By: ABP Desam | Updated at : 15 May 2023 01:44 PM (IST)
అదా శర్మ(Image Credits: Adah Sharma/Instagram)
Adah Sharma : 'ది కేరళ స్టోరీ' సినిమాతో హీరోయిన్ అదా శర్మ ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ పలువురి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా విజయంపై స్పందించిన అదా శర్మ.. తన భావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తాను ఏ సినిమా చేసిన అదే తన చివరి సినిమా అన్నట్టుగా చేస్తానని తెలిపారు.
ప్రేక్షకుల నుంచి తనకు లభించిన ప్రేమ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన అదా.. తాను చేసే ప్రతి చిత్రం, అదే తన చివరి చిత్రమని భావిస్తానని చెప్పుకొచ్చింది. తనపై ఎవరికైనా నమ్మకం ఉంటుందా లేదా తనకు మరో అవకాశం వస్తుందా, రాదా అనే ఆలోచన ఉండదని తెలిపింది. కానీ తాను చేసిన పాత్రపై ప్రేక్షకుల అంచనాలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయని ఆమె అభిప్రాయపడింది. ప్రేక్షకులు ఎప్పుడూ తనను వైవిధ్యమైన పాత్రల్లో చూడాలని అడుగుతుంటారని.. వారి ఆశలు, కలలన్నీ ఇప్పుడు నిజమయ్యాయని తాను నమ్ముతున్నట్టు అదా వివరించింది. ఈ సందర్బంగా తనను తాను అదృష్టవంతురాలిగా పేర్కొంది.
ఈ చిత్రం అపూర్వమైన విజయాన్నిస్తుందని మీరు ఊహించారా అని అడిగిన ప్రశ్నకు, స్పందించిన అదా.. తాను ఇంతటి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని చెప్పింది. సినిమా వీక్షించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసింది. చిన్నతనంలో తాను ఏనుగు లేదా కుక్కతో ఆడుకుంటున్నట్టు కల కనేదాన్నని అదా తెలిపింది. తాను మంచి ఉద్యోగం పొందాలని ఆశించేదని, కానీ అది ఎలా జరుగుతుందన్నది మాత్రం తనకు తెలిసేది కాదని అదా చెప్పింది. ఈ సినిమాతో తాను చాలా ఆశీర్వదించబడినట్లు భావిస్తున్నానని, ఒక మహిళ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని ఇంతగా ఆదరిస్తారని, ఇంతటి ప్రశంసలు వస్తాయని ఊహించలేదని, కలలో కూడా అనుకోలేదని అదా చెప్పుకొచ్చింది.
దీన్ని బట్టి చూస్తే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన ఉత్సాహభరితమైన ఆదరణ అదాను బాగా కదిలించనట్టు తెలుస్తోంది. యువతులలో చైతన్యం కలిగించడమే లక్ష్యంగా తెరకెక్కిన ఈ సినిమానుకు ఎన్ని వివాదాలు, విమర్శలు ఎదురైనా.. ప్రస్తుతం చాలా మంది ఈ సినిమాను వీక్షించేందుకు ఇంట్రస్ట్ చూపిస్చున్నారు.
చివరగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన సానుకూల ఆదరణను గురించి పేర్కొన్న అదా... ఒక నటిగా ప్రజలు తమ ఫర్మామెన్స్ చూసి ఆదరించారని, అందుకు తానెప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని వెల్లడించింది. ఆమె తన చిన్నతనంలో, ప్రపంచ వ్యాప్తంగా విజయం దక్కించుకున్న ఓం శాంతి ఓంలోని షారుఖ్ ఖాన్ పాత్రకు ఎంతటి ఆదరణ వచ్చిందో.. ఇప్పుడే అదే తరహా ఫీలింగ్ ను అదా ఎక్స్ పీరియన్స్ చేస్చున్నట్టు తెలిపింది.
కాంట్రవర్శియల్ మూవీగా పేరు తెచ్చుకున్న 'ది కేరళ స్టోరీ'.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మే 5న రిలీజైంది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతే కాదు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రం.. బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రూ. 100 కోట్ల మార్క్ ను రీచ్ అయి, రికార్డు సృష్టించింది.
Read Also: ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్! జూనియర్ బర్త్ రోజున రివీల్?
మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం
Rangabali Teaser: ‘మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది’ - నాగశౌర్య ‘రంగబలి’ టీజర్ అదిరిపోయిందిగా
Dhoomam Telugu Trailer : ధూమం - నా పేరు ముఖేష్ యాడ్ అందరూ చూసేలా చేస్తే?
Tamanna: చేతిలో మందు గ్లాస్, బీచ్‌లో డ్యాన్స్ - బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్న తమన్నా, వీడియో వైరల్
Filmfare Awards: ఆ అవార్డులను వాష్ రూమ్ హ్యాండిల్‌గా వాడతా - ‘ఫిల్మ్‌ఫేర్’పై నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలు
KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్
Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!
YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్