అన్వేషించండి

UI First Look Teaser: ‘యూఐ’ టీజర్ - కొత్త ప్రపంచాన్ని సృష్టించిన ఉపేంద్ర, చూస్తే మీరే షాకవుతారు!

UI First Look Teaser: ఉపేంద్ర హీరోగా నటించడం మాత్రమే కాకుండా దర్శకత్వం వహించిన ‘యూఐ’ మూవీ టీజర్ తాజాగా విడుదలయ్యింది. అందులో ఉప్పీ చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించి భయపెడుతున్నారు.

UI First Look Teaser: కన్నడలో సీనియర్ హీరో అయిన ఉపేంద్ర.. గతకొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. అందరు ఒక ఫార్మాట్‌లో సినిమాలు చేస్తూ వెళ్లినా.. తను మాత్రం ఆ ఫార్మాట్ ఫాలో అవ్వకుండా డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నించేవారు ఉపేంద్ర. ఇక చాలాకాలం ‘యూఐ’ అనే పేరుతో ఒక కొత్త సినిమాలో నటించడంతో పాటు దానిని తానే డైరెక్ట్ చేశారు కూడా. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదలయ్యి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేసింది. ఇక తాజాగా దీనికి సంబంధించిన టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ చివర్లో ఉపేంద్ర లుక్ చాలా డిఫరెంట్‌గా అనిపిస్తోంది.

అప్పుడు గ్లింప్స్.. ఇప్పుడు టీజర్..
చాలాకాలం తర్వాత దర్శకుడిగా ఉపేంద్ర మైక్రోఫోన్ పట్టబోతున్నారన్న వార్త.. తన ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచేసింది. ఇక ఆ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ను గతేడాది సెప్టెంబర్‌లో తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు ఉపేంద్ర. ‘యూఐ’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీ గ్లింప్స్.. ప్రేక్షకులను అయోమయంలో పడేసింది. ఎందుకంటే ఈ గ్లింప్స్ అంతా చీకటిగా ఉంది. కేవలం డైలాగులు మాత్రమే వినిపించాయి. దీంతో ఇలాంటి గ్లింప్స్ ఎక్కడా చూడలేదంటూ సోషల్ మీడియాలో దీనిని తెగ షేర్ చేశారు ప్రేక్షకులు. ఇప్పుడు ‘యూఐ ఫస్ట్ లుక్ టీజర్’ పేరుతో ఒక టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 2 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్‌తో ప్రేక్షకులను మరింత కన్‌ఫ్యూజన్‌లో పడేశారు ఉపేంద్ర.

ఎలా తప్పించుకుంటావు?
‘అంతా చీకటిగా ఉంది. దీని నుండి ఎలా తప్పించుకుంటావు?’ అనే డైలాగ్‌తో ‘యూఐ’టీజర్ ప్రారంభమయ్యింది. ఆ తర్వాత టీజర్ మొత్తంలో ఒక్క డైలాగ్ కూడా లేదు. కేవలం పలువురు యాక్టర్ల షాట్స్ మాత్రమే ఉన్నాయి. చివర్లో గుర్రంపై ఉపేంద్ర ఎంట్రీ ఇచ్చారు. ఫైనల్‌గా ఈ మూవీలో తన లుక్‌ను రివీల్ చేశారు. ఇందులో ఉపేంద్ర డీ గ్లామర్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను భయపేట్టేలా ఉన్నారు. టీజర్‌ను బట్టి చూస్తే.. ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని అర్థమవుతోంది. పైగా విజువల్స్ కూడా రిచ్‌గా కనిపిస్తున్నాయి. అజనీష్ బీ లోక్‌నాథ్ ఇచ్చిన మ్యూజిక్.. ‘యూఐ’ టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది. 

రూ.100 కోట్ల బడ్జెట్‌తో..
2015లో ‘ఉప్పి 2’ అనే మూవీని డైరెక్ట్ చేసి నటించారు ఉపేంద్ర. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన మళ్లీ మైక్రోఫోన్ పట్టలేదు. దీంతో చాలాకాలం తర్వాత తమ అభిమాన నటుడు డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో ఉప్పీ ఫ్యాన్స్ అంతా ‘యూఐ’ కోసం ఎదురుచూస్తున్నారు. రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని లహరీ ఫిల్మ్స్ ఎల్‌ఎల్‌పీతో పాటు వీనస్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు నిర్మించాయి. వర్చువల్ రియాలిటీ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుందని గ్లింప్స్‌లోనే రివీల్ చేశారు. ఇందులో ఉపేంద్రతో పాటు సన్నీ లియోన్, మురళీ శర్మ, నిధి సుబ్బయ్య, ఇంద్రజీత్ లంకేశ్, మురళీ కృష్ణలాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ‘యూఐ’ చిత్రంలో 90 శాతం గ్రాఫిక్సే ఉంటాయని, దానికోసం చాలా ఖర్చుపెట్టామని ఇప్పటికే ఉపేంద్ర ఒక సందర్భంలో బయటపెట్టారు.

Also Read: సంక్రాంతికి ఓటీటీలో సందడే సందడి - ఈ వారం విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు ఇవే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Trisha Krishnan : మల్టీ స్టారర్‌లో హీరోయిన్‌గా త్రిష - రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
మల్టీ స్టారర్‌లో హీరోయిన్‌గా త్రిష - రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Tanikella Bharani : మోదీ గారిని కలిశా... ముట్టుకున్నా... చేతిని ముద్దాడా - తనికెళ్ల భరణి ఎమోషనల్
మోదీ గారిని కలిశా... ముట్టుకున్నా... చేతిని ముద్దాడా - తనికెళ్ల భరణి ఎమోషనల్
This Week OTT Movies : ఓటీటీలో ఈ వారం వెరీ స్పెషల్ - ధురంధర్ 2 To టీవీతో పాటు EXAM... మూవీస్, వెబ్ సిరీస్ ఫుల్ లిస్ట్
ఓటీటీలో ఈ వారం వెరీ స్పెషల్ - ధురంధర్ 2 To టీవీతో పాటు EXAM... మూవీస్, వెబ్ సిరీస్ ఫుల్ లిస్ట్

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget