అన్వేషించండి

Ali on Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో గ్యాప్ రాలేదు, క్రియేట్ చేశారు - మంచు లక్ష్మికి థ్యాంక్స్: అలీ

‘అలీతో సరదాగా’ షో ఈ సీజన్ ఎండ్ అయ్యింది. 3 వందలకు పైగా ఎపిసోడ్లు కొనసాగిన ఈ షో చివరి ఎపిసోడ్ లో, యాంకర్ సుమ అలీని ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా  అలీ పవన్ కళ్యాణ్‌ గురించి కీలక విషయాలు చెప్పారు.

‘అలీతో సరదాగా’.. తెలుగు బుల్లితెరపై బాగా పాపులర్ అయిన షో. అలీ హోస్ట్ చేసినా ఈ షోలో, ఎంతో మంది సినీ ప్రముఖులు పాల్గొని తమ సినీ అనుభవాలను వివరించారు. సినిమా పరిశ్రమలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. ఎలా అవకాశాలను దక్కించుకున్నారు? ఉన్నత స్థాయికి  చేరుకునేందుకు ఎంతలా శ్రమించారు? అనే విషయాలను వివరించారు. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి ప్రముఖ కమెడియన్ గా ఎదిగిన అలీకి సినిమా ఇండస్ట్రీ మీద మంచి పట్టుంది. అందుకే, ఆయా సినీ ప్రముఖులను ఆయన అడిగే ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా ఉండేవి. ఫన్నీ ఫన్నీగా సాగుతూనే సీరియస్ విషయాలను డిస్కస్ చేసేవారు అలీ.

పవన్ కళ్యాణ్‌తో గ్యాప్ రాలేదు, గ్యాప్ క్రియేట్ చేశారు-అలీ

తాజాగా ఈ పాపులర్ షో సీజన్ ఎండ్ అయ్యింది. ఈ షోకు సంబంధించిన చివరి ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో యాంకర్ సుమ, అలీని ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా అలీ తన కుటుంబ, సినిమా జర్నీకి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ తో తనకు దూరం పెరగడంపైనా స్పందించారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ తో తనకు గ్యాప్ రాలేదని చెప్పారు. “పవన్ కళ్యాణ్‌తో గ్యాప్ రాలేదు, గ్యాప్ క్రియేట్ చేశారు” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అలీ. ఇంతకీ గ్యాప్ క్రియేట్ చేసింది ఎవరు? అనే విషయాన్ని పూర్తి ఎపిసోడ్ లో చెప్పే అవకాశం ఉంది. వాస్తవానికి తాను హీరో అవుతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. రాజబాబు తనకు స్ఫూర్తి అని చెప్పారు. ఆయనలా గొప్ప కమెడియన్ కావాలి అనుకున్నట్లు చెప్పారు.

సుమా ఈక్వల్ టు ఫ్లాంతర్ ఫకిడీ!

అంతకు ముందు షోలోకి అడుగు పెట్టిన అలీకి యాంకర్ సుమ శాలువా కప్పి..  “మీకన్న వయసులో చిన్న దాన్ని ఆశీర్వదించండి..” అంటూ కాళ్లు మొక్కుతుంది. ఈ సందర్భంగా అలీ బొకేలోని పూలు తీసి సుమ మీద చల్లుతాడు. “ ఈరోజు అలీని అడిగేసి కడిగేస్తాను” అంటుంది సుమ. కడగడానికి నీళ్లు తెచ్చావా? అంటాడు అలీ.. వేరేవి కూడా తెచ్చాను ఎందుకు లెండి! అనగానే షో అంతా నవ్వుల పువ్వులు పూశాయి. తాజాగా తాను ఆస్ట్రేలియా వెళ్లానని అలీ చెప్పాడు. అక్కడ ఉండే ఎన్నారైలు తన షోను యూట్యూబ్ లో చూస్తారని తెలిపాడు. అలా ఒక ఇంట్లో తన షో చూస్తుండగా వారి ఇంటికి వెళ్లానని.. వెంటనే వాళ్ల పిల్లలు ఆనందంతో ఎగిరిగంతేశారని చెప్పాడు. ఫ్లాంతర్ ఫకిడీ అంటే ఫ్లవర్ అని తెలిపాడు అలీ. దానికి సుమ రియాక్ట్ అవుతూ సుమ అంటే ఫ్లవర్, సుమా ఈక్వల్ టు ఫ్లవర్ ఈక్వల్ టు ఫ్లాంతర్ ఫకిడీయా? అనగానే నవ్వులే నవ్వులు.   

మంచు లక్ష్మికి థ్యాంక్స్, మరింత అద్భుతమైన షోతో వస్తా-అలీ

అటు ఈ సీజన్ ఎండింగ్ సందర్భంగా మంచు లక్ష్మికి థ్యాంక్స్ చెప్పాలన్నారు అలీ. తన షో మొదలు పెట్టిందే తనతో అన్నారు. ప్రస్తుతానికి బ్రేక్ తీసుకున్నా, త్వరలో మరింత అద్భుతమైన షోతో ముందురానున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో మిమిక్రీ చేస్తే రెండు రూపాయల కాగితం ఇచ్చేవారని, దాన్ని తన తల్లికి ఇస్తే అర్థరూపాయి ఇచ్చేదని చెప్పారు. ఆ తర్వాత 5, 10, 15 అంటూ పెరుగుతూ పోయాయని చెప్పారు. పెళ్లికి ముందు తన ఇంటిపక్కన ఉన్న అమ్మాయితో లవ్ ట్రాక్ కొనసాగిందని చెప్పారు.  

Read Also: అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం, ఆ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా గుర్తింపు

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Irumudi Trailer : ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Embed widget