అన్వేషించండి

Dhee Grand Finale: స్టార్ డైరెక్టర్ స్టెప్పులు, హైపర్ ఆది పంచులు- ఆకట్టుకుంటున్న ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌’ గ్రాండ్ ఫినాలే ప్రోమో!

బుల్లితెర ప్రేక్షకులను ఓ రేంజ్​లో అలరిస్తున్న డ్యాన్స్ షో ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌’. తాజాగా ఈ షో గ్రాండ్ ఫినాలేకు సంబంధించి ప్రోమో విడుదలైంది. ఇందులో దర్శకుడు అనిల్ రావిపూడి పాల్గొని సందడి చేశాడు.

Dhee Celebrity Special Latest Promo: ఈ టీవీ వేదికగా ప్రతి బుధవారం ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్న షో ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌’. ఈ సీజన్‌ లో పలువురు సెలబ్రిటీలు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే పలు టీమ్ లో ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యాయి. చివరకు మూడు టీమ్ లు మిగిలాయి. టైటిల్ పోరులో ఒక టీమ్ ను మించి మరొక టీమ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. తాజాగా ఈ షో గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.

అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి

ప్రోమో ప్రారంభం కాగానే ప్రముఖ హీరోయిన్, ఢీ జడ్జి ప్రణీతతో కలిసి యాంకర్ నందు, డ్యాన్స్ మాస్టర్ శేఖర్ స్టేజి మీదికి అడుగు పెట్టారు. గ్రాండ్ ఫినాలేను.. ఇంకా గ్రాండ్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు సెన్సేషనల్ డైరెక్టర్ రాబోతున్నారంటూ నందు దర్శకుడు అనిల్ రావిపూడిని పరిచయం చేస్తాడు. ఇండస్ట్రీలో ‘సరిలేరు నీకెవ్వరు‘ అనిపించుకుంటున్న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్, టాలీవుడ్ సుప్రీం డైరెక్టర్ అంటూ అదిరిపోయే ఎలివేషన్ ఇస్తారు. చివరకు అనిల్ సింహపు సింహాసనం మీద కూర్చొని ఎంట్రీ ఇస్తారు. అదిరిపోయే స్టెప్పులతో ఆహా అనిపిస్తాడు. “గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు ఓకే. రెండు సింహాలతో ఎంట్రీ ఇచ్చారు. ఆ సింహానికి తెలిస్తే?” అంటాడు హైపర్ ఆది. “చెప్తవా ఏంటి?” అని ప్రశ్నిస్తాడు అనిల్ రావిపూడి. “చూడ్డా ఏంటి?” అంటూ ఆది కౌంటర్ ఇస్తాడు. దీంతో అందరూ నవ్వుతారు.

స్టెప్పులతో అదరగొట్టిన అనిల్, శేఖర్ మాస్టర్

ఇక అనిల్ రావిపూడి, శేఖర్ మాస్టర్ కలిసి వేసి డ్యాన్స్ మరో లెవల్ అని చెప్పుకోవచ్చు. చిరంజీవి హీరోగా నటించిన ‘కొదమ సింహం’ సినిమాలోని ‘ఘుం ఘుమాయించు కొంచెం’ అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. వారి స్టెప్పులకు షోలోని వాళ్లంతా క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేశారు.

క్రికెట్ ఫ్యాన్స్ జోలికి వెళ్లొద్దన్న అనిల్ రావిపూడి

ఇక టైటిల్ విన్నర్ ని ప్రకటించే సమయంలో ఆది అనిల్ రావిపూడితో “అన్నా ఇంత టెన్షన్ ఈ ప్రశ్న అడగొచ్చో? లేదో? తెలియదు. మియామ్.. మియామ్ బిల్లి అనే డైలాగ్ చెప్పవా? అన్నా” అంటాడు. “నాకు మైకు మడతపెట్టాలనుంది” అని రిప్లై ఇస్తాడు అనిల్. అదే సమయంలో “ఐపీఎల్ చూడకపోతే కొంపలు మునిగిపోతాయా” అని అనిల్ డైలాక్ కోట్ చేస్తాడు ఆది. వెంటనే అనిల్ “ఆపవోయ్.. ఆపు” అంటాడు. “మిమ్మల్ని కవర్ చేద్దామనే” అని రిప్లై ఇస్తాడు ఆది. “ఆల్రెడీ నేను కవర్ చేసుకున్నా. బ్యాటింగ్ మామూలుగా లేదక్కడ” అంటాడు అనిల్ నవ్వుతూ. “మా ఢీ చూడమని చెప్పబోతున్నా” అంటాడు ఆది. “అదైనా ఖాళీ టైమ్ లో చూస్తుంటారు. క్రికెట్ ఫ్యాన్స్ జోలికి వెళ్లకండయ్యా. చాలా సెన్సిటివ్ గా ఉన్నారు” అని అనిల్ చెప్పడంతో షో అంతా నవ్వుల్లో మునిగిపోతుంది.  మే 29న ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌’ గ్రాండ్ ఫినాలే ఈ టీవీలో ప్రసారం కానుంది. టైటిల్ విన్నర్ ఎవరో ఆ రోజే తేలిపోనుంది.

Read Also: అమ్మ మళ్లీ తిరిగి వస్తుంది అనిపిస్తుంది- ఆ మాటలు కంటతడి పెట్టించాయన్న జాన్వీ కపూర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today April 27th: ఇంటి పనులు తప్పించుకోవడానికి నిషిక, వైజయంతి వేసిన ప్లాన్‌ ఏంటి..?
జగద్ధాత్రి సీరియల్: ఇంటి పనులు తప్పించుకోవడానికి నిషిక, వైజయంతి వేసిన ప్లాన్‌ ఏంటి..?
Social Post : మోడ్రన్ డ్రెస్‌లో వామికా - నేచర్ ఎంజాయ్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ... ఫోటోస్ వైరల్
మోడ్రన్ డ్రెస్‌లో వామికా - నేచర్ ఎంజాయ్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ... ఫోటోస్ వైరల్
kalavari kodalu kanaka mahalakshmi serial today April 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిల కండీషన్ సీరియస్! ఇద్దరికీ ఒకే సారి ఏమైంది?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిల కండీషన్ సీరియస్! ఇద్దరికీ ఒకే సారి ఏమైంది?
The Indian Story Release Date : కాజల్ అగర్వాల్ 'ది ఇండియన్ స్టోరీ' రిలీజ్ డేట్ ఫిక్స్ - రియల్ సంఘటనలే ఆధారంగా...
కాజల్ అగర్వాల్ 'ది ఇండియన్ స్టోరీ' రిలీజ్ డేట్ ఫిక్స్ - రియల్ సంఘటనలే ఆధారంగా...

వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
SRH vs RR IPL 2026 Highlights | టేబుల్ టాపర్‌గా SRH
Prabhsimran Singh Hits 6 Fours in an Over IPL 2026 | ప్రభ్‌సిమ్రన్ సిక్సర్ల రికార్డ్
KL Rahul 152 Runs vs PBKS IPL 2026 | సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్
Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Rahul: కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
Andhra University:
"శతాయుష్మాన్ భవ" ఏయూను దీవించిన ప్రముఖులు! ఘనంగా ముగిసిన శతాబ్ది వసంతాల వేడుకలు! ప్రత్యేక ఆకర్షణగా సచిన్, త్రివిక్రమ్
Hyderabad IT Corridor: హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
live in relationship: సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
Tips for Child Sleep : పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే.. తల్లిదండ్రులు తప్పకుండా పాటించాల్సిన టిప్స్
పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే.. తల్లిదండ్రులు తప్పకుండా పాటించాల్సిన టిప్స్
Social Post : మోడ్రన్ డ్రెస్‌లో వామికా - నేచర్ ఎంజాయ్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ... ఫోటోస్ వైరల్
మోడ్రన్ డ్రెస్‌లో వామికా - నేచర్ ఎంజాయ్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ... ఫోటోస్ వైరల్
KCR : కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు తెలంగాణ పౌరుషం లేదా? - బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ నిప్పులు
కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు తెలంగాణ పౌరుషం లేదా? బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ నిప్పులు
Antilia menu: అంబానీ ఇంట్లో రోజుకు నాలుగు వేల చపాతీలు తయారీ - కానీ అన్నీ పని వాళ్లకే - మరి వాళ్లేం తింటారు?
అంబానీ ఇంట్లో రోజుకు నాలుగు వేల చపాతీలు తయారీ - కానీ అన్నీ పని వాళ్లకే - మరి వాళ్లేం తింటారు?
Embed widget