అన్వేషించండి

Rajashekar : జీవిత, జీవితం రెండు ఒక్కటే అనేది డైలాగ్ మాత్రమే - బయట వేరేవిధంగా ఉంటుంది: రాజశేఖర్

Rajashekar : ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సీనియర్ హీరో రాజశేఖర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Senior Actor Rajashekar : సీనియర్ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకొని వరుస విజయాలు అందుకున్న ఈయన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన ఆయన నితిన్ లేటెస్ట్ మూవీ 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' లో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెడుతూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించబోతున్నారు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా డిసెంబర్ 4న చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కి మూవీ టీమ్ అంతా హాజరయ్యారు. ఇందులో భాగంగా ఈవెంట్లో పాల్గొన్న సీనియర్ హీరో రాజశేఖర్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. రీసెంట్ గా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే కదా. ముఖ్యంగా ట్రైలర్ చివరలో రాజశేఖర్ చెప్పిన 'నాకు జీవితం, జీవిత రెండు ఒకటే' అనే డైలాగ్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. నిజ జీవితంలో కూడా రాజశేఖర్ అలాగే ఉంటారని చాలామంది అనుకుంటారు.

ఇదే విషయంపై రాజశేఖర్ స్పందిస్తూ.. "సినిమాలో నాకు జీవిత, జీవితం రెండు ఒకటే అనే డైలాగ్ వక్కంతం వంశీ గారు రాశారు. ఆయనకు ఆ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు. కానీ అది బాగా వైరల్ అయింది. జీవిత ఏం చెప్తే అది నేను చేస్తాను అనే ఉద్దేశంతో వంశీ ఈ డైలాగ్ రాసినట్టున్నాడు. కానీ నిజానికి నేను చెప్పిందే జీవిత వింటుంది. తను చాలా మంచిది. తిరిగి ఒక్క మాట కూడా అనదు. బయట మాత్రం జీవిత చెప్తేనే నేను వింటాను అని అనుకుంటున్నారు. నిజానికి జీవిత చెప్పింది కూడా నేను వింటాను. ఎందుకంటే ఆమె ఏం చెప్పినా నా మంచి కోసమే కదా" అంటూ తన భార్య జీవిత గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు రాజశేఖర్.

ఇక ఇదే ఈవెంట్ లో నితిన్ గురించి మాట్లాడుతూ.. "నితిన్‌ను బయట చూసి ఆకతాయి కుర్రవాడు అనుకున్నా. సినిమాల్లో ఎక్కువగా ఆ పాత్రలే వేశాడు కదా? అలానే ఉంటాడని అనుకున్నా. కానీ సెట్స్‌లో హీరోగా, నిర్మాతగా అన్నీ ఎంతో బాధ్యతతో చూసుకున్నాడు అని చెప్పారు. కాగా ఎక్స్ ట్రా ఆర్డినరీ మూవీని ఆదిత్య మూవీస్ తో కలిసి శ్రేష్ట మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రుచిరా ఎంటర్టైన్మెంట్స్ సమర్పిస్తున్నారు. రావు రమేష్, రోహిణి, శ్రీకాంత్ అయ్యంగర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, సోనియా సింగ్ ఇతర పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందించారు.

Also Read : 'బలగం' వేణుతో సినిమా? ఈ వార్తల్లో నిజమెంత?

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan Collections: విజయ్ జోరు తగ్గింది... ఆరు రోజుల్లో 'జన నాయకన్' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
తెలుగులో జస్ట్ 60 లక్షలే... మరి తమిళంలో? ఆరు రోజుల్లో 'జన నాయకుడు' కలెక్షన్స్ ఎంత?
Chennai Love Story Collections: వీకెండ్ తర్వాత స్టడీగా 'చెన్నై లవ్ స్టోరీ' కలెక్షన్లు... ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ఓవర్సీస్‌లో 50 లక్షలే... మరి తెలుగు రాష్ట్రాల్లో? ఐదు రోజుల్లో 'చెన్నై లవ్ స్టోరీ' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Kalatheylaa Song Lyrics: కలతేలా లిరిక్స్... మధ్యతరగతి భర్తకు మోటివేషన్ ఇచ్చేలా విశాల్ 'మకుటం'లో సాంగ్
కలతేలా లిరిక్స్... మధ్యతరగతి భర్తకు మోటివేషన్ ఇచ్చేలా విశాల్ 'మకుటం'లో సాంగ్
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి
రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget