(Source: ECI/ABP News/ABP Majha)
RRR Movie Naatu Naatu Song: ‘‘నాటు నాటు’’ పాటను ఉక్రెయిన్‌లో చిత్రీకరించడానికి అసలు కారణం ఇదేనట!
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఆర్ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటను ఇండియాలో చిత్రీకరించాల్సి ఉన్నా వర్షాకాలం అవ్వడం వల్ల ఉక్రెయిన్ లో చిత్రీకరించినట్లుగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు
అక్కడే ఎందుకంటే..
‘‘ఉక్రెయిన్ అధ్యక్ష భవనానికి ఉన్న రంగులు, ముందు ఉన్న ఖాళీ ప్రదేశం.. అన్ని విధాలుగా ‘‘నాటు నాటు’’ పాటకు అనుకూలం ఉంటుందని అనుకున్నాం. అక్కడ అనుమతి దక్కుతుందా? లేదా? అనే అనుమానం కూడా మాకు కలిగింది. కానీ ఆ దేశ అధ్యక్షుడు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి కావడం వల్ల పాట చిత్రీకరణకు అనుమతి దక్కింది’’ అని రాజమౌళి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పాట పూర్తయిన తర్వాత ‘‘నాటు నాటు’’కు చిత్రీకరణకు ఇదే సరైన ప్లేస్ అని చాలామంది కొనియాడారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్ కఠోర శ్రమ
‘‘నాటు నాటు’’ పాటకు లొకేషన్ ఎంపిక పెద్ద ప్రహసనం అన్నట్లుగా సాగింది. ఆ తర్వాత షూటింగ్ సమయంలో కూడా రాజమౌళి ఎక్కడ రాజీ పడలేదు. ముఖ్యంగా ఇద్దరు హీరోల స్టెప్స్ విషయంలో చాలా టేక్ లు తీసుకోవాల్సి వచ్చిందట. చిన్న చిన్న విషయాల వల్ల కూడా రీ టేక్ కు వెళ్లాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పేర్కొన్నారు. ఆ పాట చిత్రీకరణ సమయంలో రాజమౌళిపై కోపం కూడా వచ్చిందని సరదాగా ఆ ఇంటర్వ్యూలో చరణ్, తారక్ అన్నారంటే ఆయన వారిని ఎంత ఇబ్బంది పెట్టారో అర్థం చేసుకోవచ్చు. అంతగా కష్టపడ్డారు కాబట్టే ఇప్పుడు అది అంతర్జాతీయ స్థాయి గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతమైందని అభిమానులు అంటున్నారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు నామినేషన్స్‌లో ‘‘నాటు నాటు’’ సాంగ్ ఉంది. ఒక్క అడుగు దూరంలో ఆస్కార్ అవార్డుకు చేరువలో ఉంది. మరి ఆ అవార్డు మనకు దక్కుతుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.