అన్వేషించండి

Pushpa The Rule: ‘పుష్ప2’ విడుదల అప్పుడేనా? బన్నీ అభిమానులకు పండగే!

‘పుష్ప’లో అద్భుత నటనతో ఆకట్టుకున్న బన్నీకి ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప2’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సినిమా రిలీజ్ డేట్ పై మేకర్స్ ఓ అంచనాకు వచ్చారట!

ఇండియన్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో 'పుష్ప- ది రూల్'  ఒకటి. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. 'పుష్ప- ది రైజ్' పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో దాన్ని మించేలా 'పుష్ప- ది రూల్' ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘పుష్ప’ మూవీ సత్తా చాటింది. ఇందులో అద్భుత నటన కనబర్చిన అల్లు అర్జున్, ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నారు. ఏ తెలుగు హీరోకు సాధ్యం కాని ఘనతను సాధించారు. ఈ మూవీకి చక్కటి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప2’పై కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొన్నాయి.

'పుష్ప- ది రూల్' విడుదల ఎప్పుడు?

ఇక తాజాగా 'పుష్ప- ది రూల్' సినిమా విడుదల తేదీపై మేకర్స్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది(2024) మార్చి 22న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ‘పుష్ప’ సినిమాతో పోల్చితే ‘పుష్ప2’ కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 75 శాతం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు ఇప్పటికే షూట్ చేశారట. చాలా వరకు వైజాగ్ లో ఈ సినిమాను షూట్ చేశారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించాలని మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఈ ఏడాది చివర్లోనే సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం అవుతుందట. దీంతో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'పుష్ప- ది రూల్'

మైత్రి మూవీ మేకర్స్ సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా.. అనసూయ, సునీల్ లతో పాటూ సీనియర్ నటుడు జగపతిబాబు మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'పుష్ప' పార్ట్ 1 కి వరల్డ్ వైడ్ గా భారీ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ 'పుష్ప 2'ను ఇండియా వ్యాప్తంగానే కాకుండా చైనా, జపాన్, రష్యా వంటి ఇతర దేశాల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also: ఉగాండానూ ఊపేస్తున్న తమన్నా సాంగ్ - ‘కావాలయ్య’ను రీక్రియేట్ చేసిన చిన్నారులు, వీడియో వైరల్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Fauzi Glimpse Backlash : ప్రభాస్ 'ఫౌజీ' గ్లింప్స్‌ - డైరెక్టర్ సారీ చెప్పాలని నేతాజీ మనవడి డిమాండ్... అసలేంటీ వివాదం?
ప్రభాస్ 'ఫౌజీ' గ్లింప్స్‌ - డైరెక్టర్ సారీ చెప్పాలని నేతాజీ మనవడి డిమాండ్... అసలేంటీ వివాదం?
Jadi Telugu Glimpse : ఒడియా బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగులో క్యూట్ లవ్ స్టోరీ 'జడి'... గ్లింప్స్ చూశారా?
ఒడియా బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగులో క్యూట్ లవ్ స్టోరీ 'జడి'... గ్లింప్స్ చూశారా?
Ravi Babu Kangana Ranaut : టాలీవుడ్‌లోకి బాలీవుడ్ క్వీన్ కంగనా - రవిబాబుతో హారర్ థ్రిల్లర్... ఆ వార్తల్లో నిజమెంతంటే?
టాలీవుడ్‌లోకి బాలీవుడ్ క్వీన్ కంగనా - రవిబాబుతో హారర్ థ్రిల్లర్... ఆ వార్తల్లో నిజమెంతంటే?
Horror Thriller OTT : మనుషులను పీక్కు తినే దెయ్యం - ఓటీటీ ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
మనుషులను పీక్కు తినే దెయ్యం - ఓటీటీ ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్... ఒంటరిగా అస్సలు చూడొద్దు

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Arnab Cyclone: ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
మూడున్నర లక్షల అమ్మకాలు దాటిన Tata Altroz.. ధర, మైలేజీ, ఫీచర్లు తెలిస్తే మీకూ కొనాలనిపిస్తుంది!
ఈ కారుకు దేశవ్యాప్తంగా ఫుల్‌ డిమాండ్‌.. టాటా అమ్మే ప్రతి 3 కార్లలో ఒకటి ఇదే!
Hero Xtreme 250R Standard - Carbon మధ్య తేడాలివే! కేవలం రూ.14,000 ఖర్చుకు దక్కే అదనపు ఫీచర్లు ఏంటి?
Hero Xtreme 250R లో కొత్త వేరియంట్‌.. ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Pushpaka Vimanam Series OTT : లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget