SSMB29: మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో విలన్‌గా మలయాళీ హీరో?
SS Rajamouli's #SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో రూపొందుతున్న సినిమాలో విలన్ రోల్ మలయాళ హీరో చేస్తున్నారని టాక్. ఇంకా హీరోయిన్ ఎవరో తెలుసా?
![SSMB29: మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో విలన్‌గా మలయాళీ హీరో? Prithviraj Sukumaran to Play Villain While Priyanka Chopra Joins as Mahesh Babu Lead Pair in Rajamouli SSMB29 SSMB29: మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో విలన్‌గా మలయాళీ హీరో?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/28/c54ef0292c6290ec32041b71345186f01735380568245313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలసి ఓ సినిమా చేయబోతున్న సంగతి ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. అది పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్ సినిమా. 'ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరం' సినిమాలోని 'నాటు నాటు....' పాటకు ఆస్కారం వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాపై హాలీవుడ్ చూపు కూడా పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు ఈ నేపథ్యంలో హీరోయిన్ విలన్ కూడా అందరికీ తెలిసిన వాళ్లను సెలెక్ట్ చేసే పనిలో రాజమౌళి ఉన్నారని ఫిలింనగర్ చెబుతోంది.
మహేష్ బాబు సినిమాలో మలయాళీ హీరో విలన్!?
పృథ్వీరాజ్ సుకుమారన్... మలయాళీ హీరో. అయితే... ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో ఆయన కీలకమైన క్యారెక్టర్ చేశారు. అంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో తమిళ సినిమా చేశారు. తను మాతృభాష మలయాళంలో పృథ్వీరాజ్ నటించిన సినిమాలు ఇతర భాషలలో డబ్బింగ్ కావడమే కాదు ప్రేక్షకుల ఆదరణ సైతం సొంతం చేసుకున్నాయి. అతడిని మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్రకు రాజమౌళి ఎంపిక చేశారని టాలీవుడ్ అంటోంది.
మహేష్ జంటగా హాలీవుడ్ వెళ్ళిన ప్రియాంక చోప్రా!?
మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గురించి ఇంటర్నేషనల్ స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. అందుకు కారణం ప్రియాంకా చోప్రా. హిందీ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆవిడ... ఇప్పుడు హిందీ సినిమాలకు కొంత దూరంగా ఉన్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో హాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు.
Also Read: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
మహేష్ బాబు సినిమా కూడా ఇంటర్నేషనల్ ఫిలిం. ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచర్స్ సినిమాగా రూపొందించాలని ఎస్.ఎస్ రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ప్రియాంక చోప్రా అయితే హాలీవుడ్ ప్రేక్షకులు చూపకుండా సినిమా మీద పడుతుందని ఆమెను సంప్రదించారని సమాచారం. రాజమౌళి టీం ఇప్పటివరకు మహేష్ బాబు సినిమా గురించి ఒక్క మాట కూడా చెప్పడం లేదు.
SSMB29 సినిమా గురించి ప్రచారంలో ఉన్నవన్నీ అవాస్తవాలేనని, మహేష్ బాబు తప్ప ఇంకెవరు కన్ఫామ్ కాలేదని, జనవరి 26 తర్వాత వివరాలన్నీ వెల్లడి అవుతాయని కొంత మంది చెబుతున్నారు. రాజమౌళి ఎప్పుడు సస్పెన్స్ మెయింటెన్ చేస్తారు కదా. ఒకేసారి విలేకరుల సమావేశం పెట్టి వివరాలు అన్ని వెల్లడిస్తారు.
Also Read: ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య... 'గేమ్ ఛేంజర్' టీంకు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)