అన్వేషించండి

Upendra: రజనీకాంత్‌ మూవీలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర! - హీరో షాకింగ్‌ పోస్ట్‌, అంతలోనే ట్వీట్‌ డిలీట్‌... 

Upendra tweet About Coolie Movie: కన్నడ స్టార్‌ హీరో, రియల్‌ స్టార్‌ ఉపేంద్ర రజనీకాంత్‌ కూలీ మూవీపై ట్వీట్‌ చేసి డిలీట్‌ చేశాడు. దీంతో ఇప్పుడి అంశం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. 

Real Star Upendra in rajanikanth Coolie Movie?: మూవీ రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ బ్యాక్‌ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. చివరిగా ఆయన లాల్‌ సలామ్‌ సినిమాతో అలరించారు. ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. ఇందులో రజనీ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కూలీ మూవీ చేస్తున్నారు.

రజనీ 171 వ చిత్రంగా కూలీ

తలైవ కెరీర్‌లో 171వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. విక్రమ్‌ సినిమా తర్వాత లోకేష్‌ కనకరాజ్‌కు దక్షిణాదలో ఫుల్ క్రేజ్‌ వచ్చింది. తెలుగులోనూ అతడికి మంచి ఫాలోయింగ్‌ వచ్చింది. దీంతో డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ సినిమా అనగానే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక రజనీతో ఆయన సినిమా అనగానే ఓ రేంజ్‌లో బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా సంబంధించి పలు అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి.

అంతలోనే ట్వీట్ డిలీట్

అందులో ఒక అప్‌డేట్‌ మాత్రం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. అదే ఈ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర నటిస్తున్నట్టు కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు మూవీ టీం నుంచి క్లారిటీ లేదు. సూపర్‌ స్టార్‌ సినిమాలో ఉపేంద్ర లాంటి విలక్షణ నటుడు భాగం అయితే మూవీకి మరింత ప్లస్‌ అవుతుందని ఫ్యాన్స్‌ అంతా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ అప్‌డేట్‌పై క్లారిటీ లేక అంతా డైలామాలో ఉన్నారు. ఈ క్రమంలో స్వయంగా హీరో ఉపేంద్ర చేసిన ట్వీట్‌ ఫ్యాన్స ఫుల్‌ ఖుషీ చేసింది. కానీ అంతలోనే ఆ ట్వీట్‌ డిలీట్‌ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. 


Upendra: రజనీకాంత్‌ మూవీలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర! - హీరో షాకింగ్‌ పోస్ట్‌, అంతలోనే ట్వీట్‌ డిలీట్‌... 

నా ఐడల్ సూపర్ స్టార్...

కొద్ది గంటల క్రితం ఉపేంద్ర ఓ ట్వీట్ చేశారు. ఇందులో రజనీకాంత్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ.. "నా ఐడల్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సర్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆశీర్వాదంగా భావిస్తున్నా. కూలీలో నేను కూడా నటిస్తున్నా" అంటూ #coolie అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ జత చేశారు. ఈ ట్వీట్‌ చేసిన కొద్ది సేపటికే ఆయన పోస్ట్‌ డిలీట్‌ చేయడం గమనార్హం. దీంతో ముందుకు నుంచి వినిపిస్తున్న రూమర్లకు ఉపేంద్ర ట్వీట్‌ మరింత బలాన్ని ఇచ్చింది. కానీ ఆయన ట్వీట్ డిలీట్‌ చేయడాని కారణం ఏంటన్నది మాత్రం తెలియదు. కానీ, అప్పటికే స్క్రీన్‌ షాట్స్‌ తీసిన నెటిజన్లు దానిని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఇది చూసి ఈ ఇద్దరి హీరో ఫ్యాన్స్‌ పండగా చేసుకుంటున్నారు. మూవీ టీం కండిషన్‌ వల్లే ఉపేంద్ర ఆ ట్వీట్‌ డిలీట్‌ చేసినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుస. 

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget