అన్వేషించండి

Ranbir Kapoor Animal: అది వాళ్లే నిర్ణయిస్తారు, మరింత బోల్డ్‌గా 'యానిమల్‌ పార్క్‌' - విమర్శలపై రణ్‌బీర్‌ స్పందన

Animal Movie: 'యానిమల్‌ పార్క్‌' గురించి రణ్‌బీర్‌కపూర్‌ సూపర్‌ సూపర్‌ విషయాలు పంచుకున్నారు. ఇంక అంతే కాకుండా 'యానిమల్‌' మీద వస్తున్న నెగటివిటీపై ఆయన సంచలన కామెంట్స్‌ చేశారు.

Animal Movie: రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో రిలీజైన సినిమా 'యానిమల్‌'. భారీ హిట్‌ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. అయితే, ఈ సినిమాకి సంబంధించి చాలామంది నెగటివ్‌గా మాట్లాడుతున్నారు. వాయిలెన్స్‌ ఎక్కువగా ఉందని, ఒక హీరో అలా చేయొద్దనే ఉద్దేశాన్ని చెప్తున్నారు. ఆడియెన్సే కాదు.. చాలామంది ఫిల్మ్‌మేకర్స్‌ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ విషయాలపై స్పందించారు హీరో రణ్‌బీర్‌ కపూర్‌. నెట్‌ఫ్లిక్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు. ఇక 'యానిమల్‌ పార్క్‌' గురించి కూడా కొన్ని విషయాలు చెప్పారు.

నెగిటివిటీ గురించి.. 

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ కోసం స్టాండప్ కమెడియన్ అనుభవ్ సింగ్ బాసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘యానిమల్'పై వస్తున్న నెగటివిటీ గురించి రణ్‍బీర్ స్పందించారు. "తండ్రి కొడుకుల మధ్య ఉన్న రిలేషన్‌ కొడుకును డార్క్‌సైడ్‌, వయిలెన్స్‌ వైపుకు తీసుకెళ్లింది. ఈ విషయంపై నెగటివిటీ వచ్చినప్పటికీ.. దీనిపై పాజిటివ్‌గానే మాట్లాడుకుంటున్నారు. విషపూరితమైన విషయం గురించి కూడా పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు అంటే.. జనాలకి అది తప్పు అని అర్థం అవుతుంది. ఇది సినిమా, దాంట్లో ఒక తప్పును తప్పు అని చూపిస్తేనే కదా.. జనాలు తెలుసుకునేది. చూపించకపోతే ఎప్పటికీ అది తప్పు అని ఎవ్వరికీ తెలీదు. మనం పోషించే పాత్రలు అనేవి క్యారెక్టర్‌. వాటిపై కచ్చితంగా సానుభూతి కలిగి ఉంటాం. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. మీరు తప్పు వ్యక్తిపై సినిమా తీయవచ్చు, అలా తీయాలి కూడా. ఎందుకంటే వారిపై సినిమా తీయకపోతే సమాజం ఎప్పటికీ బాగుపడదు" అని అన్నారు రణ్‌బీర్‌కపూర్‌.

ఇక 'యానిమల్‌' సక్సెస్‌తో 'యానిమల్‌ పార్క్‌'ని మరింత గట్టిగా ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పారు రణ్‌బీర్‌. సందీప్‌ రెడ్డి సీక్వెన్స్‌ని ఇంకా బోల్డ్‌గా, మరింత లోతుగా, మరింత డార్క్‌గా ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పారు. అది వేరే లెవెల్‌లో ఉండబోతోంది అంటూ దాని గురించి చెప్పారు. 'యానిమల్‌' సక్సెస్‌తో సందీప్‌లో కాన్ఫిడెన్స్‌ బాగా పెరిగిందని చెప్పారు రణ్‌బీర్‌. తాను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నానని చెప్పారు. సందీప్‌ ముందు స్రిప్ట్‌ ఎవ్వరికీ చెప్పరని చాలా ప్లాన్‌గా దాన్ని ఎగ్జిగ్యూట్‌ చేస్తాడని అన్నారు రణ్‌బీర్‌.

'యానిమల్‌' సినిమాపై ప్రముఖ డైరెక్టర్‌ జావెద్‌ అక్టర్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. హీరో అంటే ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలని, ఇలా భార్యను తన్నడం అలాంటివి చేసి చూపించొద్దని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కాలంలో రైటర్లు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. ఏది తప్పు ఏది ఒప్పు అనేది సొసైటీ డిసైడ్‌ చేయదని, సినిమా దాన్ని రిఫ్లెక్ట్‌ చేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రణ్‌బీర్‌ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు.. ఆయనకు కౌంటర్‌గానే అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. 

పోయిన ఏడాది డిసెంబర్‌లో రిలీజైన 'యానిమల్‌' సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సత్తా చాటింది. సూపర్‌హిట్‌గా నిలిచింది ఈ సినిమా. దాదాపు రూ.900 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో అనిల్‌ కపూర్‌, రష్మిక మందన, త్రిప్తి దిమ్రీ, బాబీ డియోల్‍ తదితరులు నటించారు. 

Also Read: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో యానిమల్ దూకుడు - ఉత్తమ నటీనటులుగా రణబీర్, అలియా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Raakaasa OTT Trending : కోటలో బ్రహ్మ రాక్షసుడు... బలిగా మనిషి ప్రాణం - ఓటీటీలో టాప్ ట్రెండింగ్ హారర్ మూవీ
కోటలో బ్రహ్మ రాక్షసుడు... బలిగా మనిషి ప్రాణం - ఓటీటీలో టాప్ ట్రెండింగ్ హారర్ మూవీ
Vijay vs Udhayanidhi: కర్మ రిటర్న్స్.. నాడు విజయ్‌ పార్ట్ టైం పొలిటీషియన్ అని సెటైర్లు.. నేడు ప్రతిపక్షనేతగా ఉదయనిధి స్టాలిన్
కర్మ రిటర్న్స్.. నాడు విజయ్‌ పార్ట్ టైం పొలిటీషియన్ అని సెటైర్లు.. నేడు ప్రతిపక్షనేతగా ఉదయనిధి స్టాలిన్
Ashu Reddy : నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
CM Vijay manifesto: మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
Bandi Sanjay Speech: నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
Ashu Reddy : నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
PM Modi Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
Embed widget