అన్వేషించండి
Advertisement
Dhanush: విడాకులు తీసుకున్న ధనుష్, ఐశ్వర్య.. ఇప్పుడు ఒకే హోటల్ లో..
విడాకులు తీసుకున్న ధనుష్, ఐశ్వర్య ఇప్పుడు ఒకేచోట ఉన్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల తన భార్య ఐశ్వర్యతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు వీరిద్దరూ ఒకేచోట ఉన్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వస్తే.. ధనుష్, ఐశ్వర్య విడాకుల తరువాత తమ జీవితాల్లో బిజీ అయిపోయారు. ఓ పక్క ధనుష్ తన సినిమా షూటింగ్స్ తో గడుపుతుంటే.. ఐశ్వర్య ఓ పాటను చిత్రీకరించే పనిలో పడ్డారు.
వీటికోసం ఈ జంట హైదరాబాద్ లోనే ఉంటుంది. ఓ లవ్ సాంగ్ షూటింగ్ కోసం ఇటీవల హైదరాబాద్ కి వచ్చారు ఐశ్వర్య. ధనుష్ 'సార్' షూటింగ్ కోసం సిటీకి వచ్చారు. హైదరాబాద్ కి వచ్చిన ఈ జంట రామోజీ రావు స్టూడియోలోని సితార హోటల్‌లో బస చేస్తునట్లు తెలుస్తోంది. విడిపోయిన ఈ జంట ఇప్పుడు హోటల్ లో ఉంటున్నారు.
ఐశ్వర్య డైరెక్ట్ చేస్తోన్న లవ్ సాంగ్ ను వాలంటైన్స్ డేకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ధనుష్, ఐశ్వర్య 2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. 18 ఏళ్ల పాటు కలిసి జీవించిన ఈ జంట 2022 జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఈ విషయంలో అభిమానులు చాలా బాధపడ్డారు. ధనుష్-ఐశ్వర్య మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటున్నారు. రీసెంట్ గా ధనుష్ తండ్రి కూడా వారు మళ్లీ కలుస్తారని చెప్పడం చర్చకు దారి తీసింది. మరి నిజంగానే ఈ జంట ఫ్యామిలీ, ఫ్యాన్స్ కోసం ఒకటవుతుందో.. లేక ఎవరిదారులు వారు చూసుకుంటారో చూడాలి!
🙏🙏🙏🙏🙏 pic.twitter.com/hAPu2aPp4n
— Dhanush (@dhanushkraja) January 17, 2022
View this post on Instagram
Also Read: చై-సామ్ విడాకులు.. ఆ చెత్త వార్తలు బాధపెట్టాయంటున్న నాగ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విజయవాడ
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion