధికారి పాత్రలో చరణ్ పోరాడే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలువనున్నాయి. శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర వంటి తారలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
కమల్ సినిమాతో కాజల్ రీఎంట్రీ:
ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ సినిమాలను దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు బిడ్డ పుట్టడంతో తిరిగి మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోబోతుంది. 'ఇండియన్ 2' సినిమాలో ముందుగా రకుల్, కాజల్ లను హీరోయిన్లుగా తీసుకున్నారు. కాజల్ గర్భవతి కావడంతో ఆమె సినిమా నుంచి తప్పుకుందనే వార్తలొచ్చాయి. అయితే షూటింగ్ లో ఆలస్యం జరగడం కాజల్ కి కలిసొచ్చింది. ఇప్పుడు కాజల్ నటించడానికి సిద్ధంగా ఉండడంతో కమల్ సెట్స్ లో జాయిన్ అవ్వబోతుంది. రీసెంట్ గా అభిమానులతో ముచ్చటించిన కాజల్.. 'ఇండియన్2' సినిమాలో నటించబోతున్నట్లు, కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నట్లు చెప్పింది. అంటే ఈ సినిమాతో ఆమె ఎంట్రీ ఖాయమన్నమాట!
Also Read: 'విక్రమ్ వేద' టీజర్ - మక్కీకి మక్కీ దించేశారుగా!
Also Read: 'లైగర్' పరిస్థితి నార్త్ ఇండియాలో ఎలా ఉందంటే?
Before You Go
NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















