అన్వేషించండి

Real Star Srihari: ఆ రోజు అర్థరాత్రి ఫోన్ కాల్ అందుకున్న వెంటనే. శ్రీహరి ... లుంగీ కట్టుకుని SR నగర్ మెయిన్‌రోడ్డుపైకి వచ్చి.. 

రియల్ స్టార్ శ్రీహరి సినిమాల్లోనే కాదు..నిజ జీవితంలో కూడా రియల్ హీరోనే. ఆయన చేసిన సాయాలు.. జనాల కోసం నిలబడిన ఘటనలు కోకొల్లలు.. అలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఇది..

Real Star Srihari: రియల్ స్టార్ శ్రీహరి.. ఆయన ఈ లోకాన్ని వదిలి 13 ఏళ్లు అవుతున్నా.. ఇండస్ట్రీ... అభిమానులు ఇప్పటికీ ఆయన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటారు.  సినిమా ఇండస్ట్రీలోకి స్టంట్‌మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చి... చిన్న వేషాలతో నటనలోకి వచ్చి...ఆ తర్వాత విలన్‌గా.. మాస్ హీరోగా.. ఆ తర్వాత.. అద్భుతమైన కేరక్టర్ ఆర్టిస్ట్‌గా ఎదిగిన వ్యక్తి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్ర రంగాల్లో దాదాపు 120కి పైగా సినిమాల్లో నటించారు. ఇండస్ట్రీలో కొత్త దర్శకలకు, యువ దర్శకులకు అండగా.. ఉంటూ వారితో సినిమాలు చేసిన వ్యక్తి. ఇప్పుడు టాప్ డైరక్టర్లుగా ఉన్న చాలా మంది అప్పట్లో శ్రీహరి సినిమాలకు ఏదో ఓ రూపంలో పనిచేసిన వారే. ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా అది ఆర్థికంగా అయినా...వ్యక్తిగతంగా వారి వెంటఉండటంలో అయినా శ్రీహరి ముందుండేవారు. అయితే అలా సినిమా వాళ్లకే కాదు..  బయట ఉన్న సామాన్యులకు కూడా ఆయన అండగా నిలిచిన ఉదంతాలున్నాయి. అలాంటి ఓ సంఘటనను డైరక్టర్ బాబీ ఓ సారి వివరించారు. దాని గురించి వింటే నమ్మశక్యం కూడా కాదు. కానీ అలాంటిది జరిగిందని బాబీ వివరించారు. 


అర్థరాత్రి ఫోన్‌కాల్.. అలాగే వచ్చేసిన శ్రీహరి

ఈ సంఘటన గురించి డైరక్టర్ బాబీ ( కె.ఎస్.రవీంద్ర) శ్రీహరి చనిపోయిన చాలా ఏళ్లకి వివరించారు. శ్రీహరి కుమారుడు మేఘాంశ్ నటించిన రాజ్‌దూత్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడుతూ.. శ్రీహరి లాంటి వ్యక్తిని మళ్లీ చూడటం అరుదని చెప్పారు. శ్రీహరికి.. ఆయనుకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ.. ఓ అరుదైన విషయం గురించి కూడా చెప్పారు. ఇది ఆయన మాటల్లోనే.." దేవుడు అన్ని చోట్ల ఉండడు.. అమ్మ రూపంలో ఉంటాడు అంటారు. నేను గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు.. మా అమ్మ గుంటూరులో ఉండేది. కానీ నాకు శ్రీహరి గారిలో దేవుడు కనిపించేవారు. ఆయన చనిపోయినప్పుడు లక్షల మంది జనాలు వచ్చారంటే.. కేవలం ఆయనపై సినిమా అభిమానంతోనే కాదు.. ఆయన ద్వారా ఏదో ఓ రూపంలో సాయం పొందిన వాళ్లు కూడా ఉంటారు. ఓ సంఘటన చెప్పాలంటే.. శ్రీహరి గారికి రెండు మొబైల్ ఫోన్లు ఉండేవి. ఒకటి పర్సనల్ నెంబర్.. రెండు పబ్లిక్‌కు ఇచ్చేవి. పర్సనల్ రాత్రి ఆఫ్ చేసి.. పబ్లిక్‌కు ఇచ్చిన నెంబర్ రాత్రి పూట కూడా ఆన్‌లో ఉంచేవారు. ఓ అర్థరాత్రి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. ఎవడో Unknown పర్సన్ కాల్ చేసి.. కంగారుగా ఏదో మాట్లాడుతున్నారు. అప్పుడు శ్రీహరిగారు అతనిని గద్దించి విషయం ఏంటో చెప్పమన్నారు. అతను తన భార్య ఇద్దరు ఆడపిల్లలతో షిరిడి నుంచి తిరిగి వస్తున్నారు. బస్సులో ఎవరో మద్యం తాగి ఆడపిల్లలను కామెంట్ చేసినప్పుడు ఇతను వాళ్లను తిట్టేశాడు. కానీ బస్సులో జనాలు ఉన్నారని వాళ్లు ఆగి.. పొద్దున్నే SR నగర్ దగ్గర దిగినప్పుడు అతన్ని కొడతామని బెదిరించారు. అతనికి ఏం చేయాలో అర్థం కాక.. ఎప్పుడో దూరంగా శ్రీహరిగారు ఎవరికో నెంబర్ ఇస్తున్నప్పుడు.. చూసి సేవ్ చేసుకున్న ఆ వ్యక్తి నేరుగా ఆయనకే ఫోన్ చేసి సమస్య చెప్పాడు. అప్పుడు అతనికి ధైర్యం చెప్పి.. ఇప్పుడు వాళ్లతో గొడవపడకు.. పొద్దున్నే SR నగర్‌ దగ్గరకు రా.. మన వాళ్లు అక్కడ ఉంటారని చెప్పారు. పొద్దున్నే ఆ వ్యక్తి కంగారు పడుతూ 'సార్ ఎవరైనా ఉన్నారా' అని అడిగితే... పర్లేదు కిందకు రా అని చెప్పారు. అప్పటికే అక్కడకు  Endevour  కారులో లుంగీలో వచ్చి.. నిద్ర కళ్లతో శ్రీహరిగారు వెయిట్ చేస్తున్నారు. దీనిని కథగా చెప్తే ఎవరైనా నమ్ముతారా... కానీ ఇది నిజంగా జరిగింది. ఆ వ్యక్తి కుటుంబం థాంక్స్ చెబుతూ శ్రీహరి గారి కాళ్ల మీద పడుతున్నప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని" అని చెప్పినప్పుడు.. ఆ ప్రాంగణమంతా ఎమోషనల్ అయిపోయింది. 

తనకు కూడా శ్రీహరి గారితో ఎంతో అనుబంధముందని.. ఆయన చాలా సినిమాలకు కథా చర్చల్లో పాల్గొన్నా అని బాబీ చెప్పారు. ఇదొక్కటే కాదు.. ఆయన ద్వారా సాయం పొందిన వ్యక్తులు, ఇండస్ట్రీలోని వారు కూడా చాలా బాగా చెబుతారు.. అంతే కాదు... ఆయన జీవించి ఉన్న కాలంలో జూబ్లిహిల్స్ రోడ్‌నెం.45లో ఉన్న ఆయన నివాసం జనంతో కిటకిటలాడుతుండేది. రకరకాల సాయం కోసం సినిమా ఇండస్ట్రీలోని వారే కాదు.. బయట వాళ్లు కూడా ఆయనింటికి వచ్చేవారు. శ్రీహరికి ముగ్గురు పిల్లలు.. ఇద్దరబ్బాయిలు ఓ అమ్మాయి. అయితే పాప చిన్నతనంలోనే చనిపోవడంతో తన పేరు మీద అక్షర ఫౌండేషన్ స్టార్ట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 

2013లో మృతి

ముప్పై ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్న ఆయన అద్బుతమైన నటుడు. మొదట్లో నటనకు అంతగా అవకాశాల్లేని చిన్న చిన్న వేషాలు వేసినా.. ఆ తర్వాత శ్రీహరిలోని నిజమైన నటుడుని వెలికితీసిన సినిమాలు వచ్చాయి. ఆయన్ను మాస్‌ హీరోగా నిలబెట్టిన పోలీస్, సాంబయ్య, గణపతి, భద్రాచలం వంటి సినిమాల్లో ఆయన నటన సూపర్. ఆ తర్వాత హనుమంతు, విజయరామారాజు వంటి సినిమాల్లో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారు. ఇక కేరక్టర్ ఆర్టిస్ట్‌గా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమా ఆయన కెరీర్‌న మరో మలుపు తిప్పింది. దానికి Filmfare అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఢీ, కింగ్, మగధీరవంటి సినిమాల ద్వారా తన నటనలో మరోకోణాన్ని ఆవిష్కరించారు. తన కెరీర్‌లో5 నంది పురస్కారాలు పొందారు.  తన కేరీర్‌ చాలా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు శ్రీహరి దురదుష్టవశాత్తూ అనారోగ్యంతో మృతి చెందారు. ముంబైలో R For Rajkumar షూటింగ్‌లో ఉండగా ఆయనకు తీవ్ర అస్వస్తత కలిగింది. ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget