(Source: Poll of Polls)
Ram Charan: RC16 నుంచి అదిరిపోయే అప్‌డేట్ - రామ్ చరణ్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్, అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది..
Shiva Rajkumar in RC16: రామ్ చరణ్-బుచ్చిబాబు సానా మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. చరణ్ కోసం మూవీ టీం కన్నడ స్టార్ హీరోని రంగంలోకి దింపుతున్నారు. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
Kannada Star Shiva Rajkumar in Ram Charan RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. నెక్ట్స్ 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సానా చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. బుచ్చిబాబు-రామ్ చరణ్ కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియా చిత్రంగా ఆర్‌సి16(#RC16) మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాన్ని జరుపుకుంది. ఇక అతి త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ కూడా మొదలు కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
అయితే, ఆర్‌సి16 మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడి వ్యవహరించనున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాల్లోని మిగతా నటీనటుల వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. తాజాగా ఈ చిత్రంలోకి ఓ స్టార్ మీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. RC16 సినిమాలోకి ఆయనకు స్వాగతం పలుకుతూ మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు బుచ్చిబాబు సానా సోషల్ మీడియాలో పోస్ట్ వదిలారు. ఇవాళ (జూలై 12) కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పుట్టిన రోజు. ఆయన బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.
ఆర్‌సీ16లో ఆయన నటిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు శివరాజ్ కుమార్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, బుచ్చిబాబు ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆర్‌సీ16 మూవీ సెట్‌లోకి ఆయనకు స్వాగతం పలికారు. "కరునాడ చక్రవర్తి' నిమ్మా శివన్నకు స్వాగతం. ప్రతిధ్వనించే కీలక పాత్ర కోసం అంతా సిద్ధం. హ్యాపీ బర్త్‌డే శివన్న" అంటూ RC16 టీం ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే ఈ సినిమాలో ఆయన ఓ పవర్పుల్ రోల్ పోషిస్తున్నట్టు ఈ సందర్భంగా మూవీ టీం స్పష్టం చేసింది. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు కూడా శివరాజ్ కుమార్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశాడు.
Welcoming 'Karunada Chakravarthy' @NimmaShivanna on board for a pivotal role that resonates with his stature 🔥
— Mythri Movie Makers (@MythriOfficial) July 12, 2024
Team #RC16 wishes #Shivanna a very Happy Birthday ✨#RamCharanRevolts
Global Star @AlwaysRamCharan #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla… pic.twitter.com/gPmlgJ70xX
"ప్రియమైన శివన్న మీకు అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగు సినిమాకి మిమ్మల్ని స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము సార్. మిమ్మల్ని సెట్స్‌లో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అంటూ ట్వీట్ చేశారు. కాగా కన్నడ సూపర్ స్టార్ అయినా శివరాజ్ కుమార్ తెలుగు ఆడియన్స్‌కి కూడా సుపరిచితమే. ఇప్పటికే ఆయన ఏ తెలుగు చిత్రంలో నటించకపోయినా.. డబ్బింగ్ చిత్రాలు.. మన తెలుగు స్టార్స్ ఉన్న అనుబంధం వల్ల ఆయన టాలీవుడ్ ఆడియన్స్‌కి దగ్గరయ్యారు. ఇప్పుడు రామ్ చరణ్ RC16 సినిమాతో నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో ఇటూ శివన్న తెలుగు ఫ్యాన్స్‌తో పాటు కన్నడ ఆడియన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్‌ను మూవీ టీం పరిశీలిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Wishing you a fantastic birthday dear Shivanna @NimmaShivanna ❤️❤️❤️
— BuchiBabuSana (@BuchiBabuSana) July 12, 2024
We're beyond thrilled to welcome you to Telugu Cinema Sir....
Can't wait to see you on Sets Sir🤍🫂 pic.twitter.com/wJawPDuqIS
Also Read: 'ఆర్‌ఆర్‌ఆర్'కు అవార్డుల పంట, సత్తాచాటిన 'సీతారామం' - ఏఏ విభాగంలో ఎవరెవరికంటే..