అన్వేషించండి

Double iSmart : పూరీ కథను నిజం చేసిన ఎలన్ మస్క్ - రియల్ లైఫ్ 'ఇస్మార్ట్ శంకర్' రెడీ

iSmart Shankar: 'ఇస్మార్ట్ శంకర్' లో మనిషి మెదడులో చిప్ ఇంప్లాంట్ చేసినట్లు నిజజీవితంలోనూ ఓ వ్యక్తికి అలాగే చేశామని ఎలన్ మస్క్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

iSmart Shankar Movie: టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. రామ్ ని కంప్లీట్ మాస్ మసాలా రోల్ లో చూపించి దానికి మెడికల్ టెక్నాలజీని లింక్ చేస్తూ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో పూరి డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు. సినిమాలో హీరో రామ్ మెదడులో బ్రెయిన్ షిప్ ఇంప్లాంట్ చేయడం తెలిసిందే కదా. అది సినిమా కాబట్టి చెల్లింది. నిజంగా రియల్ లైఫ్ లో ఇలా ఉంటుందా? అని సినిమా చూసిన చాలా మంది అప్పట్లో అనుకున్నారు.

అయితే ఇప్పుడు నిజ జీవితంలో దీన్ని నిజం చేయబోతున్నారు ఎలన్ మాస్క్. ఇప్పటికే మనం రీల్ లైఫ్ లో చూసిన ఇస్మార్ట్ శంకర్ ని రియల్ లైఫ్ లో రెడీ చేశారు. ఎర్లీ రిజల్ట్స్ పాజిటివ్ అని కూడా చెప్పారు. ఎలన్ మస్క్ ఓ వ్యవస్థాపకుడిగా ఉన్న న్యూరో లింక్ కంపెనీ ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఓ మనిషి మెదడులో వైర్లెస్ చిప్ అమర్చారు. ఆ ప్రయోగం అనంతరం మెదడు కార్యకలాపాలు గుర్తించామని, ఆపరేషన్ సక్సెస్ అయిందని, పేషెంట్ కూడా కోలుకున్నారని స్వయంగా ఎలన్ మాస్క్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మన మెదడుని కంప్యూటర్స్ కి కనెక్ట్ చేసే నరాల సంబంధిత సమస్యలను పరిష్కరించాలనేదే తమ లక్ష్యం అని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. అయితే, ‘ఇస్మార్ట్ శంకర్‌’లో ఆ చిప్ ద్వారా వేరే వ్యక్తి ఆలోచనలు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. భవిష్యత్తులో రియల్‌గా కూడా అది సాధ్యం కావచ్చు. 

ఇక పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ఈ ప్రక్రియని డీటెయిల్ గా వివరించారు. పూరి జగన్నాథ్ సినిమా కథని ఎలెన్ మాస్క్ నిజం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మనిషి మెదడులో చిప్ మార్చడం అనేది కలలో కూడా ఊహించడానికి కష్టం అనే భ్రమలో ఇన్నాళ్లు ఉండిపోయారు. కానీ ఇప్పుడు అది నిజమైంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకెన్ని ప్రయోగాలు చేస్తారో చూడాలి. ఇదంతా టెక్నాలజీ మహిమే. ఇక రామ్ - పూరీ జగన్నాథ్ కలిసి ఇదే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' చేస్తున్నారు. ఈ సీక్వెల్ కథ కూడా ఫ్యూచరిస్టిక్ మెడికల్ టెక్నాలజీ మీదే ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కూడా అదే విధంగా మరో ప్రయోగం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

ఇక 'డబుల్ ఇస్మార్ట్' సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ కి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ మరోసారి ఈ సీక్వెల్ కి మ్యూజిక్ అందిస్తున్నారు. మొదట శివరాత్రి కానుకగా మార్చి 8న ఈ సినిమాని విడుదల చేయాలని అనుకున్నారు. సినిమా అనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. కానీ సినిమాకు సంబంధించి ఇంకా పెండింగ్ వర్క్ ఉండడంతో మే నెలలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత రానుంది.

Also Read : ఆ హీరోతో హ్యాట్రిక్‌కు రెడీ అయిన అనిల్ రావిపూడి!

టాప్ హెడ్ లైన్స్

Indraja: స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
Fauzi Vs Spirit: 'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
Mandaadi Collections: 'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు
'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు
Kiara Advani: మళ్ళీ తల్లి కాబోతున్న కియారా... సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన హీరోయిన్
మళ్ళీ తల్లి కాబోతున్న కియారా... సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన హీరోయిన్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget