బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, శేఖర్ సుమన్ హోస్ట్ చేస్తున్న 'శేఖర్ టునైట్' షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో శాంతి లోపించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
Sanjay Dutt: చేతులెత్తి మొక్కిన మున్నాభాయ్... దేశంలో శాంతి లేదా? క్లారిటీ ఇచ్చిన దత్
Sanjay Dutt Reaction On Peace Comments: 'భారత దేశంలో శాంతి లేదు' అని బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ డాట్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. దాంతో ఆయన చేతులు జోడించి మొక్కి మరీ స్పష్టత ఇచ్చారు.

- నటుడు సంజయ్ దత్ 'దేశంలో శాంతి లోపించింద'ని వ్యాఖ్యానించారు.
- ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి.
- స్క్రిప్ట్‌లో భాగమే కానీ, వ్యక్తిగత అభిప్రాయాలు కావని దత్ వివరణ.
బాలీవుడ్ నటుడు, 'ఖల్ నాయక్' సంజయ్ దత్ (Sanjay Dutt) ఓ టీవీ షోలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. శేఖర్ సుమన్ హోస్ట్ చేస్తున్న 'శేఖర్ టునైట్' షోలో '(భారత) దేశంలో శాంతి లోపించింది' అని దత్ కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో సంజయ్ దత్ స్పష్టత ఇచ్చారు.
అదంతా స్క్రిప్ట్‌లో భాగమే...
నా వ్యక్తిగత అభిప్రాయం కాదు!
గాంధీ జయంతి సందర్భంగా ప్రసారమైన 'శేఖర్ టునైట్' షోలో సంజయ్ దత్ పాల్గొన్నారు. అందులో మన భారత దేశంలో ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ... "భారతీయులు ఎంతో అప్యాయత కలిగిన వ్యక్తులు. ఇక్కడ (అంటే మన దేశంలో) శాంతి ఉండాలి. అయితే... ఆ ప్రశాంతత గానీ, శాంతి గానీ నాకు కనిపించడం లేదు. భారతీయులది విశాల హృదయం. అతిథులను ఆదరించి, గౌరవించడం మన సంస్కృతి. మళ్ళీ ఆ రోజులు త్వరలో తిరిగి రావాలని నేను శివుడిని ప్రార్థిస్తున్నాను'' అన్నారు. ఆ వ్యాఖ్యలు అన్నీ స్క్రిప్ట్‌లో భాగమేనని చెప్పారు.
Also Read: Dharani I Love You - రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
సోషల్ మీడియా విమర్శల వెల్లువ...
దాంతో చేతులెత్తి మొక్కిన సంజయ్!
భారత దేశంలో శాంతి లేదని సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆయన వీడియో క్లిప్‌లు ట్రెండ్ అయ్యాయి. అంతే కాదు... నెటిజనుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సంజయ్ దత్ వ్యాఖ్యలను కొందరు తప్పు బట్టగా... మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాంతో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన వివరణ ఇచ్చారు. ఓ వీడియో విడుదల చేశారు.
Also Read: Husharu 2 - ట్రక్కులో బీరుతో కల్ట్ బాయ్స్ ఈజ్ బ్యాక్... డబుల్ ఫన్ అండ్ మ్యాడ్‌నెస్‌తో 'హుషారు 2'
SANJAY DUTT CLARIFIES ‘NO PEACE IN INDIA’ REMARK !!! Sanjay Dutt has clarified his remarks about not feeling the same peace in India anymore. Dutt said the comments were part of a scripted, light-hearted segment and did not reflect his personal views. https://t.co/D2hFsnKhWv
— Ravi Prakash Official (@raviprakash_rtv) October 6, 2026
'శేఖర్ టునైట్' షోలో తాను చేసిన వ్యాఖ్యలు స్క్రిప్ట్‌లో భాగమేనని, తన వ్యక్తిగత అభిప్రాయం కాదని సంజయ్ దత్ తేల్చి చెప్పారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలో చేతులు జోడించి మొక్కుతూ... ప్రజల స్పందన తనకు అర్థమైందన్నారు. "ఇటీవల శేఖర్ సుమన్ షోలో నా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చాలా మంది నన్ను సంప్రదించారు. స్క్రిప్ట్ ప్రకారమే ఆ షో చేశాం. అందులో నేను చెప్పినవి నా వ్యక్తిగత ఆలోచనలు, అభిప్రాయాలు కావు. నా వ్యక్తిగత అభిప్రాయాలపై ఎటువంటి పొరపాట్లు రాకూడదని ఈ వివరణ ఇస్తున్నా. జై హింద్, జై భారత్" అని సంజయ్ దత్ స్పష్టం చేశారు. ఎవరి మనోభావాలను దెబ్బ తీయడం తన ఉద్దేశం కాదని ఆయన స్పష్టత ఇచ్చారు. ఆ షోలో కాసేపు 'మున్నా భాయ్' పాత్రలోకి మారిపోయిన సంజయ్ దత్... ఒకవేళ మున్నాభాయ్ దేశ ప్రధాని అయితే ఎలా ఉంటుందో ఊహించుకున్నారు.
Frequently Asked Questions
సంజయ్ దత్ ఏ టీవీ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు?
సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఏమిటి?
సంజయ్ దత్ ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం కాదని, అవి స్క్రిప్ట్‌లో భాగమేనని స్పష్టం చేశారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదని వివరించారు.
సంజయ్ దత్ తన వ్యాఖ్యలపై వివరణ ఎలా ఇచ్చారు?
సంజయ్ దత్ తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్) ద్వారా ఒక వీడియోను విడుదల చేశారు. అందులో చేతులు జోడించి ప్రజలకు తన స్పష్టతను తెలియజేశారు.
'శేఖర్ టునైట్' షోలో సంజయ్ దత్ వ్యాఖ్యలపై వచ్చిన స్పందన ఏమిటి?
సంజయ్ దత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నెటిజనుల నుంచి తీవ్ర విమర్శలు, భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ట్రెండింగ్ వార్తలు






















