ఒక్క నిర్ణయంతో సమంతకు రూ.12కోట్ల నష్టం, ఎలాగంటే..
సమంత ఇటీవలే సినిమాలకు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు భారీ నష్టం మిగలనున్నట్టు తెలుస్తోంది. దీని వల్ల సామ్.. దాదాపు రూ. 10 నుండి రూ. 12 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Samantha: 'సిటాడెల్' తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించిన సామ్.. ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. త్వరలోనే వైద్యం కోసం విదేశాలకు వెళ్లనున్నట్టు ప్రకటించగా.. తాజాగా సమంతకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకునే వరకు తన నటనా జీవితం నుండి విశ్రాంతి తీసుకోవాలని సమంత నిర్ణయించుకోవడంతో.. అందుకు తగ్గట్టుగానే మూడు ప్రధాన నిర్మాణ సంస్థల నుంచి అందిన అడ్వాన్స్‌ను కూడా ఆమె తిరిగి ఇచ్చేసింది. అయితే ఆ డబ్బును తిరిగి ఇవ్వడం ద్వారా.. సామ్ కనీసం ఏడాది పాటు ఎలాంటి సినిమా ప్రాజెక్టుల్లో పాల్గొననని సమంత స్పష్టం చేసింది. ఫలితంగా, ఈ మొత్తం కాలంలో ఆమె గణనీయమైన నష్టాన్ని ఎదుర్కోనున్నట్టు తెలుస్తోంది.
సమంత సాధారణంగా ఒక్కో చిత్రానికి రూ. 3.5 నుండి రూ. 4 కోట్ల వరకు వసూలు చేస్తుంది. మయోసైటిస్ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆమె.. ఇటీవలే మూడు ప్రాజెక్ట్‌లకు సంతకం చేసింది. అయితే రీసెంట్ గా ఆమె తీసుకున్న నిర్ణయంతో దాదాపు రూ. 10 నుండి రూ. 12 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక నటన నుండి విరామం తీసుకున్నప్పటికీ, సమంత ఇటీవలి కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోషనల్ పోస్ట్‌లతో పాటు, పలు ప్రదేశాల సందర్శనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకుంటోంది. విదేశాల్లో చికిత్సకు ముందు సామ్ దేశంలోని పలు పుణ్య క్షేత్రాలు, ప్రాంతాలకు వెళుతూ గడుపుతోంది. అందులో భాగంగా అమర్ నాథ్ కు, తమిళ నాడులోని గోల్డెన్ టెంపుల్ కి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆమె అనారోగ్యాన్ని ఎదుర్కొనేందుకు మనోధైర్యం పొందాలనే ఇలా ఆలయాలకు వెళ్తున్నారని కొందరు భావిస్తున్నారు.
View this post on Instagram
ప్రస్తుతం ఆధ్యాత్మిక చింతనపై దృష్టి పెట్టిన సామ్.. ఈ మధ్య కాలంలో ప్రముఖ యోగా గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు నిర్వహించిన ఆధ్యాత్మిక యోగా కార్యక్రమానికి హాజరైంది. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఈ శిబిరంలో ఆమె ఓ సామాన్య భక్తురాలిగా కనిపించింది. ఈ సందర్శనకు సంబంధించిన పలు ఫొటోలను కూడా సామ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. "ఎలాంటి ఆలోచనలు, కదలికలు, మెలికలు తిరగకుండా కూర్చోవడం దాదాపు అసాధ్యమనిపిచింది. కానీ ఈ రోజు ధ్యానం అనేది ప్రశాంతత, శక్తి,కి అత్యంత శక్తివంతమైన మూలమని తెలిసింది. ఇంత సింపుల్ గా ఉండే ధ్యానం.. ఇంత పవర్ ఫుల్ గా ఉంటుందని ఎవరూ అనుకోరు" అంటూ క్యాప్షన్ లో రాసుకువచ్చింది. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్న సమంత.. త్వరలోనే వైద్యం కోసం విదేశాలకు వెళ్లనుంది.
Read Also : Samantha Meditation : ధ్యానంలో సమంత - సద్గురు ఆశ్రమంలో క్లేష నాశన క్రియలో...
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Before You Go
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
ట్రెండింగ్ వార్తలు






















