ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నాని ఒక భావోద్వేగభరితమైన ప్రేమకథా చిత్రాన్ని చేయనున్నారు. ఏషియన్ సునీల్ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది.
Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడితో నాని సినిమా... హీరోయిన్‌గా రుక్మిణి వసంత్?
Rukmini Vasanth To Romancce Nani: 'ది ప్యారడైజ్' తర్వాత సుజీత్ దర్శకత్వంలో 'బ్లడీ రోమియో' స్టార్ట్ చేశారు నాని. ఆ తర్వాత తమిళ దర్శకుడితో ఆయన సినిమా చేయనున్నట్లు టాక్.

- నాని-ప్రేమ్ కుమార్ సినిమా చర్చలు ముగిసి, సినిమా ఖరారైంది.
- కథానాయికగా కన్నడ నటి రుక్మిణి వసంత్ ఎంపికైనట్లు సమాచారం.
- ఆసియన్ సునీల్ నిర్మించే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది.
- హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉన్నందున రుక్మిణి వెంటనే ఓకే.
న్యాచురల్ స్టార్ నాని లైనప్ గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. 'ది ప్యారడైజ్' వంటి మాస్ యాక్షన్ సినిమా తర్వాత 'సాహో', 'ఓజీ' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఓ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ మధ్య ఆ మూవీ లుక్ టెస్ట్ కంప్లీట్ అయ్యింది. అది కాకుండా తమిళ హిట్ '96', తెలుగు ప్రేక్షకులు సైతం మెచ్చిన 'సత్యం సుందరం' దర్శకుడు ప్రేమ్ కుమార్ (Prem Kumar)తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట. వీళ్ళిద్దరి మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయట. ఇందులో హీరోయిన్ గురించి డిస్కషన్ జరుగుతోంది.
నాని సరసన రుక్మిణి వసంత్?
నాని హీరోగా ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించనున్న సినిమాను ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానుందట. ఇందులో కథానాయికగా కన్నడ భామ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ఎంపిక అయినట్టు సమాచారం.
ప్రేమ్ కుమార్ సినిమాలో నాని సరసన కథానాయికగా రుక్మిణి వసంత్ నటించడం ఖాయమని తెలిసింది. ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ జంటగా నటించలేదు. 'కాంతార 2', 'టాక్సిక్' వంటి పాన్ ఇండియా కన్నడ సినిమాల్లో రుక్మిణి వసంత్ నటించారు. అంతకు ముందు 'సప్త సాగరాలు దాటి'తో మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో నిఖిల్ సిద్ధార్థ సరసన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' చేశారు. అయితే ఆ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వచ్చి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సరసన 'డ్రాగన్'లో నటిస్తున్నారు.
ప్రేమ్ కుమార్ సినిమాల్లో కథానాయిక పాత్రలకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. '96'లో విజయ్ సేతుపతి కంటే త్రిషకు ఎక్కువ పేరు వచ్చింది. 'సత్యం సుందరం' సినిమాలో అరవింద్ స్వామి, కార్తీలకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ... శ్రీ దివ్య పాత్ర బావుంటుంది. నానితో ఆయన చేయబోయే భావోద్వేగభరిత ప్రేమకథలో... ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌లో హీరోయిన్ రోల్ కూడా ఇంపార్టెంట్ అట. అందుకని రుక్మిణి వసంత్ వెంటనే ఓకే చెప్పేశారట.
ప్రస్తుతం నాని - రుక్మిణి వసంత్ - ప్రేమ్ కుమార్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో అధికారికంగా ఈ సినిమా గురించి అనౌన్స్ చేయనున్నారు. 'బ్లడీ రోమియో'తో పాటు ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నాని భావిస్తున్నారట. ప్రస్తుతం ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్నారు ప్రేమ్ కుమార్. ఆ మూవీ చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నెలలోనే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Frequently Asked Questions
నాని ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమా ఏ జానర్?
నాని సరసన రుక్మిణి వసంత్ నటించడం ఇదే మొదటిసారి అవునా?
అవును, నాని, రుక్మిణి వసంత్ జంటగా నటించడం ఇదే మొదటిసారి. ప్రేమ్ కుమార్ సినిమాలో నాని సరసన ఆమె కథానాయికగా ఎంపికయ్యారు.
ప్రేమ్ కుమార్ సినిమాల్లో హీరోయిన్ పాత్రల ప్రాముఖ్యత ఎలా ఉంటుంది?
ప్రేమ్ కుమార్ సినిమాల్లో కథానాయిక పాత్రలకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. నానితో చేయబోయే సినిమాలో కూడా హీరోయిన్ రోల్ ముఖ్యమైనదని తెలిసింది.
ట్రెండింగ్ వార్తలు






















