అన్వేషించండి

Ram Gopal Varma: ఏపీ సీఎం జగన్‌తో రామ్ గోపాల్ వర్మ భేటీ - ‘వ్యూహం’ కోసమేనా?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా వివాదమే. ఆయన వ్యాఖ్యలు చేసే చేష్టలు ఒక్కోసారి పెద్ద దుమారమే రేపుతాయి. ఈ మధ్య ఎక్కువగా పొలిటికల్ గా కూడా సెటైర్లు వేస్తూ ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు ఆర్జీవీ.

Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా వివాదమే. ఆయన వ్యాఖ్యలు చేసే చేష్టలు ఒక్కోసారి పెద్ద దుమారమే రేపుతాయి. ఈ మధ్య ఎక్కువగా పొలిటికల్ గా కూడా సెటైర్లు వేస్తూ ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు ఆర్జీవి. సోషల్ మీడియాలో ప్రస్తుత రాజకీయ అంశాలపై తనదైన స్టైల్ లో స్పందిస్తూ కౌంటర్ లు ఇస్తున్నాడు. ఈయన చేసే ట్వీట్లు, పోస్ట్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ పార్టీను సమర్థిస్తూ ప్రతిపక్షాలపై కావాలనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు (జూన్19) సాయంత్రం సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. చాలా రోజుల తర్వాత సీఎం జగన్ తో ఆర్జీవి భేటీ అవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. 

‘వ్యూహం’ సినిమా కోసమేనా..

రామ్ గోపాల్ వర్మ గత కొన్నేళ్లుగా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లోనే సినిమాలు తీస్తున్నాడు. అలాగే ఆయన గత కొంత కాలంగా వైసీపీ పార్టీను సమర్థిస్తూ వస్తోన్న విషయం కూడా విదితమే. అందుకే ప్రతిపక్ష టీడీపీ, దాని మిత్రపక్షం జనసేనను ఓ రేంజ్ లో విమర్శిస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ లైఫ్ స్టోరీ ను బేస్ చేసుకొని ఓ పొలిటికల్ డ్రామా సినిమాను తెరెక్కిస్తున్నారు. ప్రజల్లో వైఎస్ జగన్ పై సింపతీ వచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ మూవీతో పాటు ‘శపథం’ అనే సినిమాను కూడా జగన్ లైఫ్ స్టోరీను బేస్ చేసుకునే తీస్తున్నారట. ఇప్పటికే ఈ ‘వ్యూహం’ అనే సినిమాకు సంబంధించి కొన్ని లుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అందులోని పాత్రలు కూడా వైఎస్ జగన్, వైఎస్ భారతిలను పోల్చి ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ను ఆర్జీవి కలుస్తున్నారనే టాక్ నడుస్తోంది. మరి మూవీ కోసం చర్చించడానికి వెళ్లారా మరేదైనా విషయం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ‘వ్యూహం’ నేపథ్యంలో గతంలో కూడా ఆర్జీవీ.. జగన్‌ను కలిశారు.

బహిరంగంగానే వైసీపీతో..

గతంలో రామ్ గోపాల్ వర్మ ఎలాంటి పొలిటికల్ సైడ్ తీసుకునేవాడు కాదు. ఎవరు తప్పు చేసినా ఎవరు మంచి చేసినా తన స్టైల్ లో స్పందించేవాడు. అయితే అనూహ్యంగా 2019 ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీకు దగ్గరయ్యాడు వర్మ. అందుకే చంద్రబాబుకు వ్యతిరేకంగా ‘లక్ష్మీస్’ ఎన్టీఆర్ తీశాడనే వాదనలు ఉన్నాయి. ఇక ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత బహిరంగంగానే పార్టీకు మద్దతిస్తున్నాడు ఆర్జీవి. వైసీపీను పొగుడుతూ ప్రతిపక్షాలను తిడుతూ నిత్యం ఏదొక పోస్ట్ ను షేర్ చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ కు కలిసొచ్చేలా ఈ ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాలను ప్లాన్ చేశాడనేది టాక్. అయితే ఇప్పుడు సీఎం జగన్ తో భేటీలో ఈ మూవీల గురించి మాట్లాడారా లేదా మరేదైనా పొలిటికల్ చర్చ నడిచిందా అనేది చూడాలి. 

ఈసారి అయినా ప్రేక్షకులు చూస్తారా?

రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. గతంలో ‘వంగవీటి’ సినిమాను తెరకెక్కించారు. ఆ మూవీ కొంత మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత 2019 ఎన్నికలకు ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తీశారు. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ఈ మూవీ తర్వాత మళ్లీ కొన్నాళ్ల తర్వాత ‘కొండా’ అనే పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఓ సినిమా చేశారు. ఆ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియలేదు. ప్రమోషన్స్ బాగానే చేసినా సినిమా అసలు ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మళ్లీ వై ఎస్ జగన్ లైఫ్ స్టోరీ బ్యాక్డ్రాప్ లో ఏకంగా రెండు సినిమాలు తెరకెక్కిస్తామని ప్రకటించాడు ఆర్జీవి. మరి ఈ సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతమేరకు ఆకట్టుకుంటాయో చూడాలి. ఈ మూవీ లు కూడా గత సినిమాల లాగా ఏమాత్రం బెడిసికొట్టినా అసలకే మోసం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ అభిమానులు. 

Read Also: ‘ది ఆర్చీస్’ ట్రైలర్‌: కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన స్టార్ కిడ్స్ - షారుఖ్‌, అమితాబ్, శ్రీదేవి వారసులు ఇరగదీశారంతే!

టాప్ హెడ్ లైన్స్

Rashmika Mandanna : రష్మిక గొప్ప మనసు - 400 కుటుంబాలు దత్తత... నేషనల్ క్రష్ కైండ్ హార్ట్‌కు ఫ్యాన్స్ ఫిదా
రష్మిక గొప్ప మనసు - 400 కుటుంబాలు దత్తత... నేషనల్ క్రష్ కైండ్ హార్ట్‌కు ఫ్యాన్స్ ఫిదా
Crime Thriller OTT : అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... రెండు ఓటీటీల్లోకి లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్
అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... రెండు ఓటీటీల్లోకి లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్
Jim Jim Tara Song Lyrics : జిమ్ జిమ్ తార జిమ్ జిమ్ తార జిలేబీ తేరా సిన్నోడా - సోషల్ మీడియాను ఊపేసిన ఫోక్ సాంగ్ లిరిక్స్
జిమ్ జిమ్ తార జిమ్ జిమ్ తార జిలేబీ తేరా సిన్నోడా - సోషల్ మీడియాను ఊపేసిన ఫోక్ సాంగ్ లిరిక్స్
TG Vishwa Prasad: 'ది రాజా సాబ్' కొంపముంచిన సంక్రాంతి? బాక్సాఫీస్ రిజల్ట్ మీద ప్రొడ్యూసర్ షాకింగ్ రియాక్షన్
'ది రాజా సాబ్' కొంపముంచిన సంక్రాంతి? బాక్సాఫీస్ రిజల్ట్ మీద ప్రొడ్యూసర్ షాకింగ్ రియాక్షన్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Embed widget