Badava Rascal: జాలీ రెడ్డి విలన్... 'బడవ రాస్కెల్' హీరో
'పుష్ప'లో జాలీ రెడ్డి పాత్రలో నటించిన ధనుంజయ, త్వరలో 'బడవ రాస్కెల్'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

'పుష్ప: ది రైజ్'లో జాలీ రెడ్డిగా నటించిన కన్నడ హీరో ధనుంజయ గుర్తు ఉన్నారు కదా! ఆల్రెడీ ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. 'పుష్ప' సినిమాకు ముందు రామ్ గోపాల్ వర్మ 'భైరవ గీత' సినిమా చేశారు. త్వరలో 'బడవ రాస్కెల్'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ధనుంజయ కథానాయకుడిగా నటించిన కన్నడ సినిమా 'బడవ రాస్కెల్'. ఇందులో అమృతా అయ్యంగార్ కథానాయిక. ఆల్రెడీ కన్నడలో సినిమా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు తెలుగులో అదే పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీమతి గీత శివరాజ్ కుమార్ సమర్పణలో శ్రీమతి సావిత్రమ్మ అడవి స్వామి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో డాలీ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేయనున్నాయి.
ఈ సందర్భంగా రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రిజ్వాన్ మాట్లాడుతూ "కన్నడలో సినిమాకు అద్భుత స్పందన లభించింది. సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో కూడా అదే స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. 'పుష్ప'లో జాలీ రెడ్డిగా విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసిన ధనుంజయ గారు, ఈ సినిమాలో హీరోగా డిఫరెంట్ షేడ్ చూపిస్తారు. ఆయన యాక్టింగ్ సినిమాకు హైలైట్. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం" అని చెప్పారు. ఈ చిత్రానికి శంకర్ గురు దర్శకత్వం వహించారు. రిజ్వాన్ నిర్వాణం సారధ్యం వహించారు. తెలుగు మాటలు, పాటలు రామ్ వంశీకృష్ణ రాశారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ప్రీతా జయరామన్, కూర్పు : నిరంజన్ దేవర మని, పోరాటాలు : వినోద్, నృత్యాలు : తగరు రాజు, సహ నిర్మాత : ఖుషి, సమర్పణ : శ్రీమతి గీత శివరాజ్ కుమార్, నిర్మాత : సావిత్రమ్మ అడవి స్వామి.
View this post on Instagram
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















