అన్వేషించండి

Saif Ali Khan: ఆస్పత్రిలో చేరిన సైఫ్‌ అలీఖాన్‌ - 'దేవర' షూటింగ్‌లో గాయాలు..

Saif Ali Khan Hospitalised:బాలీవుడ్‌ స్టార్‌, 'దేవర' నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ ఆస్పత్రి పాలయ్యారు. గత కొంతకాలంగా బయట కనిపించని సైఫ్‌ ఆస్పత్రిలో చేరినట్టు తెలిసింది.

Bollywood Actor Saif Ali Khan Hospitalised: బాలీవుడ్‌ స్టార్‌, 'దేవర' నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ ఆస్పత్రి పాలయ్యారు. గత కొంతకాలంగా బయట కనిపించని సైఫ్‌ ఆస్పత్రిలో చేరినట్టు తెలిసింది. ప్రస్తుతం 'దేవర' మూవీలో నటిస్తున్న సైఫ్‌ ఓ యాక్షన్‌ సీన్స్‌ చేస్తుండగా గాయపడ్డాడట. ఇది జరిగిన చాలా రోజులే అవుతున్న లేటెస్ట్‌ యాక్షన్‌ సీన్స్ చేస్తుండగా అవి తిరగబడినట్టు సమాచారం. దీంతో ఇబ్బంది పడ్డ సైఫ్‌ చికత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు సర్జరీ చేయాలని సూచించినట్టు సమాచారం.  దేవర షూటింగ్‌లో సైఫ్‌ భుజానికి, మోకాలికి గాయం అయ్యిందట.

దీంతో రీసెంట్‌గా ముంబై కోకిలాబెన్‌ ఆస్పత్రిలో చేరినట్టు 'దేవర' టీం తెలిపింది. షూటింగ్‌లో ఆయన భుజం, మోకాలికి గాయమైనట్టు సమాచారం. దీంతో డాక్టర్లు ఆయనకు సర్జరీ చేయాలని సూచించినట్టు ఇన్‌సైడ్‌ వర్గాల్లో టాక్‌. మరి సైఫ్‌ సర్జరీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంత ఆయన త్వరగా కోలుకావాలని ఆకాంక్షిస్తూ మూవీ టీం ట్వీట్‌ చేసింది. దీంతో నందమూరి  ఫ్యాన్స్‌ అటూ సైఫ్‌ ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా దేవర షూటింగ్ తర్వాత సైఫ్‌ అలీఖాన్‌ ముంబై ఎయిర్‌పోర్టులో నుంచి వెళ్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా ఈ మూవీలో సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతికథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మూవీ ఫస్ట్‌ షెడ్యూల్లోనే సైఫ్‌ను పరిచయం చేసింది మూవీ టీం. కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్‌ హిట్‌తో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు మూవీ ప్రచార పోస్టర్స్‌, ఫస్ట్‌లుక్‌, టీజర్‌.. అప్‌డేట్స్‌ అంతకు మించి అనేలా ఉన్నాయి. దీంతో మూవీపై విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయ్యింది. 'దేవర'తో కొరటాల సరికొత్త ఎలిమెంట్స్‌ చూపించబోతున్నాడని టీజర్‌, ప్రచార పోస్టర్స్‌ చూసిన ఆడియన్స్‌ నమ్ముతున్నారు.

కొరటాల ముందు సినిమాల్లో లేని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయంటున్నారు. పైగా మూవీలో వైలెన్స్ కూడా బాగానే ఉంటుందని ఫస్ట్‌లుక్‌తో చెప్పకనే చెప్పాడు కొరటాల. ప్రేక్షకుల అంచనాలను నిజం చేస్తూ ఫస్ట్‌ గ్లింప్స్‌ను ఫుల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో రిలీజ్‌ చేశాడు. రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్న దేవర ఫస్ట్‌ పార్ట్‌ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న 'దేవర' నుంచి అదిరిపోయే గ్లింప్స్‌ షేర్ చేయగా.. నెట్టింట మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డులు క్రియేట్‌ చేస్తూ హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

దాంతో మూవీపై ఆడియన్స్‌లో మరింత ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోయాయి. దేవరలో ఎన్టీఆర్‌ అండ్‌ టీంపై వచ్చే వీఎఫ్‌ఎక్స్‌ తో సాగే అండర్‌వాటర్‌ సీక్వెన్స్‌ సినిమాకే మెయిన్‌ హైలెట్‌గా నిలువబోతున్నట్టు సమాచారం. మ‌ల్టీ లింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. Devara-Part 1 ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget