అన్వేషించండి

Samantha Praises Allu Arjun: నటనలో నాకు అల్లు అర్జున్‌ స్ఫూర్తి - తనతో మళ్లీ నటించాలని ఉంది, బన్నీపై సమంత ప్రశంసలు

Samantha: సమంత తాజాగా ఓ కాలేజ్‌ ఫంక్షన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా సామ్‌కు స్టూడెంట్స్ నుంచి ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్‌పై సమంత చేసిన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. 

Samantha Comments on Allu Arjun: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో సమంత కూడా ఒకరు. ఎప్పటికప్పుడు తన హెల్త్, మూవీస్ గురించి అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. మయోసైటిస్‌తో బాధపడుతోన్న సామ్ గత రెండేళ్లుగా జిమ్‌లోనే ఎక్కువగా గడిపేస్తోంది. అది కూడా అందులో మామూలు ఎక్సర్సైస్ లాంటివి కాకుండా భారీ వర్కవుట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు ఎప్పుకప్పుడు తన ఫోటోలు షేర్‌ చేస్తుంది. రీసెంట్‌గా బికినీ లుక్‌లో షాకిచ్చింది. ఏడాది క్రితం మయోసైటిస్‌ వ్యాధి బారిన పడ్డ సామ్‌ చికిత్స కోసం లాంగ్‌ బ్రేక్‌ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్‌గా రెడీ అయిన సామ్‌ తాజాగా ఓ కార్యక్రంలో సందడి చేసింది. ఇటీవల ఓ కాలేజ్‌లో జరిగిన ఈవెంట్‌లో సమంత గెస్ట్‌ ఎప్పియరెన్స్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా సామ్‌కు పలు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్‌పై సమంత చేసిన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. 

ఆ విషయంలో నాకు అల్లు అర్జున్ స్ఫూర్తి

'నటనలో మీకు స్ఫూర్తి ఎవరు?' ఓ స్టూడెంట్‌ సమంతను ప్రశ్నించగా.. దీనికి సామ్‌ ఇలా స్పందించింది. "నటనలో నాకు అల్లు అర్జున్‌ స్ఫూర్తి. మరోసారి తనతో కలిసి నటించాలని ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన యాక్టింగ్‌లో బీస్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యాడు" అంటూ సమాధానం ఇచ్చింది. కాగా సమంత - అల్లు అర్జున్‌ జంటగా 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో నటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చని ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో వీరిద్దరి పెయిర్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కని అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ పుష్ఫలో సమంత స్పెషల్‌ సాంగ్‌లో మరోసారి అల్లు అర్జున్‌ సరసన ఆడి, పాడింది. ఇదిలా ఉంటే మయోసైటిస్‌ చికిత్స అనంతరం సమంత త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతుంది. రీఎంట్రీలోనూ సమంత కోసం భారీ ఆఫర్స్‌ క్యూ కడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె దగ్గర పలు బిగ్‌ ప్రాజెక్ట్స్‌ వచ్చినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. 

సమంత@14

కాగా ఇటీవల సమంత తన సినీ ప్రస్థానంలో 14ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి 14 ఏళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటికీ ఆమె స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగడం విశేషం. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు, హిట్‌.. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రాలతో సామ్‌ సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా కొనసాగుతుంది. కాగా 2010లో ఆమె 'ఏం మాయ చేశావే' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో స‌మంత‌, నాగ‌చైత‌న్య జంట‌గా న‌టించారు. ఆ సినిమాలో అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ గా నిలిచింది. స‌మంత క్యారెక్ట‌ర్, అందం, ఆమె చీర‌క‌ట్టుకి అప్ప‌ట్లో ఎంతోమంది కుర్ర‌కారు ఫ్యాన్స్ అయిపోయారు. ఆమె న‌టించిన జెస్సీ క్యారెక్ట‌ర్ కి ఇప్ప‌టీకీ యువ‌త‌లో క్రేజ్ ఉంది. అంతలా ఎక్కేసింది ఆ క్యారెక్ట‌ర్.

టాప్ హెడ్ లైన్స్

Jr NTR Tirupati Press Meet: ఎన్టీఆర్ అభిమానులే కానీ ఆయనకు సంబంధం లేదు - 'ఊరూ వాడ' వెనుక ఫుల్ కహానీ
ఎన్టీఆర్ అభిమానులే కానీ ఆయనకు సంబంధం లేదు - 'ఊరూ వాడ' వెనుక ఫుల్ కహానీ
The Devil OTT : జైలులో స్టార్ హీరో - 7 నెలల తర్వాత ఓటీటీలోకి కొత్త మూవీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
జైలులో స్టార్ హీరో - 7 నెలల తర్వాత ఓటీటీలోకి కొత్త మూవీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Shruti Haasan: శృతి హాసన్ ఫ్యామిలీ ఎక్కడ... చెన్నై గృహ ప్రవేశంలో ఎవరూ లేరేందుకు?
శృతి హాసన్ ఫ్యామిలీ ఎక్కడ... చెన్నై గృహ ప్రవేశంలో ఎవరూ లేరేందుకు?
Ram Charan: డాన్సర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రామ్ చరణ్ భారీ విరాళం... ఎంత అమౌంట్ ఇచ్చారంటే?
డాన్సర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రామ్ చరణ్ భారీ విరాళం... ఎంత అమౌంట్ ఇచ్చారంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun At Shopping Mall: కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
Tirupati Leopard News: తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
POCSO Act: టీనేజ్ లవ్ అఫైర్లపై పోక్సో అస్త్రం.. చాలా కేసుల్లో చట్టం దుర్వినియోగం! సుప్రీంకోర్టు ఆందోళన
టీనేజ్ లవ్ అఫైర్లపై పోక్సో అస్త్రం.. చాలా కేసుల్లో చట్టం దుర్వినియోగం! సుప్రీంకోర్టు ఆందోళన
AP Local Body Elections November: నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
IND Predicted XI Vs Eng in 1st ODI: ఇంగ్లాండ్ తో పోరుకు రోకో గ్రాండ్ రీఎంట్రీ.. శుభారంభానికి గిల్ సూపర్ స్కెచ్, ఫస్ట్ వన్డేకు ఇండియా ప్రెడిక్టెడ్ ఎలెవన్ ఇదే!
ఇంగ్లాండ్ తో పోరుకు రోకో గ్రాండ్ రీఎంట్రీ.. శుభారంభానికి గిల్ సూపర్ స్కెచ్, ఫస్ట్ వన్డేకు ఇండియా ప్రెడిక్టెడ్ ఎలెవన్ ఇదే!
Kaleshwaram NDSA Report Medigadda: మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
ట్రాఫిక్ చలాన్ పేరుతో కొత్త సైబర్ మోసం - కేంద్రం హెచ్చరిక, ఇలా జాగ్రత్తపడండి
ట్రాఫిక్ చలాన్ కట్టమంటూ మీ మొబైల్‌కు మెసేజ్‌ వచ్చిందా? అది మాయాజాలం కావచ్చు, జాగ్రత్త!
Iran Missile Attacks: హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
Embed widget