అన్వేషించండి

Brahmanandam Birthday: ఆనందో బ్రహ్మ.. ఆనంద మానందమాయే మది బ్రహ్మానందమాయే.. 

ఈరోజు బ్రహ్మానందం 66వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.   

ఒక్క ఎక్స్ ప్రెషన్ తో ఇట్టే నవ్వించేస్తారు బ్రహ్మానందం. అందుకే ఆయన్ను కామెడీ కింగ్, నవ్వుల రారాజు, హాస్యబ్రహ్మ ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. ఈరోజు ఆయన 66వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రముఖ  జంధ్యాల ఆయన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. బ్రహ్మానందం ఆంధ్రప్రదేశ్ లోని సత్తెన్నపల్లిలో 1956 ఫిబ్రవరి 1న జన్మించారు. చదువు పూర్తయిన తరువాత అత్తిలిలో కాలేజ్ లెక్చరర్ గా పని చేశారు. అదే సమయంలో ఆయనకు జంధ్యాల గారు సినిమాలో అవకాశం ఇచ్చారు. 

నరేష్ హీరోగా నటించిన తాతావతారం సినిమాలో నటించారు బ్రహ్మానందం. ఆ తరువాత జంధ్యాల గారు రూపొందించిన పలు సినిమాల్లో కమెడియన్ గా కనిపించారు బ్రహ్మి. అందులో 'అహ నా పెళ్లంట' సినిమాలో బ్రహ్మానందం కామెడీని ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. అరగుండు అవతారంలో ఆయన నటనకు జనాలు పగలబడి నవ్వారు. 

ఆ సినిమా తరువాత బ్రహ్మానందం కెరీర్ మలుపు తీసుకుంది. స్టార్ హీరో సినిమా అంటే అందులో కచ్చితంగా బ్రహ్మానందం ఉండాల్సిందే. బ్రహ్మి డేట్స్ ని బట్టి స్టార్ హీరోలు షూటింగ్ అడ్జస్ట్ చేసుకున్న రోజులు చాలానే ఉన్నాయి. రోజుకి 18 గంటలు పని చేస్తూ.. ఇప్పటివరకు పన్నెండు వందలకు పైగా సినిమాల్లో నటించారు. ఈ జెనరేషన్ వాళ్లకు కూడా బ్రహ్మానందం హాట్ ఫేవరెట్. సోషల్ మీడియాలో ఆయనకున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. బ్రహ్మానందం మీమ్ వేయకపోతే మీమర్స్ కి ఆరోజు గడవదు. 

బ్రహ్మానందం మంచి కమెడియన్ మాత్రమే కాదు.. మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. ఆయన మిమిక్రీను చాలా ఎంజాయ్ చేస్తానని ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి సైతం చెప్పారు. కమెడియన్ గా ఆయన ఇండస్ట్రీకి చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2010లో పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బ్రహ్మానందానికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది.2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు బ్రహ్మానందం. ఇప్పుడు సినిమాలను తగ్గించి తనలోని కళా నైపుణ్యానికి పదునుపెట్టారు. అలానే 'మై ఎక్స్ పీరియన్స్ విత్ గాడ్' అనే పుస్తకాన్ని రాస్తున్నారు. 

ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన తను రాష్ట్రపతి భవన్ కి వెళ్లి పద్మశ్రీ అవార్డు అందుకోగలిగానంటే దానికి తన కష్టం ఒక్కటే కారణం కాదని.. ఇలాంటి స్థితి కల్పించింది దేవుడే అని అంటారు బ్రహ్మానందం. అందుకే తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పేపర్ పై రాయాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల చెప్పారు బ్రహ్మి. ఆ పుస్తకం చదివి బ్రహ్మానందం అనేవాడు ఒకడుండేవాడు.. వాడు దేవుడిని నమ్ముకున్నాడు.. మనం కూడా నమ్ముకుందామని ఒక్కరైనా అనుకోవాలని.. అందుకే పుస్తకం రాస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

అందరినీ కడుపుబ్బా నవ్వించే బ్రహ్మానందంను ఎవరు నవ్విస్తారో తెలుసా..? ఆయన మనవడు పార్ధు. తన మనవడికి ఏదైనా చెబుతామని అనుకున్నప్పుడు.. 'తాత నీకు తెలియదు నువ్ ఊరుకో..' అని విసుక్కుంటాడట. మనవడితో అలా అనిపించుకోవడం తనకు నచ్చుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు బ్రహ్మి. ఇప్పుడు ఇంట్లో ఎక్కువ సమయం పార్ధుతోనే గడుపుతున్నట్లు చెప్పారు. ఆయన ఇలానే నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ.. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం! 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Brahmanandam Kanneganti (@actorbrahmanandam)

టాప్ హెడ్ లైన్స్

Tabu In King 100: మహంతి ఝాన్సీ రాణి అనే నేను... నాగార్జున 'కింగ్ 100'లో పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా టబు - గ్లింప్స్ చూశారా?
మహంతి ఝాన్సీ రాణి అనే నేను... నాగార్జున 'కింగ్ 100'లో పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా టబు - గ్లింప్స్ చూశారా?
Nindu Manasulu Serial Today November 4th: నిండు మనసులు: మళ్లీ నా మీద ప్రేమ మొదలైందా: సిద్ధూ ప్రశ్నకి ప్రేరణ షాక్! తీర్థయాత్రలకు ఫ్యామిలీ!
నిండు మనసులు: మళ్లీ నా మీద ప్రేమ మొదలైందా: సిద్ధూ ప్రశ్నకి ప్రేరణ షాక్! తీర్థయాత్రలకు ఫ్యామిలీ!
Illu Illalu Pillalu Serial Today November 4th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విడాకుల విషయంలో తండ్రికి ఎదురు తిరిగిన చందు! అందరి కాళ్ల మీద పడుతున్న వల్లీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విడాకుల విషయంలో తండ్రికి ఎదురు తిరిగిన చందు! అందరి కాళ్ల మీద పడుతున్న వల్లీ!
Srinath Maganti: శ్రీనాథ్ మాగంటి బెటరా? సుశాంతే బాగా చేశాడా? 'ఈఎన్ఈ 2' ట్రైలర్‌తో డిస్కషన్ షురూ
శ్రీనాథ్ మాగంటి బెటరా? సుశాంతే బాగా చేశాడా? 'ఈఎన్ఈ 2' ట్రైలర్‌తో డిస్కషన్ షురూ

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
KTR Help: మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
మాట నిలబెట్టుకున్న కేటీఆర్. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
Besan Ladoo : దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
Norton 450 Urban ఆవిష్కరణ.. 47hp ఇంజిన్, 8-అంగుళాల TFT స్క్రీన్‌తో రెండు వేరియంట్లు
Norton కొత్త బైక్‌లు చూశారా? హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించే డిజైన్‌తో 450 Urban
Hyderabad Crime News: ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
Borewell NOC Rules: తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. బోర్‌వెల్స్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు జారీ
తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. బోర్‌వెల్స్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు జారీ
Embed widget