Suchi Leaks: మళ్లీ మొదలైన సుచీ లీక్స్ వివాదం - కమల్ హాసన్‌పై సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు, ఫ్యాన్స్ ఫైర్
సింగర్ సుచిత్ర మరో సంచలన కామెంట్స్ చేసింది. మొన్న ధనుష్ సంచలన కామెంట్స్ చేసిన ఆమె తాజాగా కమల్ హాసన్ ను టార్గెట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన ఆమె కమల్ హాసన్‌పై సంచలన ఆరోపణలు చేసింది.
Singer Suchitra Shocking Comments on Kamal Haasan: ఆ మధ్య సుచి లీక్స్ కోలీవుడ్ ఇండస్ట్రీని ఎంతగా షేక్ చేసిందో ప్రత్యకంగా చెప్పనవరం లేదు. గాయనీ సుచిత్ర అకౌంట్ నుంచి హీరో ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, ఆండ్రియా, త్రిషల ప్రైవేటు వీడియోలు, ఫోటోలు లీక్ అయిన అంశం అప్పట్లో సంచలనం రేపింది. సుచీ లీక్స్ కారణంగా ధనుష్, అనిరుధ్, ఆండ్రియా, అమలాపాల్, హన్సిక, త్రిష, అమీ జాక్సన్, సింగర్ చిన్మయి ఇలా ఎందరో హాట్‌టాపిక్ అయ్యారు. దీంతో సుచీ లీక్స్ పేరు వినగానే ఇండస్ట్రీవర్గాలంతా హడలేత్తిపోయారు. 2017లో కోలీవుడ్ ఇండస్ట్రీని అంతగా కుదిపేసిన సుచి లీక్స్ వివాదం ఇప్పుడు మళ్లీ మొదలైంది.
ఇప్పుడు మళ్లీ రోజుకో సెలబ్రిటీని టార్గెట్ చేస్తుంది. రెండు రోజుల క్రితం తన భర్త స్వలింగ సంపర్కుడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు హీరో ధనుష్ కూడా గే అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. ఇక ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్‌కు ధనుష్ కంటే ముందు మరోకరితో ఎఫైర్ ఉండేదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు తాజాగా విశ్వనాయకుడు కమల్ హాసన్‌ను టార్గెట్ చేసింది. రీసెంట్‌గాలో ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె కమల్ హాసన్ కూడా గే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
“Kamal Hassan is a transgender!” 🤯
— Aaku Bhai (@samuraigambhira) May 15, 2024
Shocking revelation by singer #Suchitra
Arava nibba galla battalu oodadeestundi 😂😂😂#SuchiLeaks
pic.twitter.com/eWN4RzYiij
ఇందులో సుచిత్ర ఓ ట్రాన్స్‌జెండర్‌తో కలిసి ఇంటర్య్వూలో పాల్గొంది. ఆమె పేరు మాయ. ఆమె గతంలో తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొని లైమ్‌టైల్లోకి వచ్చింది. తమిళ్ బిగ్‌బాస్ 4తో సుచిత్ర కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. గత సీజన్‌లో ట్రాన్స్‌జెండర్ మాయ పాల్గొంది. అయితే తాజాగా ఆమెతో కలిసి తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా మాయ తన బిగ్‌బాస్ ఎక్స్‌పిరియన్స్ గురించి చెబుతుంటే మధ్యలో సుచిత్ర కలగజేసుకుంది. అవును.. మాయతో పాటు కమల్ హాసన్ కూడా ట్రాన్స్ జెండర్ అయి ఉంటారు. ఎందుకంటే ఆయన వస్రధారణ కూడా అలాగే ఉంటుంది. కమల్ ఎక్కువగా చుడిదార్, కుర్తాలే ధరిస్తారు. ఆయన నటించి 'విశ్వరూపం' సినిమాలో క్లాసికల్ డ్యాన్స చేస్తుండగా ఆయన ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ట్రాన్స్ జెండర్స్ మాదిరిగానే ఉంటాయి.
పైగా ఆ సీన్‌లో ఆయన వైట్ డ్రెస్‌తో పాటు చుడీదార్ లాంటివి ధరిస్తారు. కమల్ నిజజీవితంలోనూ అలాంటి దుస్తులే ఎక్కువ ధరిస్తారు. బిగ్‌బాస్ హోస్ట్ చేస్తున్న సమయంలో కూడా ఇలాంకు కుర్తా, చుడిదారే వేసుకున్నారు. చాలా సార్లు ఆయనను గమనించాను కాబట్టి చేబుతున్నా" అంటూ సుచిత్ర సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు కోలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. కమల్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. అంతేకాదు సుచిత్ర మానసిక పరిస్థితి బాగాలేదు, అందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తుంది. ఇంకోసారి ఆమె ఇలా ఇంటర్య్వూలు తీసుకోకండి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ధనుష్ గే అంటూ ఊహించని కామెంట్స్ చేసిన సుచిత్ర ఇప్పుడు కమల్ హాసన్ కూడా గే అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం.