అన్వేషించండి

Suriya, Jyothika’s Net Worth: సూర్య కంటే జ్యోతిక ఆదాయం ఎక్కువ? సౌత్ స్టార్ కపుల్‌కు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా?

Suriya & Jyothika’s Net Worth: స్టార్ కపుల్ సూర్య - జ్యోతికలు సక్సెస్ ఫుల్ గా తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇటీవలే ముంబైకి మకాం మార్చిన ఈ జంట ఆస్తుల గురించి బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Jyothika & Suriya’s Assets Net Worth: సౌత్ స్టార్ కపుల్ సూర్య - జ్యోతిక ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీల్ లైఫ్ లో కలిసి నటించిన ఈ జంట.. ప్రేమ వివాహం చేసుకొని ఎంతో అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన జ్యోతిక.. సెకండ్ ఇన్నింగ్స్ లో ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటుతోంది. అలానే '2D ఎంటర్టైన్మెంట్స్'‏ అనే ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలు చూసుకుంటోంది. ఈ క్రమంలో తన భర్త సూర్య కంటే జ్యోతిక భారీ ఆస్తులను సంపాదించిందని.. గత పదేళ్లలో సూర్య ఆదాయంలో పెద్దగా పెరుగుదలేమీ కనిపించలేదని వార్తలు వస్తున్నాయి. 

గత కొన్నేళ్లుగా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సూర్య - జ్యోతిక దంపతులు సినీ రంగంలో బాగానే స్థిరపడి ఉన్నారు. అయితే వీరిద్దరికీ కలిపి దాదాపు రూ.537 కోట్ల నికర ఆస్తులు ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. అందులో జ్యోతిక ఆస్తుల నికర విలువ దాదాపు 331 కోట్లు ఉంటుందని.. మొత్తం ఆస్తిలో ఆమె వాటా 60 శాతానికి పైగానే ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. దీని ప్రకారం సూర్య కంటే జ్యోతిక ఆస్తుల విలువ ఎక్కువ అని పేర్కొంటున్నారు. గత 10 సంవత్సరాలలో సూర్య ఆదాయం కనిష్ట వృద్ధిని సాధించగా.. ఆయన సతీమణి నెట్ వాల్యూ మాత్రం భారీగా పెరిగిందని అంటున్నారు. 

1999లో 'పూవేల్లం కేట్టుప్పర్' సినిమాలో తొలిసారిగా కలిసి నటించిన సూర్య - జ్యోతికలు.. ఆన్ స్క్రీన్ లో సక్సెస్ ఫుల్ జోడీ అనిపించుకున్నారు. ఈ క్రమంలో ఒకరితో ఒకరు ప్రేమలో పడి 2006 లో పెళ్లి చేసుకొని వివాహ బంధంలో అడుగుపెట్టారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 2017లో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక, బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతోంది. మరోవైపు సూర్య కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా చెన్నైలోనే ఉన్న ఈ జంట, ఇటీవలే ముంబైకి మకాం మార్చారు. అక్కడ రూ.70 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేసినట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. వారి పిల్లలను సైతం ముంబైలోని పాఠశాలల్లో జాయిన్ చేసారని అంటున్నారు. భార్యా భర్తలిద్దరూ హిందీ ప్రాజెక్ట్‌లపై ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి ముంబయికి షిఫ్ట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

1998లో 'డోలీ సజాకే రఖ్నా' సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జ్యోతిక, దాదాపు 26 సంవత్సరాల తర్వాత 'షైతాన్' మూవీతో తిరిగి వచ్చింది. ఇందు కోసం ఆమె రూ.5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఈ హారర్ చిత్రంలో అజయ్ దేవగన్, ఆర్ మాధవన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో జ్యోతిక నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇది సీనియర్ నటికి బాలీవుడ్ లో మంచి కంబ్యాక్ అని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. జ్యోతిక ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌ ఓటీటీ కోసం 'డబ్బా కార్టెల్' అనే వెబ్ మూవీ చేస్తోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. దీంతో పాటుగా 'శ్రీ' అనే హిందీ చిత్రంలో జ్యో కనిపించబోతోంది. 

మరోవైపు సూర్య ప్రస్తుతం సిరుతై శివ దర్శకత్వంలో 'కంగువ' అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఇందులో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. హై టెక్నికల్ వాల్యూస్ తో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో 3డీలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇది తాము ఊహించిన దానికంటే వంద రెట్లు అద్భుతంగా వచ్చిందని సూర్య ఇటీవల తెలిపారు. రాబోయే అక్టోబర్‌ నుంచి తన 43వ చిత్రాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నానని, ఆ తర్వాత వెట్రిమారన్‌ తో ‘వాడి వసల్‌’ సినిమా తిరిగి పట్టాలెక్కుతుందని చెప్పారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో 'రోలెక్స్' మూవీ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇక తన సినిమా 'ఆకాశం నీ హద్దురా' హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న 'సర్ఫియా' చిత్రంలో సూర్య క్యామియో రోల్ చేస్తున్నారు. 

Also Read: 'జగన్‌ను ఓడించాలని కాదు, నువ్వు గెలవాలని లక్ష్యంగా పెట్టుకో పవన్'

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget