అన్వేషించండి

Sai Dharam Tej On Accident : మాట విలువ తెలిసింది... ప్రమాదం ఓ పీడకల కాదు, అదొక స్వీట్ మెమరీ - సాయి ధరమ్ తేజ్

యంగ్ హీరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తనకు గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.గతేడాది తనకు జరిగిన రోడ్డు ప్రమాదం స్వీట్ మెమోరీగా, ఓ పీడకలగా భావించడం లేదని తేజ్ వ్యాఖ్యానించారు

Sai Dharam Tej: యంగ్ హీరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తనకు గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రమాదాన్ని ఓ పీడకలగా భావించడం లేదని, దాన్ని ఒక గుణపాఠంగా, ఓ స్వీట్ మెమోరీగా అనుకుంటున్నానని తెలిపారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆనాటి జ్ఞాపకాలపై మాట్లాడిన యంగ్ హీరో... ఆ ప్రమాదం వల్ల చాలా నేర్చుకున్నానంటూ విలువైన మాటలు చెప్పారు.

2014లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా ద్వారా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'రేయ్', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాలతో ఆకట్టుకున్న ఆయన... 'సుప్రీం', 'విన్నర్' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులతో ఫ్యాన్స్ ను నిరాశపరిచినా.. ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండుగే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాల ద్వారా మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. అంతలోనే ఆ హీరో జీవితంలో ఊహించలేని ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్‌ రోడ్డు నెంబరు-45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా .. బైక్ స్లిప్ అయ్యి ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో... వెంటనే మెడికవర్ ఆస్పత్రిలో చికిత్సనందించారు. ఈ ప్రమాదంలో తేజ్ కి ఛాతి, కుడి కన్నుపై, పొట్ట భాగంలో తీవ్రమైన గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. 

ఈ రోడ్డు ప్రమాదంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. అధిక స్పీడ్ తో రావడం వల్లే ఇలా జరిగిందని, ఆ సమయంలో తేజ్ మద్యం మత్తులో ఉన్నాడంటూ పలువురు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. అలా కొన్ని నెలల తర్వాత మళ్లీ షూటింగుల్లో పాల్గొనడం ప్రారంభించిన తేజ్.. ఇటీవల బైక్ సీక్వెన్స్ చేసి, మళ్లీ ఫాంలోకి వచ్చారు. అయితే అప్పటి ప్రమాదంపై సాయి ధరమ్ తేజ్ .. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు. మృత్యువు అంచు వరకు వెళ్లొచ్చిన తనకు ఆ ఘటనను తాను పీడకలగా భావించడం లేదని, అది ఓ లెసన్ గా భావిస్తున్నానన్నారు. అది తనకు ఓ స్వీట్ మెమరీ లాంటిదని వ్యాఖ్యానించారు. దాని వల్ల తాను చాలా నేర్చుకున్నానని, ముఖ్యంగా మాట విలువ తెలిసిందంటూ కామెంట్లు చేశారు. ఆ సమయంలో తనకు గొంతు కూడా సరిగా రాలేదని, అప్పుడు తనకు తన ఫ్యామిలీ, తోటి హీరోలు ఎంతో ధైర్యం చెప్పారన్నారు. ముఖ్యంగా తన తల్లి తనకు ఎంతో ధైర్యం చెప్పిందని, మళ్లీ బైక్ ఎక్కనని అనుకుంటే, భయాన్ని జయించడం అవసరమని చెప్పి, బైక్ ఎక్కించిందని గుర్తు చేసుకున్నారు. అలా అన్నీ సెట్ కావడానికి రెండు రోజులు పట్టిందన్నారు. 

ఇక ఇంతకుముందే బైక్ యాక్సిడెంట్ తో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్  ఇటీవల నటించిన ‘విరూపాక్ష’ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. ఏ మాత్రం భయపడకుండా 100 కిలోమీటర్ల స్పీడ్‌తో పొలం గట్లపై బైక్‌ తోలి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సీన్స్ ను డూప్ పెట్టి మేనేజ్ చేస్తామన్నా తేజ్ వినలేదని మేకర్స్ అంటున్నారు. తనే రిస్కీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను సింగిల్‌ షాట్‌లో కంప్లీట్‌ చేశాడని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితమే దర్శకుడు కార్తీక్‌ దండు, సినిమాటోగ్రాఫర్ శామ్‌దత్ సైనుద్దీన్ ‘Courage Over fear’ పేరుతో ఓ వీడియో కూడా విడుదల చేశారు.  ఇదిలా ఉండగా  ఏప్రిల్ 21న విరూపాక్ష పలు భాషల్లో రిలీజ్ కానుండగా.. ఈ సినిమాలో భీమ్లా నాయక్, SIR ఫేమ్ సంయుక్త మీనన్ విరూపాక్షలో కథానాయికగా నటిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

CULT First Day Collections : కల్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కొత్త మూవీ వసూళ్లు ఎంతంటే?
కల్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కొత్త మూవీ వసూళ్లు ఎంతంటే?
Aadarsha Kutumbam First Day Collection : వెంకీ ఆదర్శ కుటుంబం ర్యాంపేజ్ స్టార్ట్ - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
వెంకీ ఆదర్శ కుటుంబం ర్యాంపేజ్ స్టార్ట్ - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Cult Review - కల్ట్ రివ్యూ: స్క్విడ్ గేమ్ టైపులో... దర్శకుడిగా, హీరోగా విశ్వక్ సేన్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
కల్ట్ రివ్యూ: స్క్విడ్ గేమ్ టైపులో... దర్శకుడిగా, హీరోగా విశ్వక్ సేన్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
Bigg Boss Season 10 Today October 30th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
Income Tax Raids: ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Embed widget