అన్వేషించండి

SatyaDev's Garuda First Look : 'గరుడ చాప్టర్-1' ఫస్ట్ లుక్ పోస్టర్: ఇంటెన్స్ లుక్ తో ఆకట్టుకున్న సత్య దేవ్! 

హీరో సత్యదేవ్ ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా 'గరుడ చాప్టర్-1' అనే చిత్రాన్ని ప్రకటించి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

వర్సటైల్ హీరో సత్యదేవ్ వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన ఆయన, ఇప్పుడు హీరోగా బిజీగా మారిపోయాడు. ఇప్పటి వరకు చిన్న మీడియం రేంజ్ సినిమాల్లో నటిస్తూ వస్తున్న సత్యదేవ్.. ఓ భారీ సెటప్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు.

శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో ఓ భారీ ప్రాజెక్ట్ కు సత్యదేవ్ సైన్ చేశారు. దేవాన్ష్ నామా సమర్పణలో ప్రొడ్యూసర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాతో క్రాంతి బాలా అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈరోజు సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ మూవీని అధికారికంగా ప్రకటించి, టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేశారు.

సత్యదేవ్ చిత్రానికి 'గరుడ చాప్టర్-1' అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో లుంగీ ధరించిన సత్య దేవ్, ఫారెస్ట్ లో తన వీపుపై ఒక అమ్మాయిని మోసుకెళ్తున్నాడు. బ్యాగ్రౌండ్ లో అడవి తగలబడుతుండగా, అతను చేతిలో ఒక కాగడా మరొక చేతిలో పెద్ద గొడ్డలి పట్టుకొని నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఒక కుక్క నిలబడి ఉండటాన్ని మనం గమనించవచ్చు. 

'గరుడ చాప్టర్-1' పోస్టర్ లో సత్యదేవ్ ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు. డైరక్టర్ క్రాంతి బాల హీరోని మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్ లో, యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేయనున్నట్లు అర్థమవుతుంది. దీని కోసం యూనిక్ పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సత్యదేవ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన చిత్రం కానుంది. 

Special Day - Special Announcement.

Raw - Action & Thrill will TAKE OVER 💥

Here's Introducing #Garuda - The Next New Chapter🤞

The Excitement & Exhilaration will only peak from now.#AbhishekNama @DirectorKBala @amarreddy0827 @rameemusic@vasupotini @mohitrawlyani… pic.twitter.com/CohiJzfaYq

— Satya Dev (@ActorSatyaDev) July 4, 2023

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న 'గరుడ' చిత్రంలో స్టార్ కాస్టింగ్, ప్రముఖ సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తుండగా, సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోహిత్ రౌలియాని దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read : విడాకులకు నిహారికా కొణిదెల దరఖాస్తు - భర్తతో విడిపోయినట్టే

ఇదిలా ఉంటే, సత్య దేవ్ 'గరుడ' తో పాటుగా ఫుల్ బాటిల్ అనే సినిమా చేస్తున్నాడు. హోమ్ బ్యానర్ లో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో అతను నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. 

Also Read : సమంత మెడలో నల్లపూసలు - పెళ్లి గురించి హింట్?

మరోవైపు సత్యదేవ్ 'జీబ్రా' అనే క్రైమ్ ఎంటర్ట్రైనర్ లో నటిస్తున్నాడు. ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక గోపాల కృష్ణ అనే డెబ్యూ డైరక్టర్ తో 'కృష్ణమ్మ' సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ సమర్పిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Kaaka Movie : మెగాస్టార్ కుమార్తెగా నందమూరి తేజస్విని - బాబీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా?
మెగాస్టార్ కుమార్తెగా నందమూరి తేజస్విని - బాబీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా?
Crazy Kalyanam Trailer : పెళ్లిళ్లు చేసుకున్నా లేకున్నా పిల్లల్ని మాత్రం కనండి - లివింగ్ టు గెదర్ అఫీషియల్... సీనియర్ నటుడు నరేష్ రియాక్షన్
పెళ్లిళ్లు చేసుకున్నా లేకున్నా పిల్లల్ని మాత్రం కనండి - లివింగ్ టు గెదర్ అఫీషియల్... సీనియర్ నటుడు నరేష్ రియాక్షన్
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Ravi Teja Thulabharam : ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!
ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget