అన్వేషించండి

Shaitaan: జ్యోతిక ‘సైతాన్’ మూవీ సెన్సార్ పూర్తి - అరెరే, ఆ సీన్ తీసేశారట!

Shaitaan: అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స‌లో నటిస్తున్న హారర్ చిత్రమే ‘షైతాన్’. ఈ మూవీ మార్చి 8న విడుదలకు సిద్ధమవ్వగా తాజాగా సెన్సార్ బోర్డ్ కొన్ని మార్పులు చేర్పులు చెప్పింది.

Shaitaan Movie Completes Censor: ఒకప్పుడు సినిమా విడుదలకు కనీసం వారం ముందే సెన్సార్ పనులు పూర్తయ్యి.. వద్దు అనుకునే సీన్స్‌ను కట్ చేయమని సలహా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. విడుదలకు ఒకరోజు లేదా రెండు రోజుల ముందు సినిమాల్లో మార్పులు చెప్తోంది సెన్సార్ బోర్డ్. తాజాగా మరో హిందీ విషయం సినిమాలో కూడా అదే జరిగింది. అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్‌లో నటించిన ‘సైతాన్’ సినిమా మార్చి 8న విడుదలకు సిద్దమవ్వగా.. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చెప్పింది సెన్సార్. భయంకరంగా ఉన్న ఒక సీన్‌ను పూర్తి కట్ చేయమని ఆదేశించిందని సమాచారం.

ఆ సీన్ కట్..

అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్‌ చేస్తున్న ‘సైతాన్’పై బాలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా అంచనాలు పెరిగిపోయాయి. పూర్తిస్థాయి హారర్ చిత్రంగా తెరకెక్కిన ‘సైతాన్’ ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతుండగా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) యూ/ఏ సర్టిఫికెట్‌ను అందించి.. కొన్ని మార్పులు చెప్పినట్టు సమాచారం. దాంతో పాటు ఒక భయంకరమైన సీన్‌ను కట్ చేయమని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. గుజరాత్‌లో మంచి హిట్ అందుకున్న ‘వశ్’ అనే చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది ‘సైతాన్’. ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ఇప్పటికే ట్రైలర్, టీజర్ ద్వారా ఓ క్లారిటీ వచ్చింది.

హెచ్చరిక ఇవ్వాలి..

‘సైతాన్’ పూర్తిగా బ్లాక్ మ్యాజిక్, చేతబడిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి సినిమా మొదలయ్యే ముందే.. ‘ఈ చిత్రం బ్లాక్ మ్యాజిక్‌ను సపోర్ట్ చేయడం లేదు’ అని హెచ్చరిక ఇవ్వాలని సెన్సార్ బోర్డ్ తెలిపింది. అంతే కాకుండా ఒక సీన్‌లో వచ్చే బూతు పదాన్ని అరుపుతో రీప్లేస్ చేయమని దర్శకుడు వికాస్ బాహ్ల్‌కు చెప్పింది. వీటితో పాటు రక్తం కనపడే సీన్స్‌ను 25 శాతం తగ్గించమని సెన్సార్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇక వారు చెప్పిన మార్పులు చేర్పులు అన్నీ చేసిన తర్వాత సినిమా రన్ టైమ్.. 132 నిమిషాలకు చేరింది. అంటే ‘సైతాన్’ రన్ టైమ్ కేవలం గంటన్నర మాత్రమే. దీంతో ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలను ఇష్టపడనివారికి ‘సైతాన్’ మొదటి ఛాయిస్‌గా మారనుంది.

చాలా ఏళ్ల తర్వాత..

జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ కలిసి ‘సైతాన్’ను సంయుక్తంగా నిర్మించారు. అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేర్ పాఠక్.. దీనికి నిర్మాతలుగా వ్యవహరించారు. మార్చి 8న విడుదల అవ్వనున్న ఈ సినిమాపై ఫస్ట్ లుక్ నుండే ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా చేశారు మేకర్స్. వికాస్ బాహ్ల్.. దీనిని డైరెక్ట్ చేశారు. ఒకప్పుడు హీరో, హీరోయిన్‌గా కలిసి నటించిన మాధవన్, జ్యోతిక మళ్లీ దాదాపు పాతికేళ్ల తర్వాత ఇలా బాలీవుడ్‌లో కలిసి నటిస్తూ రీఎంట్రీకి సిద్ధమయ్యారు. పెళ్లి తర్వాత సినిమాల్లో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండని జ్యోతిక.. ఎన్నో ఏళ్ల తర్వాత ‘సైతాన్’తో మరోసారి హిందీ ప్రేక్షకులను నేరుగా పలకరించనుంది.

Also Read: స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌కు చేదు అనుభవం - అసభ్యంగా తాకిన అభిమాని, షాకైన నటి

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget