అన్వేషించండి

టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం - అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను అరెస్టు చేసిన పోలీసులు!

డ్రగ్స్ కేసులో అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ గోపీకృష్ణను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌లొ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ గోపీకృష్ణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత కొద్దిరోజులుగా గోవా నుంచి గోపీకృష్ణ డ్రగ్స్‌ తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నాడని పోలీసులకు పక్కా సమాచారం  అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. 

హఫీజ్‌పేట్‌ గోకుల్‌ ఫ్లాట్స్‌లో గోపీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన దగ్గర నుంచి 10 గ్రాముల డ్రగ్స్‌, రూ.55 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. గోపీకృష్ణతో పాటు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న అరబిక్‌ ట్యూటర్‌ అష్రఫ్‌ బేగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అష్రఫ్ దగ్గర నుంచి 13 గ్రాముల కొకైన్‌, రూ 65 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గోపీకృష్ణ, అఫ్రఫ్‌ల ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు.

ప్రస్తుతం డ్రగ్స్ కేసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. బాలీవుడ్‌తో పాటూ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమైన శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌ను కూడా ఇటీవలే డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి ఎంజీ రోడ్డులో రేవ్ పార్టీ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ 35 మంది వరకు అదుపులోకి తీసుకున్నారు.  వారిలో సిద్ధాంత్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి శాంపిల్స్‌ని పరీక్షలకు పంపగా ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయినట్టు చెప్పారు. ఆ ఆరుగురిలో సిద్ధాంత్ కపూర్ కూడా ఉన్నాడు. వీరిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

గతంలో శ్రద్ధాను కూడా నార్కోటిక్స్ అధికారులు డ్రగ్స్ వాడకం విషయంలో విచారించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో శ్రద్ధా విచారణను ఎదుర్కొంది. సినిమా ఇండస్ట్రీపై డ్రగ్స్ నీలి నీడలు ఎప్పటికప్పుడు కమ్ముకుంటూనే ఉన్నాయి. గతేడాది షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కూడా రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణలనతో అరెస్టయ్యాడు. ముంబై తీరంలో ఉన్న ఓ క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీపై దాడి చేసి పోలీసులు ఆర్యన్ ఖాన్ ను పట్టుకున్నారు. అయితే చివరికి ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది ఆయన్ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by bollywood Exclusive updates (@bollycode)

టాప్ హెడ్ లైన్స్

Manchu Manoj Reaction : ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం - చేయాల్సింది చాలా ఉందంటూ మంచు మనోజ్ ఎమోషనల్
ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం - చేయాల్సింది చాలా ఉందంటూ మంచు మనోజ్ ఎమోషనల్
VISA Movie Release Date : యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'వింటారా సరదాగా' - న్యూ ఇయర్ రోజున VISA రిలీజ్
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'వింటారా సరదాగా' - న్యూ ఇయర్ రోజున VISA రిలీజ్
Crime Thriller OTT : నగరంలో మూడో మర్డర్ జరిగిందా? - రెండు ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
నగరంలో మూడో మర్డర్ జరిగిందా? - రెండు ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Dada Dhamaka Song Lyrics : ట్రెండింగ్‌లో దాదా ధమాకా సాంగ్ - బాలయ్య పాడిన మాస్ లిరిక్స్... గూస్ బంప్స్
ట్రెండింగ్‌లో దాదా ధమాకా సాంగ్ - బాలయ్య పాడిన మాస్ లిరిక్స్... గూస్ బంప్స్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
N Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Raptadu Accused Hemant: మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Gurnoor Brar News: టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
AP CII Partnership Summit 2026: 12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
Embed widget