అన్వేషించండి

Single Sequel: సింగిల్ కాదు... సీక్వెల్ కూడా - ఎండింగ్‌లో ట్విస్ట్ ఇచ్చిన శ్రీ విష్ణు

Sree Vishnu: 'సింగిల్' మూవీ క్లైమాక్స్‌లో సీక్వెల్ హింట్ ఇచ్చి హైప్ పెంచేశారు శ్రీ విష్ణు. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సీక్వెల్ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి నెలకొంది.

Sree Vishnu's Single Sequel Confirmed: శ్రీ విష్ణు ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సింగిల్' బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చారు శ్రీ విష్ణు. దీంతో ఈ కామెడీ అలానే కంటిన్యూ అవుతుందా.. స్టోరీ ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. సింగిల్‌గానే..

ఈ మూవీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీని కామెడీ జానర్‌లో చూపించారు. సాధారణంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటేనే క్లైమాక్స్‌లో ఎండింగ్ పడిపోతుంది. కానీ 'సింగిల్' (Single) మూవీలో డిఫరెంట్‌గా సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇస్తూ శుభం కార్డు వేశారు శ్రీవిష్ణు. మరి స్టోరీ ఎలా ఉండబోతోందనేదే ఇప్పుడు లేటెస్ట్ బజ్. 

ప్రస్తుతం రీ రిలీజెస్, సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇదే కామెడీ జానర్‌లో వచ్చిన 'మ్యాడ్' సీక్వెల్.. 'మ్యాడ్ స్క్వేర్' కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. ఇప్పుడు అదే పంథాను శ్రీ విష్ణు ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. 'సింగిల్' టైటిల్‌కు తగ్గట్లుగానే స్టోరీని ముగించి రెండో పార్ట్‌కు లీడ్ ఇచ్చారు. త్వరలోనే దీనిపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.

Also Read: బాలయ్య 'అఖండ 2'లో సీనియర్ హీరోయిన్ లయ కుమార్తె - ఆ వార్తల్లో నిజమెంత?

'సింగిల్' మూవీని కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా.. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించారు. గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలిమ్స్ సంస్థతో కలిసి విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు.

స్టోరీ ఏంటంటే?

ఎఫ్‌డీసీ బ్యాంకు ఉద్యోగిగా ఉన్న విజయ్ (శ్రీ విష్ణు) తన స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిశోర్) లవ్‌కు హెల్ప్ చేస్తూ పూర్వ (కేతికా శర్మ)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కారు షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తుంది. పూర్వను ప్రేమలో పడేసేందుకు తనదైన ప్లాన్స్ వేస్తుంటాడు విజయ్. అయితే, ఆ ప్లాన్స్ బెడిసికొట్టి హరిణి (ఇవానా) అతనితో ప్రేమలో పడుతుంది. తనను ప్రేమించాలంటూ విజయ్ వెంటపడుతుంది.

విజయ్ మాత్రం పూర్వాను ప్రేమిస్తాడు. ఆమెతో పరిచయం పెంచుకొని లవ్‌లో పడేయాలని కార్ షోరూంకు వెళ్తాడు. కార్ కొంటానని ఆ అమ్మాయితో ట్రావెల్ చేస్తాడు. చివరకు అసలు విషయం చెప్తాడు. అప్పుడు విజయ్‌ను పూర్వ ఛీ కొడుతుంది. అప్పటి నుంచి అతడిని దూరం పెడుతుందని అనుకుంటే... మళ్లీ విజయ్ దగ్గరకు పూర్వ వస్తుంది. ఎందుకు? ఇదే సమయంలో హరిణి విజయ్ వెంటపడుతుంది. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరకు ఎలా ముగిసింది? పూర్వను విజయ్ ప్రేమలో పడేశాడా? హరిణి లవ్ సక్సెస్ అయ్యిందా? ఎప్పుడూ విజయ్ వెంట ఉండే అతని స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిషోర్) ఏం చేశాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్, డైలాగ్స్ మూవీకే హైలెట్ అని అంటున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Allari Naresh Kanakadurga Song : భవానీగా అల్లరి నరేష్ - ఇంద్రకీలాద్రిపై లోకాలనేలే కనకదుర్గమ్మ... డివోషనల్ సాంగ్ లిరిక్స్
భవానీగా అల్లరి నరేష్ - ఇంద్రకీలాద్రిపై లోకాలనేలే కనకదుర్గమ్మ... డివోషనల్ సాంగ్ లిరిక్స్
The Paradise OTT: ఓటీటీలో నాని 'ప్యారడైజ్'... అఫీషియల్ డేట్ ఫిక్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలో నాని 'ప్యారడైజ్'... అఫీషియల్ డేట్ ఫిక్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Ranikanth Movies OTT : థియేటర్లలో జైలర్ 2 హవా - ఓటీటీల్లో రజనీ కాంత్ టాప్ ట్రెండింగ్ మూవీస్
థియేటర్లలో జైలర్ 2 హవా - ఓటీటీల్లో రజనీ కాంత్ టాప్ ట్రెండింగ్ మూవీస్
Crime Thriller Series OTT : గ్యాంగ్ స్టర్ 'అక్క' వయలెన్స్ మామూలుగా లేదు - కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
గ్యాంగ్ స్టర్ 'అక్క' వయలెన్స్ మామూలుగా లేదు - కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Crime Thriller Series OTT : గ్యాంగ్ స్టర్ 'అక్క' వయలెన్స్ మామూలుగా లేదు - కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
గ్యాంగ్ స్టర్ 'అక్క' వయలెన్స్ మామూలుగా లేదు - కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Embed widget