అన్వేషించండి

Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా

Sivaji Raja: ఒకప్పుడు శివాజీ రాజా, నాగబాబు మంచి స్నేహితులు. కానీ పవన్ కళ్యాణ్ చేసిన గొడవ వల్ల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అసలు ఏం జరిగిందో తాజాగా బయటపెట్టారు శివాజీ రాజా.

Sivaji Raja: సినీ పరిశ్రమ అన్న తర్వాత నటీనటులు, మేకర్స్ మధ్య మనస్పర్థలు సహజం. చిన్న చిన్న విషయాల వల్ల ఎన్నో ఏళ్లుగా మాట్లాడకుండా ఉండిపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా, నాగబాబు కూడా ఒకరు. ఒకప్పుడు శివాజీ రాజా, నాగబాబు మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉండేవారు. కానీ ఇప్పుడు వారిద్దరూ కనీసం మాట్లాడుకోవడం లేదు. దాని వెనుక కారణమేంటి అని తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్యూలో బయటపెట్టారు శివాజీ రాజా. అంతే కాకుండా పవన్ కళ్యాణ్.. తన ఆఫీస్‌కు వచ్చి చేసిన గొడవ గురించి కూడా వివరించారు.

నాకే తెలియదు..

‘‘దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అసలు నాగబాబుకు, నాకు మధ్య మనస్పర్థలు ఎందుకు వచ్చాయో నాకు తెలియదు. ఏమైంది అని అడగాలనుకున్నా అడిగే స్టేజ్ దాటిపోయింది. మధ్యలో కొందరు ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ ఒకరోజు ఆఫీస్‌కు వచ్చి గొడవ చేసి.. తర్వాత మిమ్మల్ని ప్రెసిడెంట్ అవ్వనివ్వను అన్నాడు. మంచిదే కదా రెస్ట్ తీసుకుంటాను అన్నాను. ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు గొడవ చేశాడు ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు. ఏదో కోపంలో వచ్చి రాఘవేంద్ర రావుకు, సురేశ్ బాబుకు ఫోన్ చెయ్యి అన్నాడు. ఇద్దరూ అందుబాటులో లేరని తనతో చెప్పాను. అతని ఎమోషన్ ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాం కదా. నాకు అన్యాయం జరిగింది. దీనికి సమాధానం ఎవరు చెప్తారు అన్నాడు. దాంతో మూవీ ఆర్టిస్ట్‌కు, ఛాంబర్‌కు సంబంధం ఏముంది?’’ అని ముందుగా పవన్ కళ్యాణ్ చేసిన గొడవ గురించి బయటపెట్టారు శివాజీ రాజా.

నేను వదలలేదు..

‘‘ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 20 మంది లాయర్లను తీసుకొచ్చాడు. కొందరితో కలిసి ఐజీ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసి ఫైల్ తీసుకొచ్చి ఆయన చేతికి ఇచ్చాం. ఫైల్ చూసే ఓపిక కూడా ఆయనకు లేదు. ఆయన అప్పటికే నాకు చాలా క్లోజ్. అయినా కూడా పట్టించుకోకుండా లోపల లాయర్లు ఉన్నారు వాళ్లకు ఇవ్వు అన్నాడు. మీటింగ్ హాల్ మొత్తం లాయర్లతో నిండిపోయింది. వాళ్లకి ఇచ్చేశాక ఆయనతో చెప్దామనుకుంటే ఆ మాట కూడా ఆయన వినలేదు. నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే నాకోసం ఏం చేశావు నువ్వు అన్నారు. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నందుకే ఐజీకి ఫిర్యాదు చేశాం ఫైల్ చూసుకోండి అన్నాను. నేను ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే డ్రగ్స్ సమస్యలు వచ్చాయి. ఇంకెవరైనా అయ్యింటే వదిలేస్తారు. నేను వదలలేదు’’ అని అసలు ఆరోజు ఏం జరిగిందో వివరణ ఇచ్చారు.

ఓపిక ఉండదు..

‘‘ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్‌కు కొన్నిరోజులు ఉంది అనగా రాజశేఖర్ దగ్గరికి వెళ్లిపోయాడు నాగబాబు. ఇండస్ట్రీలో అప్పుడప్పుడు షాకులు తింటాం కదా. అది ఒక షాక్ నాకు. ఇవన్నీ దాదాపు కరోనా టైమ్‌లోనే జరిగాయి. మంచు విష్ణు ప్రెసిడెంట్ అయిన చాలారోజుల తర్వాత వెళ్లి కలిసి లేనివాళ్లను బాగా చూసుకో అని చెప్పాను. యూత్‌కు అంత ఓపిక ఉండదు. వాళ్లు చేయాలనుకుంటే చాలా చేయొచ్చు. పక్కనవాళ్లు కూడా కరెక్ట్‌గా ఉండాలి’’ అని మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అవ్వడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు శివాజీ రాజా.

Also Read: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!

టాప్ హెడ్ లైన్స్

Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Mahesh Babu : బన్నీ, రామ్ చరణ్, నేను... ఇప్పుడు జయకృష్ణ - దత్తు గారి ప్లాన్ అదుర్స్... శ్రీనివాస మంగాపురంపై మహేశ్ బాబు రియాక్షన్
బన్నీ, రామ్ చరణ్, నేను... ఇప్పుడు జయకృష్ణ - దత్తు గారి ప్లాన్ అదుర్స్... శ్రీనివాస మంగాపురంపై మహేశ్ బాబు రియాక్షన్
Chennai Love Story OTT : చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget