![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో సమంత సందడి చేసిన 'ఊ అంటావా మావ, ఊఊ అంటావా మావ' సాంగ్ పలు రికార్డులు సృష్టించింది. ఇప్పుడు క్రికెట్ స్టేడియంలో ఆ పాట ప్లే చేయడం విశేషం.
![Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా Viral Video Pushapa Movie Samatha's Oo Antava song Craze at Cricket Stadium In Florida Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/10/39513895463164ebf9b8580359fc32d51660116059693313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప : ది రైజ్' సినిమా థియేటర్లలో విడుదలై ఎనిమిది నెలలు అవుతోంది. ఓటీటీలోనూ సినిమా వచ్చింది. అందులో స్టార్ హీరోయిన్ సమంత చేసిన స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' (Oo Antava Oo Oo Antava Song) విడుదలై కూడా ఎనిమిది నెలలు దాటుతోంది. పాట వచ్చి ఇన్ని నెలలు అయినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. అందుకు ఉదాహరణ మొన్న జరిగిన క్రికెట్ మ్యాచ్.
ఇండియా, వెస్ట్ ఇండీస్ మధ్య ఫ్లోరిడాలో టీ 20 క్రికెట్ మ్యాచ్ జరిగింది కదా! ఆ రోజు కొంత మంది తెలుగు వాళ్ళు మ్యాచ్ చూడటానికి వెళ్ళారు. మధ్యలో 'ఊ అంటావా ఊఊ అంటావా' సాంగ్ ప్లే చేస్తూ స్టెప్పులు వేశారు. అప్పుడు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.
'ఊ అంటావా ఊఊ అంటావా' సాంగ్ విడుదల అయినప్పుడు లిరిక్స్ పట్ల కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. మగవారిపై విమర్శలు చేశారని, ఇది సరి కాదని కొందరు చెప్పుకొచ్చారు. సమంత డబ్బుల కోసం ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారని, అందాల ప్రదర్శనలో హద్దులు మీరుతున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన జనాలు కూడా ఉన్నారు. అయితే... ఈ పాటకు మెజారిటీ ప్రేక్షకుల నుంచి ఆమోద ముద్ర లభించిందని చెప్పాలి.
Also Read : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?
Oo Antava song at Central Broward Park & Broward County Stadium
— ArvindTweets (@ArvindRam_7) August 7, 2022
Lauderhill, Florida#INDvsWI #AlluArjun #Pushpa pic.twitter.com/X0a9My0h5h
యూట్యూబ్‌లో 'ఊ అంటావా ఊఊ అంటావా' సాంగ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ పాటకు థియేటర్లలో ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభించింది. పబ్బులు, క్లబ్బులు... ఎక్కడ చూసినా కొన్నాళ్ళు ఈ పాట వినిపించింది. క్రికెట్ స్టేడియంలో లేటెస్టుగా ఈ సాంగ్ వినిపించడంతో మరోసారి సాంగ్ క్రేజ్ ఎంత అనేది తెలిసింది.
'పుష్ప : ది క్రేజ్' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... ఉత్తరాదిలో కూడా అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కంటే భారీ ఎత్తున సెకండ్ పార్ట్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం 'పుష్ప 2' ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 'పుష్ప'లో ఉన్న ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు రెండో పార్ట్ లో కూడా కనిపించనున్నారు.
'పుష్ప 2'లో సమంత ఉంటారా?
'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' పాట ఈ రేంజ్ హిట్ కావడంతో 'పుష్ప 2'లో స్పెషల్ సాంగ్ మీద అంచనాలు మరింత పెరుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అయితే... అందులో సమంత ఉంటారా? లేదా మరొకరిని తీసుకు వస్తారా? అనే చర్చ మొదలైంది. దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కలయికలో సినిమా అంటే స్పెషల్ సాంగ్ ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురు చూసే ప్రేక్షకులు ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)