అన్వేషించండి

ఇండ్రస్ట్రీ లో కొత్త స్కామ్ - సంచలన నిజాలు బయటపెట్టిన బ్రహ్మాజీ!

సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఇండస్ట్రీలో కొత్త స్కామ్ జరుగుతుందని పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఆ స్కామ్ కి సంబంధించిన వివరాలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

సీనియర్ నటుడు బ్రహ్మాజీ తాజాగా ఓ సరికొత్త స్కామ్ ని బయటపెట్టారు. 'సినిమా ఇండస్ట్రీలో మరో కొత్త స్కామ్ జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి' అంటూ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీంతో బ్రహ్మాజీ చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ బ్రహ్మాజీ బయటపెట్టిన స్కామ్ ఏంటి? అనే వివరాల్లోకెళ్తే.. బిజినెస్ రంగంలోనే కాదు సినిమా ఇండస్ట్రీలోనూ కొత్త తరహా స్కామ్స్ జరుగుతున్నాయి. ఈ సోషల్ మీడియా కాలంలో కొంతమంది తెలివిగా క్రియేటివిటీతో స్కామ్స్ చేస్తున్నారు. ఎంతోమంది జనాలు ఇలాంటి క్రియేటివ్ స్కామ్స్ కి పడిపోతుంటారు. ఈమధ్య సినిమా రంగంలోనూ ఈ స్కామ్స్ ఎక్కువైపోయాయి.

పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లను వాడుకొని సోషల్ మీడియాలో కొంతమంది చీటింగ్ చేస్తున్నారు. అలా ఇండస్ట్రీలో ఇప్పటికే కొన్ని స్కామ్స్ బయటపడ్డాయి. తాజాగా సీనియర్ నటుడు బ్రహ్మాజీ కూడా కొత్త తరహా స్కామ్ ని బయటపెట్టారు. మామూలుగా మీకు పలానా సినిమాలో ఆఫర్ వచ్చిందని ఫోన్లు చేయడం.. దానికి మాకేంటి అనే మాట దగ్గరనుంచి ఎంతోకాలంగా లాగేసుకోవడం వంటివి ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి. అవి సర్వసాధారణమే. చాలామంది సినిమా వాళ్లు ఇలాంటివి బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ బ్రహ్మాజీ లాంటి సీనియర్ నటుడి ముందు కూడా అలాంటి కుప్పిగంతులు వేస్తే కుదరదు కదా! తన సినీ కెరియర్లో ఎన్ని మోసాలను చూసి ఉంటాడు.

అలాంటిది అతన్నే బుట్టలో వేసుకోవాలని కొందరు ప్లాన్ చేశారు. అందుకే అందరిలా దాన్ని లైట్ తీసుకోకుండా తనకు జరిగిన మోసాన్ని ట్విట్టర్లో పెట్టి సదరు వ్యక్తుల ఫోన్ నెంబర్ తో పాటు యూపీఐ ఐడిని కూడా యాడ్ చేశాడు బ్రహ్మాజీ. తాజాగా బ్రహ్మాజీకి 7826863455 అనే నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందట. ఈ నెంబర్ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు మేనేజర్ అనే పేరుతో ట్రూ కాలర్ లో చూపిస్తుందట. అతను లోకేష్ నెక్స్ట్ మూవీ లో మిమ్మల్ని(బ్రహ్మాజీని) తీసుకుంటున్నాం అని, ఖచ్చితమైన కొలతలతో ఉన్న కొన్ని బట్టలు రెంటుకు తీసుకోవాల్సిందని, ఆ డబ్బులు మీరే చెల్లించాలని చెప్పారట. అలాగే ఆడిషన్ తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని కూడా అన్నాడట.

ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బ్రహ్మాజీకి ఇది మోసమని గ్రహించడం పెద్ద కష్టమే కాదు? ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆ మోసగాడి ఫోన్ నెంబర్ తో పాటు యూపీఐ ఐడిUPI ID jashlucky7777@oksbi ఇది అంటూ బ్రహ్మాజీ ట్విట్టర్ లో పెట్టాడు. ఇతనితోపాటు 908778799 అనే నెంబర్ వ్యక్తి కూడా ఈ తరహా మోసాలతో డబ్బులు గుంజుతున్నాడని హెచ్చరించాడు. మరో నటుడు సత్యదేవ్ కూడా ఈ తరహా కాల్ వల్ల మోసపోయానని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫ్రాడ్ కు సంబంధించిన డీటెయిల్స్ ని బ్రహ్మాజీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బ్రహ్మాజీ విషయానికొస్తే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ యాక్టర్ గా కొనసాగుతున్న ఈయన అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.

Also Read : 'లియో'పై టాలీవుడ్ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు, నిప్పులు చెరుగుతున్న విజయ్ ఫ్యాన్స్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Live Updates - 'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
Korean Kanakaraju OTT : కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
The Paradise Teaser : నాని ది ప్యారడైజ్ టీజర్ - జడల్ జమానాలో కాకులు తల్వార్లు పడితే యాక్షన్ వేరే లెవల్...
నాని ది ప్యారడైజ్ టీజర్ - జడల్ జమానాలో కాకులు తల్వార్లు పడితే యాక్షన్ వేరే లెవల్...

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Embed widget