Mayank Agarwal : 'దేవర', 'పుష్ప - 2', 'కల్కి' కోసం వెయిటింగ్ : మయాంక్ అగర్వాల్
Mayank Agarwal : సన్ రైజర్స్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దేవర, పుష్ప - 2, కల్కీ సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని ఆయన అన్నారు.
![Mayank Agarwal : 'దేవర', 'పుష్ప - 2', 'కల్కి' కోసం వెయిటింగ్ : మయాంక్ అగర్వాల్ Sunrisers Hyderabad Cricketer Mayank Agarwal is Excited About Kalki 2898 AD, Devara and Pushpa 2 Mayank Agarwal : 'దేవర', 'పుష్ప - 2', 'కల్కి' కోసం వెయిటింగ్ : మయాంక్ అగర్వాల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/23/fd605aeabc30a03423a6c2ad65d3fe201711182927654932_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sunrisers Hyderabad Cricketer Mayank Agarwal: ఇప్పుడంతా ఐపీఎల్ మేనియా నడుస్తోంది. తమ అభిమాన ఆటగాళ్లు ఎంత కొడతారో?, ఏ రికార్డులు సృష్టిస్తారో?, కప్ ఎవరు కొడతారో? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు క్రికెట్ లవర్స్. కానీ, ఆ క్రికెటర్స్ మాత్రం మన హీరోలు చేసే సినిమాలు చూసేందుకు ఎగ్జైటెడ్ గా ఉన్నారట. సన్ రైజర్స్ ఆటగాడు మయాంక్ తన మనసులో మాట బయటపెట్టారు. సినిమాలు ఎప్పుడెప్పుడు చూద్దామా? అని వెయిట్ చేస్తున్నానని చెప్పారు ఆయన. ఇప్పుడు ఆయన చెప్పిన ఆ మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. అటు సినిమా ఫ్యాన్స్, ఇటు క్రికెట్ ఫ్యాన్స్ ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
'పుష్ప' చూశాను.. ఆ సినిమా కోసం వెయిటింగ్
ఐపీఎల్ సీజన్ కావడంతో ఆటగాళ్లు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాళ్లపై స్పెషల్ వీడియోలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా సన్ రైజర్స్ ఆటగాడు మయాంక్ మాట్లాడుతూ.. 'పుష్ప' సినిమా చూశాను.. ఇంకా 'పుష్ప - 2', 'దేవర', 'కల్కీ' సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాను. అవి కూడా చూడాలి అంటూ తన మనసులో మాట బయటపెట్టారు మయాంక్. ఇక ఈ వీడియో ట్విట్టర్ లో తెగ వైరల్ అవుతోంది.
కొనసాగుతున్న పుష్ప మేనియా..
పుష్ప సినిమాలోని చాలా డైలాగులు తెగ వైరల్ అయ్యాయి. తగ్గేదేలే, శ్రీ వల్లి స్టెప్ అప్పట్లో ట్రెండింగ్. ఆ ట్రెండ్ ని ఎంతోమంది క్రికెటర్లు ఫాలో అయ్యారు అప్పట్లో. చాలామంది పుష్ప డైలాగ్ చెప్తూ వీడియోలు చేశారు. ఇక దాంట్లో స్పెషల్ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఆయన చేసిన వీడియోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మయాంక్ కూడా పుష్ప గురించి చెప్పడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. తగ్గేదేలే అంటూ కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఆ సినిమాల విషయానికొస్తే.. 'పుష్ప - 2' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దానికి సంబంధించి టీజర్, అల్లుఅర్జున్ లుక్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా? అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 'పుష్ప 2' సినిమా.. 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'పుష్ప: ది రూల్' పేరుతో పార్ట్ 2 రానుంది. సుకుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'పుష్ప: ది రైజ్' సినిమాకి రెండో భాగంగా తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
దసరాకి 'దేవర'..
ఎన్టీఆర్ జాన్వీ కపూర్ నటిస్తున్న చిత్రం దేవర. జనతా గ్యారేజ్' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఇది. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు. కాగా.. దసరాకి దేవర రిలీజ్ చేయనున్నారు మేకర్స్. 10.10.2024... అక్టోబర్ 10న 'దేవర' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
శరవేగంగా షూటింగ్..
టాలీవుడ్ నుంచి ఈ ఏడాది రాబోతున్న ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో 'కల్కి 2898 ఏడీ' ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)