అన్వేషించండి

‘స్కంద’ లుక్ నుంచి 'డబుల్ ఇస్మార్ట్' స్టైల్‌లోకి మారిన రామ్ - మేకోవర్ వీడియో చూశారా?

పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో 'డబుల్ ఇస్మార్ట్' అనే ప్రాజెక్టు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ కోసం రామ్ మేకోవర్ అయిన వీడియోని ఛార్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఉస్తాద్ హీరో రామ్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. అలాగే అప్పటివరకు ప్లాప్స్ లో ఉన్న పూరి జగన్నాథ్ కి ఈ సినిమా భారీ కం బ్యాక్ ఇచ్చింది. ఇక మరోసారి ఈ కాంబో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' అంటూ కలిశారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించి లాంచ్ ఈవెంట్ కూడా జరిగింది. కొంతమంది ప్రత్యేక అతిధుల సమక్షంలో ఈ ఈవెంట్ జరగగా.. చార్మి క్లాప్ కొట్టింది. రామ్ పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు.

ఇక ముహూర్తపు షాట్లో "ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్" అని రామ్ చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంది. జూలై 12 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ముంబైలో స్టార్ట్ కానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా హీరో రామ్ 'డబుల్ ఇస్మార్ట్' కోసం పూర్తిగా మేకవర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఛార్మి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హీరో రామ్ కి హెయిర్ కట్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ హెయిర్ స్టైల్ కి మించి ఈ సినిమాలో రామ్ మేకోవర్ ఉండబోతుందని తాజా వీడియోతో స్పష్టం చేశారు. ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ.. "ఇస్మార్ట్ శంకర్ వచ్చేసాడు. ఇది డబుల్ ఇస్మార్ట్ టైం. రేపు ముంబైలో షూటింగ్ కోసం అంతా సిద్ధం" అంటూ పలు ఆసక్తికర పోస్టులు పెట్టింది.

ఛార్మి షేర్ చేసిన లేటెస్ట్ వీడియోలో  రామ్ మేకోవర్ అదిరిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈసారి రామ్ ని మరింత మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా 'ఇస్మార్ట్ శంకర్' మూవీ రామ్ తో పూరి జగన్నాథ్ కెరీర్ కి చాలా ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే ఈ సినిమాకి వచ్చినంత రెస్పాన్స్ ఇద్దరికీ మరే సినిమాకి రాలేదు. దీంతో ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. పూరి జగన్నాథ్ ఈ సీక్వెల్ కోసం చాలా పెద్ద స్పాన్ కలిగిన కథను ప్రిపేర్ చేసినట్లు సమాచారం. ఈ కథని అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

రీసెంట్గా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'లైగర్' బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో ప్రస్తుతం పూరీ ఆశలన్నీ ఈ ప్రాజెక్టు పైనే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఇతర నటీనటుల వివరాలను మూవీ టీం త్వరలోనే అనౌన్స్ చేయనుంది. ఈసారి 'డబుల్ ఇస్మార్ట్' ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 8, 2024 మహాశివరాత్రికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు.

Also Read : రజినీకాంత్ కూతురు రెండో పెళ్లి? ఆ యువ హీరోతో ప్రేమాయణం?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Charmmekaur (@charmmekaur)

టాప్ హెడ్ లైన్స్

Indraja: స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
Fauzi Vs Spirit: 'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
Mandaadi Collections: 'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు
'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు
Kiara Advani: మళ్ళీ తల్లి కాబోతున్న కియారా... సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన హీరోయిన్
మళ్ళీ తల్లి కాబోతున్న కియారా... సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన హీరోయిన్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget