అన్వేషించండి

Hanuman Movie: 'హనుమాన్' మూవీపై స్పందించిన దర్శకేంద్రుడు - అద్భుతం అంటూ ప్రశంసలు!

Hanuman : హనుమాన్ సినిమాపై దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.

K Raghavendra Rao About Hanuman success : తేజా సజ్జ హీరోగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'హనుమాన్' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి12 న రిలీజ్ అయిన ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్కి, తేజ సజ్జ యాక్టింగ్కి ప్రతీ ఒక్కరూ మెస్మరైజ్ అయిపోతున్నారు. ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో పాటూ డివోషనల్ కంటెంట్ కూడా ఉండడంతో థియేటర్స్ అంతా జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోతున్నాయి.ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుందీ సినిమా. ఇప్పటికే అన్ని ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, కాంతార హీరో రిషబ్ శెట్టి సినిమాను స్వయంగా థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తూ సినిమా సక్సెస్ పై హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఈ లిస్టులో దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు కూడా చేరిపోయారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన హనుమాన్ సినిమా గురించి ట్వీట్ చేస్తూ.." సంక్రాంతి వేళ వచ్చిన హనుమాన్‌ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో హీరో తేజ సజ్జా నటన, ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం, విజువల్‌గా చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు. దీంతో రాఘవేంద్ర రావ్ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు హనుమాన్ కి ఆడియన్స్ నుంచి విపరీతమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది కానీ తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు సరిపడా స్క్రీన్లు లభించడం లేదు. 'గుంటూరు కారం' సినిమాకు ఎక్కువ థియేటర్లు లభించాయి. కానీ గుంటూరు కారం సినిమాకి ఆ స్థాయిలో ప్రేక్షకులు రావడం లేదు.

అందరూ హనుమాన్ పైనే దృష్టి సారించడంతో ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఇప్పుడు 'గుంటూరు కారం' తీసేసి కొన్ని థియేటర్లలో 'హనుమాన్' సినిమాని వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు, ఉత్తరాదిలో మాత్రమే కాదు... ఓవర్సీస్ మార్కెట్‌ లోనూ 'హనుమాన్'కు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా ఆడియన్స్ 'హనుమాన్' కి చూపిస్తున్న ఆదరణ అంతా అంతా కాదు. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా నార్త్ అమెరికాలో ఏకంగా మూడు మిలియన్ డాలర్ల మార్క్ ని రీచ్ అయ్యి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. నార్త్ అమెరికాలో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల్లో టాప్ 10 సినిమాల్లో ఆల్రెడీ 'హనుమాన్' చోటు సంపాదించింది. అక్కడ 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' రికార్డ్స్ బ్రేక్ చేసింది. ప్రజెంట్ సినిమా జోరు చూస్తుంటే రూ. 200 కోట్లు కలెక్ట్ చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Also Read : హిందీ డబ్బింగ్ మూవీస్‌లో 'హనుమాన్' నయా రికార్డ్ - కుంభస్థలాన్ని బద్దలుకొడుతున్న తేజ సజ్జ

టాప్ హెడ్ లైన్స్

Madhurapuri Sadhana OTT : ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Azadi 501 Series OTT : ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Allu Arjun Raaka : అల్లు అర్జున్ రాకాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ - 11 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ
అల్లు అర్జున్ రాకాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ - 11 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ
This Week OTT Movies : దిస్ ఈజ్ ఓటీటీ గోల్డెన్ వీక్ - మా ఇంటి బంగారం To ఫేమస్ వెబ్ సిరీస్‌లు... ఈ వారం 20 సినిమాలు
దిస్ ఈజ్ ఓటీటీ గోల్డెన్ వీక్ - మా ఇంటి బంగారం To ఫేమస్ వెబ్ సిరీస్‌లు... ఈ వారం 20 సినిమాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
లంకను జయించిన తర్వాత హనుమాన్ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది! గంగామాత పాదాలు కడిగే దివ్య లీల!
లంకను జయించిన తర్వాత హనుమాన్ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది! గంగామాత పాదాలు కడిగే దివ్య లీల!
Gadchiroli News: గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
Healthy Millet Khichdi: మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
Embed widget