Sushmita Konidela: చరణ్‌కు.. నాకు గొడవపెట్టి ఆయన ఆనందించేవారు, పవన్ బాబాయ్ కాదు అన్న: సుస్మితా కొణిదెల
Sushmita Konidela: పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడంపై మొదటిసారి స్పందించారు చిరంజీవి పెద్ద కూతురు, ప్రొడ్యూసర్ సుస్మితా కొణిదెల. పవన్ కల్యాణ్ గురించి కొన్ని సీక్రెట్స్ షేర్ చేశారు ఆమె.
Sushmita Konidela About Deputy CM Pawan Kalyan: మెగా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఆనందంలో మునిగి తేలుతుంది. కారణం.. పదేళ్ల కష్టం ఫలించింది. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ అంశంపై స్పందించారు చిరంజీవి పెద్ద కూతురు, ప్రొడ్యూసర్ సుస్మితా కొణిదెల. ఆమె నిర్మించిన 'పరువు' వెబ్ సిరీస్ జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నారు సుస్మితా. తన కెరీర్, బాబాయ్ గురించి, క్లీంకార గురించి చాలా చెప్పారు. ఆ విశేషాలు మీ కోసం.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటి?
దేవుడు దయవల్ల దీని తర్వాత ఒక సిరీస్ రైటింగ్ లో ఉంది. త్వరలోనే సెట్స్ లోకి వెళ్తుంది. ఇది కాకుండా ఒక పెద్ద ఫీచర్ ఫిలిమ్ తియ్యాలని అనుకుంటున్నాను. దాని ప్లానింగ్ కూడా జరుగుతుంది. ఈ రెండు ఆన్ బోర్డ్ లో ఉన్నాయి. అవి కాకుండా క్రియేటివ్ డిస్కషన్స్, స్టోరీలు వినడం లాంటివి చేస్తూ ఉంటాం. ఒక మంచి స్క్రిప్ట్ ఉంటే వెంటనే స్టార్ట్ చేసేస్తా.
బిగ్ ప్రాజెక్ట్ అంటే బిగ్ స్టార్ తో సినిమానా?
బిగర్ స్టార్ అంటే.. నా గోల్డ్ బాక్స్ కి ఆయన చాలా పెద్ద స్టారే. ఇప్పటికే దానికి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. కానీ, దాన్ని మేం ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అందరికీ ఆయనతో ఒక సినిమా చేయాలని ఉంటుంది కదా? నాన్నగారితో (చిరంజీవి). నేను కూడా ఆ రేస్ లో ఉన్నాను, ఆ క్యూలో ఉన్నాను. ఏడాది నుంచి స్టోరీస్ పిక్ చేస్తున్నాను. దాదాపు లాక్ అవుతుంది. విశ్వంభర తర్వాతి ప్రాజెక్ట్ నాదే అవ్వాలని మీరంతా కోరుకోండి. విశ్వంభరాకి కూడా నేను కాస్ట్యూమ్ చేస్తున్నాను. అత్తమాస్ కిచెన్ కి ఇద్దరు ఎఫీషియంట్ ఉమెన్ ఉన్నారు. కాబట్టి నేను కేవలం తినిపెట్టడం వరకే. ఉపాసన చాలా మంచి ఐడియాలజీతో దాన్ని టేకప్ చేస్తుంది.
కెరీర్ ఎలా ఉంది?
ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను అనే విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. ప్రతి విషయంలో నా బెస్ట్ ఇస్తున్నా. టైంపాస్ కో, ఏదో చేద్దాంలే అనే నేచర్ కాదు. ఏది టేకప్ చేసుకున్నా నా బెస్ట్ ఇస్తాను. మిగతాది దేవుడి దయ. ఆడుతూ పాడుతూ పని చేసుకున్నామా లేదా? అనేది చూసుకుంటా. ప్రొడ్యూసర్స్ కూడా ఫిలిమ్ మేకర్స్. వాళ్లకు కూడా క్రియేటివిటీ ఉంటుంది. క్రియేటివీటీ, ప్యాష్ ఉండాలి. ఏదో డబ్బులు మాత్రమే పెట్టి వదిలేయం కాదు. ప్రొడక్షన్ మొదలుపెట్టినప్పుడు ప్రొడ్యూసర్ అవ్వాలి, డబ్బుల సంపాదించాలని అని కాదు. నేను ఇండస్ట్రీలో పెరిగాను. చిన్నప్పటి నుంచి యాక్టర్స్ ని చూసి పెరిగాను. సినిమా ఒక్కటే నాకు తెలుసు. అందులో నేను ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను. చిన్నప్పటి నుంచి నాన్నతో స్టోరీ సిట్టింగ్ లో కూర్చుంటాను. అప్పుడు నా కంట్రిబ్యూషన్ ఏముంటుంది? అని ఆలోచించి ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయొచ్చు అని. ఆ తర్వాతే ఇంకా ఎక్సపాండ్ చేయాలనుకుని ప్రొడక్షన్ వైపు వచ్చాను. ఇక నా ఫస్ట్ సినిమాకి నేను అసలు రెమ్యునరేషన్ తీసుకోలేదు. 'ఇంద్ర' సినిమాలో 'రాధేగోవింద' పాటకు కాస్ట్యూమ్ డిజైనింగ్ నేను చేశా. నాన్న గారి థమ్స్ అప్ యాడ్స్ అన్నింటికీ నేనే డిజైన్ చేశాను.
బాబాయ్ డిప్యూటీ సీఎం అవ్వడం ఎలా అనిపించింది?
మిక్స్ ఫీలింగ్స్ అసలు. నాగబాబు బాబాయ్ అంటే.. చిన్నప్పటి నుంచి బాబాయి, డాడీ తర్వాత ఆయనే అన్నట్లు ఫీలింగ్. కానీ, కల్యాణ్ బాబాయ్ అలా కాదు. ఒక పెద్ద అన్న అనే ఫీలింగ్. చిన్నప్పటి నుంచి ఆటపట్టిచ్చేవాళ్లు, ఏడిపించేవాళ్లు అలా అన్న లాగా ఉండేవారు. నన్ను, చరణ్ ని బాగా వాడుకుని ఆయన ఎంటర్ టైన్ అయ్యేవాళ్లు. వీళ్ల ఇద్దరికీ గొడవ పెట్టేసి కొట్టుకుంటే నేను ఎంటర్ టైన్ అవ్వొచ్చు అనుకునేవాళ్లు. అల్లరి యాంగిల్ చాలా ఉంది బాబాయ్ లో. కానీ, ఆయన ఐడియాలజీ చాలా గొప్పగా ఉంటుంది. ఆయన మాట్లాడే తీరు చూస్తే చాలా లిబరేటెడ్ గా అనిపిస్తుంది. ఒక మనిషికి ఇన్ని రెస్ట్రిక్షన్స్, ఇన్ని లేయర్స్ ఉండకూడదు. భూమి మీదికి వచ్చింది మనల్ని మనం ఎక్స్ ప్లోర్ చేసుకోవాడానికి. ఆయన్ని చూస్తే ఆ ఫ్రీడమ్ కలుగుతుంది. స్ట్రాంగ్ ఐడియాలజీలు ఉన్నాయి. చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ పదేళ్లు. ఆయన్ని అలా చూస్తే చాలా ఆనందంగా, గర్వంగా అనిపిస్తుంది. పాలిటిక్స్ లో నాకు అంత నాలెడ్జ్ చేయలేదు. కానీ, పిచ్చి హోప్, ప్రేయర్స్ అయితే చేశాను ఆయన కోసం. ఇక విమర్శలు అంటారా.. ఒకసారి ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత అలాంటివన్నీ పడాలి. కానీ, ఆయన చూసినప్పుడల్లా ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది అనుకునేదాన్ని. అదే నమ్మాను. అలాంటప్పుడు ఆ మాటలు మమల్ని ఎఫెక్ట్ చేయవు. ఆయన కూడా వచ్చి వాటి గురించి మాట్లాడేవారు కాదు. మన గోల్ ఏంటి? ప్రజలకు సేవ చేయడం అనేవారు. ఈ ఎన్నికల ఫలితాలు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చాయి.
దేవుడే రివీల్ చేశాడు..
క్లీంకార పుట్టిన తర్వాత నేను చాలా మారిపోయాను. జనరల్ గా నా కూతుళ్ల ఫొటోలు అందరికీ చూపించి ఎలా చేస్తుంది చూడు? ఇలా చేస్తుంది చూడు అని చెప్పి పక్కనోళ్లను విసికించలేదు. కానీ, క్లీంకార ఫొటోలు మాత్రం అలా కాదు. అందరికీ చూపించి హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నిన్న కూడా నివేదకి చూపించాను. చూడు పాప ఎంత ముద్దుగా ఉందో, ఎంత క్యూట్ గా ఉందో అని. పేరెంట్స్ అప్పుడే చూపించకూడదు అని అనుకున్నారు. కానీ, దేవుడు వేరే ప్లాన్ చేశారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చూపించాడు.
Also Read: అలా చేయకపోతే వరుణ్ సందేశ్‌ను కొడతా, నా కొడుకు పేరు అదే - ‘నింద’ ప్రెస్ మీట్‌లో హీరో నిఖిల్