అన్వేషించండి

Ram Pothineni : 'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన ఉస్తాద్ హీరో!

Ram Pothineni : హీరో రామ్ పోతినేని తాజాగా ఓ ఈవెంట్లో 'డబుల్ ఇస్మార్ట్' మూవీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చాడు.

Ram Pothineni About 'Double Ismart' New Release date : ఉస్తాద్ హీరో రామ్ పోతినేని - డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. యూత్ అండ్ మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా తెగ నచ్చేసింది. అప్పటివరకు వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాథ, రామ్ ఇద్దరికీ ఈ సినిమా భారీ బూస్టింగ్ ఇచ్చింది. ఇక అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ ని వెల్లడించారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక తాజాగా హీరో రామ్ స్వయంగా 'డబుల్ ఇస్మార్ట్' ఎప్పుడు విడుదలవుతుందో స్వయంగా వెల్లడించారు.

'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన ఉస్తాద్ హీరో

'డబుల్ ఇస్మార్ట్' మూవీ నిజానికి మార్చి లోనే రిలీజ్ కావాల్సింది. శివరాత్రి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించారు. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో మార్చి నుంచి వాయిదా వేశారు. అయితే ఇప్పటిదాకా కొత్త రిలీజ్ డేట్ ని మాత్రం ప్రకటించలేదు. ఏప్రిల్ నెలలో పెద్ద సినిమాలు, ఎన్నికల హడావిడి ఉండడంతో రామ్ ఫ్యాన్స్ ఈ సినిమా రిలీజ్ గురించి ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు రామ్. తాజాగా హైదరాబాద్ లో ఓ ఈవెంట్ కి హాజరైన రామ్ జూన్ లో 'డబుల్ ఇస్మార్ట్' మూవీని థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఆ సమయానికి ఎన్నికల హడావిడి అంతా ముగిసిపోతుందని, జూన్‌లో సినిమా రిలీజ్ చేస్తామని తెలిపాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో

'డబుల్ ఇస్మార్ట్' మూవీని ఈసారి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' 2019లో కేవలం తెలుగులోనే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత హిందీ తో పాటు ఇతర భాషల్లో డబ్ అయి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. అందుకే పూరి అండ్ టీం ఈసారి 'డబుల్ ఇస్మార్ట్' ని తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాతో హీరో రామ్ కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా చార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' కి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ 'డబుల్ ఇస్మార్ట్' కోసం అంతకుమించి ఊరమాస్ ఆల్బమ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని పాటల కంపోజీషన్ పూర్తయినట్లు సమాచారం.

Also Read : అమెరికా వెళ్ళిపోవడానికి కారణం అదే - సీనియర్ నటి నదియా

టాప్ హెడ్ లైన్స్

Akhil Akkineni : ఏజెంట్ డిజాస్టర్... అమెరికన్ సిటిజన్ షిప్... సిసింద్రీ సీక్వెల్ - అఖిల్ అక్కినేని రియాక్షన్
ఏజెంట్ డిజాస్టర్... అమెరికన్ సిటిజన్ షిప్... సిసింద్రీ సీక్వెల్ - అఖిల్ అక్కినేని రియాక్షన్
Nara Rohith : సౌండ్ ఇంజినీర్‌గా నారా రోహిత్ - కామెడీ జానర్‌లో కొత్త మూవీ
సౌండ్ ఇంజినీర్‌గా నారా రోహిత్ - కామెడీ జానర్‌లో కొత్త మూవీ...
Katrina Kaif In Spirit: ప్రభాస్ 'స్పిరిట్'లో కత్రినా కైఫ్... దీపికా పదుకోన్ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
ప్రభాస్ 'స్పిరిట్'లో కత్రినా కైఫ్... దీపికా పదుకోన్ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Embed widget