అన్వేషించండి

Dil Raju: బాలీవుడ్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మక చిత్రం - షాహిద్ కపూర్‌తో సాహసం!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బాలీవుడ్ లో మరో ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరో గా నటిస్తున్నారు.

Dil Raju New Hindi Movie: ‘OMG 2’ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్న దర్శకుడు అమిత్ రాయ్ బాలీవుడ్ లో మరో ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందబోతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. వకావో బ్యానర్ లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అశ్విన్ వార్దే నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఈ సినిమాలో  శివాజీ పాత్రకు షాహిద్ ఫర్ఫెక్ట్ గా సూటవుతారని దర్శకుడు భావిస్తున్నారట. ఈ సినిమా కోసం పలువురు నటులను స్క్రీన్ టెస్ట్ చేసినప్పటికీ, ఫైనల్ గా షాహిద్ కు ఓకే చెప్పారట.  

వకావో సంస్థతో జతకడుతున్న దిల్ రాజు

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో  ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కాబోతున్నారట. వకావో ఫిల్మ్స్ తో కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారట. “షాహిద్ కపూర్‌ హీరోగా బాలీవుడ్ లో ఓ ప్రతిష్టాత్మ చిత్రం తెరకెక్కబోతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ పరాక్రమాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. వకావో ఫిల్మ్స్, అమిత్ రాయ్ తో కలిసి దిల్ రాజు ఈ సినిమాలో భాగస్వామ్యం అవుతున్నారు” అని బాలీవుడ్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.  

అటు ఈ సినిమా కోసం దిల్ రాజు కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ ను మరాఠా యోధుడిగా చూడాలని ఉత్సాహపడుతున్నారట. “అమిత్ రాయ్ కొంతకాలంగా ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ సినిమా అతడి డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రస్తుతం ఈ సినిమా కథకు సంబంధించిన పరిశోధన కొనసాగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది” అని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

శివాజీ జీవితంలోని కీలక ఘటన ఆధారంగా తెరకెక్కనున్న సినిమా

ఇక ఈ సినిమా నిర్మాణంలో దిల్ రాజు భాగస్వామ్యం కావడంతో పాన్ ఇండియా రేంజిలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా శివాజీ జీవిత చరిత్రలోని ఒక అధ్యాయం ఆధారంగా రూపొందబోతోంది. అతడి జీవిత కథను పూర్తిగా 3 గంటలలో చెప్పడం సాధ్యం కాదని, అందుకే ఓ కీలక ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు కొద్ది రోజుల క్రితం అమిత్ రాయ్ తన మిత్రులు దగ్గరి చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం షాహిద్ కపూర్ ‘దేవా’ అనే సినిమా చేస్తున్నారు. సూరజ్ బర్జాత్యాతో కలిసి ‘ప్రేమ్ వివాహ్’ అనే సినిమా చేయబోతున్నారు.  దిల్ రాజు ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలు నిర్మిస్తున్నారు.

Read Also: ‘ఎర్త్ అవర్’ రోజు లైట్లు ఎందుకు ఆర్పేయాలి? హైదరాబాద్‌లో ఈ టైమ్‌లో లైట్స్ అన్నీ బంద్!

టాప్ హెడ్ లైన్స్

Star Maa Serials : స్టార్ మాలో సరికొత్త సీరియల్ 'ఏ దేవి వరమో నువ్వు' - ఆ టాప్ సీరియల్స్ టైమింగ్స్ మారాయ్!
స్టార్ మాలో సరికొత్త సీరియల్ 'ఏ దేవి వరమో నువ్వు' - ఆ టాప్ సీరియల్స్ టైమింగ్స్ మారాయ్!
Veerabhadruni Rahasyam OTT : ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్ సిరీస్ - మర్మదేశం To వీరభద్రుని రహస్యం ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్ సిరీస్ - మర్మదేశం To వీరభద్రుని రహస్యం ఎందుకు చూడాలంటే?
Nindu Manasulu Serial Today July 3rd: నిండు మనసులు: వరుణ్‌ని ఇంటికి తీసుకొచ్చిన సిద్ధూ, ప్రేరణలకు షాక్ ఇచ్చిన సాహితి..!
నిండు మనసులు: వరుణ్‌ని ఇంటికి తీసుకొచ్చిన సిద్ధూ, ప్రేరణలకు షాక్ ఇచ్చిన సాహితి..!
Rao Bahadur OTT : రావు బహదూర్ ఓటీటీ ప్లాట్ ‌ఫామ్ ఫిక్స్ - సత్యదేవ్ సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
రావు బహదూర్ ఓటీటీ ప్లాట్ ‌ఫామ్ ఫిక్స్ - సత్యదేవ్ సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Pawan Kalyan Home Minister Portfolio: పవన్ కల్యాణ్ ఆఫీసులో సోషల్ మీడియా కేసులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్.. హోంశాఖ బాధ్యతలకు ఇది సంకేతమా?
పవన్ కల్యాణ్ ఆఫీసులో సోషల్ మీడియా కేసులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్.. హోంశాఖ బాధ్యతలకు ఇది సంకేతమా?
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EV vs Curvv EV: ఎక్కువ రేంజ్‌, కంఫర్ట్, మంచి స్పేస్‌ కోసం ఏ EV కొనాలి?
రూ.20 లక్షల బడ్జెట్‌లో Tata Sierra EV లేదా Curvv EV - ఏది బెస్ట్ ఛాయిస్?
Sanju Samson Under Pressure: సంజూ శాంసన్ కు పెరిగిపోతున్న కౌంట్‌డౌన్..  టెక్నికల్ లోపాలతో స‌త‌మ‌తం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి లైన్ క్లియర్!
సంజూ శాంసన్ కు పెరిగిపోతున్న కౌంట్‌డౌన్..  టెక్నికల్ లోపాలతో స‌త‌మ‌తం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి లైన్ క్లియర్!
Rains in Andhra Pradesh and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Yashasvi Jaiswal In FIFA World Cup : ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
ఫిఫా ప్రపంచకప్ లో ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
Embed widget