అన్వేషించండి

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, ‘ఆదిపురుష్’ నుంచి ఉపశమనానికి ‘సలార్’ టీజర్ - ఎప్పుడంటే?

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'సలార్' సినిమాకు సంబంధించి త్వరలోనే టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'సలార్' కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో రకాల రూమర్స్ తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా 'KGF' సిరీస్ తో 'సలార్'కి లింక్ ఉందని, సలార్ రెండు భాగాలుగా రాబోతుందని అంతేకాకుండా ‘సలార్’లో కేజీఎఫ్ హీరో యశ్ కూడా ఉంటాడని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. ఈ వార్తలతో సినిమాపై ఉన్న అంచనాలు సైతం పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే 'సలార్' నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫాన్స్ మూవీ యూనిట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే గత కొన్ని రోజులుగా త్వరలోనే సలార్ టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ దానిపై ఇప్పటివరకు అఫీషియల్ అప్డేట్ రాలేదు.

నిజానికి ‘సలార్’ టీజర్ ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ ‘ఆదిపురుష్’ వల్ల టీజర్ ని ముందే రిలీజ్ చేయలేదు. ఇక ‘ఆదిపురుష్’ రిలీజ్ అయిపోయింది. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. అయితే, ఈ మూవీపై వస్తున్న విమర్శలు ప్రభాస్ ఫ్యాన్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘సలార్’ మూవీ టీజర్ రిలీజ్ ద్వారా ఉపశమనం కలిగించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 

లేటెస్ట్ ఫిలింనగర్ రిపోర్ట్స్ ప్రకారం రాబోయే రెండు వారాల్లో ‘సలార్’ టీజర్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారడంతో ఈ న్యూస్ తో డార్లింగ్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న సలార్ సెప్టెంబర్ 28, 2023న విడుదలవుతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

కాగా ఇప్పటికే సలార్ పై ప్రేక్షకుల్లోనూ అటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. 'కే జి ఎఫ్' సిరీస్ తో పాన్ ఇండియా డైరెక్టర్గా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంథ్ నీల్ సలార్ సినిమాలో ప్రభాస్ ని ఎలా చూపించాడో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాల్లో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు, భువన గౌడ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. KGF సిరీస్ ని నిర్మించిన హోం భలే ఫిలిమ్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. శృతిహాసన్ ఈ మూవీలో జర్నలిస్ట్ ఆద్య పాత్రలో నటిస్తుండగా, సుకుమారన్ వరదరాజమన్నార్, జగపతిబాబు రాజ్ మన్నార్ పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి విజయ్ కిరగందుర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Read Also: ‘ది ఆర్చీస్’ ట్రైలర్‌: కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన స్టార్ కిడ్స్ - షారుఖ్‌, అమితాబ్, శ్రీదేవి వారసులు ఇరగదీశారంతే!

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget