అన్వేషించండి

ఓవైపు యాక్షన్, మరోవైపు డైరెక్షన్ - యాక్టర్స్‌గా రాణిస్తున్న డైరెక్టర్స్ వీరే!

మెగా ఫోన్ పట్టుకొని సినిమాలు తెరకెక్కించే దర్శకుల్లో కొందరు వెండితెర మీద నటులుగానూ రాణిస్తున్నారు. యాక్టర్స్ గా రాణిస్తున్న డైరెక్టర్స్ పై ఓ లుక్కేద్దాం!

డైరెక్టర్ ను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటుంటారు. 24 క్రాఫ్ట్స్ ను సమన్వయ పరుచుకుంటూ, తమ కథలను వెండితెర మీదకు తీసుకొస్తుంటారు. అయితే వారిలో కొందరు దర్శకులు మాత్రం మెగా ఫోన్ పట్టుకొని దర్శకత్వ బాధ్యతలు నిర్వహించడమే కాదు, కెమెరా ముందుకొచ్చి తమలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. యాక్టర్స్ గా రాణిస్తున్న ఆ దర్శకులెవరో ఇప్పుడు చూద్దాం!

ఎస్‌.జె. సూర్య:
‘ఖుషి’ వంటి కల్ట్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు ఎస్‌.జె. సూర్య.. ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో బిజీ యాక్టర్ గా కొనసాగుతున్నారు. అదిరింది, స్పైడర్‌, ది లూప్‌, మార్క్ ఆంటోనీ వంటి చిత్రాల్లో విలన్ గా మెప్పించారు. ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్‌' చిత్రంతో పాటుగా ‘సరిపోదా శనివారం’, ‘జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌’, D50 సినిమాల్లో నటిస్తున్నారు. 

సెల్వరాఘవన్:
'7/G బృందావన కాలనీ', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాలతో డైరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సెల్వ రాఘవన్.. 'బీస్ట్' మూవీతో యాక్టర్ గా మారాడు. ప్రెజెంట్ డైరెక్షన్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తున్నాడు. చిన్ని, ఫర్హానా, మార్క్ ఆంటోనీ చిత్రాలతో మెప్పించారు. రవితేజ నటిస్తున్న RT4GM సినిమాతో నటుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్:
‘ఘర్షణ’ ‘ఏమాయ చేసావే’, 'సూర్య S/o కృష్ణన్', రాఘవన్, ఏటో వెళ్లిపోయింది మనసు, 'సాహసం శ్వాసగా సాగిపో' వంటి సినిమాలతో దర్శకుడిగా మెప్పించారు గౌతమ్‌ మీనన్. ప్రస్తుతం యాక్టర్ గా వరుస సినిమాలు చేస్తున్నారు. ట్రాన్స్, సీతారామం, మైఖేల్‌, ఉస్తాద్, లియో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఆయన డైరెక్ట్ చేసిన 'ధృవ నక్షత్రం' సినిమా త్వరలో విడుదల కానుంది. 

సముద్రఖని:
‘శంభో శివ శంభో’, జెండాపై కపిరాజు, ‘బ్రో’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సముద్ర ఖని.. నటుడిగా బిజీ అయిపోయారు. అల వైకుంఠపురంలో, క్రాక్, సర్కారు వారి పాట, ఆర్‌ఆర్‌ఆర్‌, మాచర్ల నియోజకవర్గం, భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్, విమానం తదితర సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ‘ఇండియన్ 2’, ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీస్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మిస్కిన్:
పిశాచి, డిటెక్టివ్, సైకో చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ మిస్కిన్.. యాక్టర్ గానూ రాణిస్తున్నారు. సూపర్ డీలక్స్, మహావీరుడు చిత్రాల్లో విలన్ గా నటించిన మిస్కిన్.. రీసెంట్ గా వచ్చిన 'లియో' మూవీలోనూ మెరిశారు. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేస్తోన్న 'పిశాచి 2' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరుణ్ భాస్కర్:
పెళ్ళి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ధాస్యం. మహానటి సినిమాలో మెరిసిన తరుణ్.. ఫలక్ నుమా దాస్, మీకు మాత్రమే చెప్తా, సీతా రామం, దాస్ కా ధమ్కీ, హాస్టల్ బాయ్స్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కీడా కోలా' మూవీలో కీలక పాత్ర పోషించారు.

శ్రీకాంత్‌ అడ్డాల:
‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఫీల్ గుడ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీకాంత్ అడ్డాల. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెదకాపు-1’ సినిమాతో నటుడిగా మారాడు. ఇందులో నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు.

కేవీ అనుదీప్‌:
'పిట్టగోడ' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన అనుదీప్.. ‘జాతిరత్నాలు’, పిన్స్ చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. తను డైరెక్ట్ చేసిన సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించే అతను.. ఫస్ట్ డే ఫస్ట్ షో, మ్యాడ్‌ మూవీల్లో నటించాడు.

వెంకటేశ్ మహా:
C/o కంచెరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు వెంకటేశ్ మహా. అయితే అవకాశం వచ్చినప్పుడల్లా బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. స్టాండప్ రాహుల్, అంటే సుందరానికి చిత్రాల్లో నటించిన మహా.. లేటెస్టుగా థియేటర్లలోకి వచ్చిన 'మార్టిన్ లూథర్' మూవీలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం 'మర్మానువు' అనే చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు.

శ్రీను గవిరెడ్డి:
'అనుభవించు రాజా' సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీను గవిరెడ్డి.. ఇటీవల 'కుమారి శ్రీమతి' వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించారు. గతంలో క్రాక్, వీర సింహా రెడ్డి చిత్రాల రైటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. ప్రస్తుతం రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కే RT4GM సినిమాకి రైటర్ గా చేస్తున్నారు.

కరుణ కుమార్‌:
‘పలాస 1978’, 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు కరుణ కుమార్‌. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంతో తొలిసారి తెరపై కనిపించిన ఆయన.. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘నా సామిరంగ’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.

గతంలో కె. విశ్వనాథ్, జంధ్యాల లాంటి దర్శకులు వెండితెరపై నటులుగా రాణించారు. కె. రాఘవేంద్రరావు ‘పెళ్లి సందD’ సినిమాతో తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. పూరీ జగన్నాథ్, వీవీ వినాయక్, కాశీ విశ్వనాథ్, రవిబాబు, బీవీఎస్ రవి, పోసాని కృష్ణమురళి, బెజవాడ రౌడీలు ఫేమ్ వివేక్ కృష్ణ లాంటి మరికొందరు దర్శకులు బిగ్ స్క్రీన్ మీద అలరిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: 'బిగ్‌ బాస్‌ బోగస్ అన్నప్పుడే నేను వెళ్లకుండా ఉండాల్సింది'.. సీజన్-2 విన్నర్ కౌశల్ కామెంట్స్ వైరల్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Sharwanand Dimple Hayathi : శర్వానంద్, డింపుల్‌పై ట్రోలింగ్స్ - డైరెక్టర్ సంపత్ నంది రియాక్షన్
శర్వానంద్, డింపుల్‌పై ట్రోలింగ్స్ - డైరెక్టర్ సంపత్ నంది రియాక్షన్
Ramayana Oscar : ఆస్కార్ బరిలో రామాయణ - హాలీవుడ్ మూవీస్‌కు పోటీగా...
ఆస్కార్ బరిలో రామాయణ - హాలీవుడ్ మూవీస్‌కు పోటీగా...
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Crime Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - మాజీ అధికారి తీసిన మూవీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - మాజీ అధికారి తీసిన మూవీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
Hyderabad Crime News: హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
Rajiv Gandhi Security: రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర.. ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీ తొలగింపు.. వారి పేర్లు బయటపెడతా?- రాహుల్ గాంధీ
రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర.. ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీ తొలగింపు.. వారి పేర్లు బయటపెడతా?- రాహుల్ గాంధీ
Atmakur Municipal Vice Chairperson: రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
Seethakka: కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
Embed widget