అన్వేషించండి

Ranbir Kapoor: రాముడి పాత్ర కోసం రణబీర్ కపూర్ కసరత్తులు - వీడియో వైరల్

Ranbir Kapoor: ‘యానిమల్’తో హిట్ కొట్టిన రణబీర్ కపూర్.. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ‘రామాయణ’లో రాముడి పాత్రలో కనిపించనున్నాడు. దానికోసం భారీ వర్కవుట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Ranbir Kapoor Workouts Video: ప్రస్తుతం బాలీవుడ్ దృష్టి మొత్తం ఒక్క ప్రాజెక్ట్ పైనే ఉంది. అదే ‘రామాయణ’. నితేష్ తివారి తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ ప్రీ ప్రొడక్షన్ పనులు సైలెంట్‌గా జరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా తెరకెక్కనంత బడ్జెట్‌తో దీనిని తెరకెక్కించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇందులో రాముడిగా రణబీర్ కపూర్ ఎంపికయ్యాడు. ఇటీవల ‘యానిమల్’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన రణబీర్ కపూర్.. ప్రస్తుతం ‘రామాయణ’ కోసం కసరత్తులు మొదలుపెట్టాడు. రాముడిగా సెట్ అవ్వడం కోసం భారీ కసరత్తులు మొదలుపెట్టాడు. తాజాగా తన వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అన్ని రకాల వర్కవుట్స్..

ఇప్పటికే ‘రామాయణ’ కోసం రణబీర్ కపూర్ కసరత్తులు మొదలుపెట్టాడని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా తన భారీ వర్కవుట్ వీడియో ఒకటి బయటికి వచ్చింది. తన పర్సనల్ ట్రైనర్ నామ్.. రణబీర్ కపూర్ వర్కవుట్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో కాసేపట్లోనే ఇది వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ముందుగా రణబీర్.. జిమ్ బాల్‌తో, ఆ తర్వాత కెటిల్‌బెల్స్‌తో, ఆపై జిమ్ రోప్స్‌తో వర్కవుట్స్ చేశాడు. అంతే కాకుండా ఇందులో తను రన్నింగ్, హైకింగ్ లాంటివి కూడా చేసి చూపించాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ వర్కవుట్స్ చేస్తూ రణబీర్ కపూర్.. ‘రామాయణ’ కోసం బాగానే ప్రిపేర్ అవుతున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు.

గెస్ట్ రోల్స్..

వైరల్ అవుతున్న రణబీర్ కపూర్ వర్కవుట్ వీడియోలో కొందరు ఆలియా భట్ కూడా ఉందని గమనించారు. ఇక రణబీర్‌తో పాటు ఆలియా కూడా ట్రెక్కింగ్‌కు వెళ్లగా.. అప్పుడు రాహా కూడా పక్కనే ఉందని చెప్పుకొచ్చారు. ఇది చూసి రణబీర్ సినిమాలో ఆలియా, రాహా గెస్ట్ రోల్‌‌లో కనిపించినట్టు ఉంది అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రణబీర్ కపూర్ చివరిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’లో నటించాడు. ఈ మూవీ ఓ రేంజ్‌లో హిట్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.900 కోట్లు కలెక్ట్ కూడా చేసింది. ఇక ‘యానిమల్’లో అస్సలు దయ లేని బల్బీర్ సింగ్ పాత్రలో కనిపించిన రణబీర్.. వెంటనే ‘రామాయణ’లో రాముడిగా కనిపించడం కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Training With Nam (@trainingwithnam)

ప్రీ ప్రొడక్షన్..

‘యానిమల్’ తర్వాత వెంటనే ‘యానిమల్ పార్క్’ను చేయాల్సి ఉంది రణబీర్ కపూర్. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు కూడా ఇతర కమిట్మెంట్స్ ఉండడంతో నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ను పూర్తి చేద్దామని డిసైడ్ అయ్యాడు ఈ హీరో. ప్రస్తుతం ‘రామాయణ’కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో రాముడిగా జోడీగా, సీత పాత్రలో సాయి పల్లవి నటించనుంది. ఇక విలన్ రావణుడిగా యశ్ కనిపించబోతున్నాడు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇతర కీలక పాత్రల కోసం కూడా పలువురు నటీనటులతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

Also Read: మైదాన్ రివ్యూ: ఫుట్‌బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Pallaburusu Trailer Review : టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
Dark Comedy Thriller OTT : శవాన్ని కిడ్నాప్ చేసే ఫ్రెండ్స్ - ఓటీటీలోకి వచ్చేసిన డార్క్ కామెడీ డ్రామా... ఎందులో చూడొచ్చంటే?
శవాన్ని కిడ్నాప్ చేసే ఫ్రెండ్స్ - ఓటీటీలోకి వచ్చేసిన డార్క్ కామెడీ డ్రామా... ఎందులో చూడొచ్చంటే?
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget