Samantha : అనాథ పిల్లల కోసం 'హాయ్ నాన్న' స్పెషల్ స్క్రీనింగ్ - సమంత మంచి మనసుకు ఫ్యాన్స్ ఫిదా!
Samantha : స్టార్ హీరోయిన్ సమంత అనాధ పిల్లల కోసం AMB సినిమాస్ లో హాయ్ నాన్న మూవీ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది.

Hi Nanna : న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రీ, కూతుర్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాని కూతురుగా బేబీ కియారా నటించింది. శృతిహాసన్ గెస్ట్ రోల్ చేసింది. డిసెంబర్ 7న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. సినిమాలో ఎమోషన్ బాగా వర్క్ అవుట్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి ఎంతగానో కనెక్ట్ అవుతున్నారు.
ఇక ఓవర్సీస్ ఆడియన్స్ అయితే ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో వన్ మిలియన్ మార్క్ అందుకుంది. కాగా ఈ సినిమాకి ఇంప్రెస్ అయిన స్టార్ హీరోయిన్ సమంత అనాథ పిల్లల కోసం హైదరాబాదులోని AMB సినిమాస్‌లో హాయ్ నాన్న’ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. పిల్లలతో కలిసి ఈ సినిమా చూసేందుకు వచ్చిన సమంతను చూసేందుకు అభిమానులు గుమిగూడారు. సామ్ అంటూ కేరింతలు కొట్టారు.
Samantha Ruth Prabhu hosts a special screening of #HiNanna for the kids from Prathyusha Organisation at AMB Cinemas today.#BlockbusterNanna #SamanthaRuthPrabhu #MuktiMohan #SidharthMalhotra #VidyutJammwalpic.twitter.com/PXgZo9WDAN
— Shailendra Singh (@ShailendraS97) December 10, 2023
సమంత తన ఫ్యాన్స్ అందరికీ నవ్వుతూ అభివాదం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో సమంత సింపుల్ లుక్ లో దర్శనమిచ్చింది. వైట్ కలర్ డ్రెస్ లో కళ్ళజోడు పెట్టుకుని క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంది. థియేటర్ దగ్గర సమంతను చూసిన ఫ్యాన్స్ చాలామంది ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారు. మొత్తం మీద చిన్నారులతో కలిసి సమంత నాని హాయ్ నాన్న మూవీని చూసేందుకు ఇలా థియేటర్ కి రావడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నాని, సమంత జంటగా ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ వంటి సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాల్లో వీరిద్దరికి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక సమంత సినిమాల విషయానికొస్తే, చివరగా విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కానీ సినిమాలో విజయ్ - సమంత కెమిస్ట్రీ, సాంగ్స్ కి ఆడియన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ తర్వాత సమంత 'సిటాడేల్' అనే వెబ్ సిరీస్ చేసింది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యంపై దృష్టి సారించింది. మరో ఏడాది పాటు సమంత సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read : మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య
Before You Go
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు






















