Kalki 2898 AD : డార్లింగ్ ఫ్యాన్స్‌కు బర్త్ డే ఫస్ట్ ట్రీట్ - భైరవ ఈజ్ బ్యాక్... కల్కి 2898 AD నుంచి బిగ్ సర్ప్రైజ్
Prabhas Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. 'భైరవ ఈజ్ బ్యాక్' అంటూ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

Prabhas's Kalki 2898 AD Sequel Making Video : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన విజువల్ వండర్ కల్కి 2898 AD'. 2024లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.1,100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ భారీ ప్రాజెక్టుకు సీక్వెల్ కూడా రాబోతోంది. శుక్రవారం ప్రభాస్ బర్త్ డే సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. కల్కి సీక్వెల్ నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.
భైరవ ఈజ్ బ్యాక్
ఫస్ట్ పార్ట్‌లో చూపించిన విధంగానే పవర్ ఫుల్ లుక్‌లో కనిపించారు ప్రభాస్. 'భైరవ' ఈజ్ బ్యాక్ అంటూ నాగ్ అశ్విన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. 'ఇండియన్ సినిమా సూపర్ హీరోకు, ప్రతీ తరానికి ఆరాధ్య దైవమైన, రెబల్ స్టార్ ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీతో మీరు అద్భుతమైన సినీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము.' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
To the superhero of Indian Cinema… Happy Birthday to the Darling of every generation, Rebel Star #Prabhas. We are excited to embark on another epic cinematic journey with you… #Kalki2898AD ⚡ https://t.co/uE5GQAOr4c
— Kalki 2898 AD (@Kalki2898AD) October 23, 2026
ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ మూవీ షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 'కల్కి 2898 AD' సీక్వెల్ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌లపై కీలక సీన్స్ షూట్ చేశారు. రెండో షెడ్యూల్ ప్రారంభం కాగా... ప్రభాస్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఫౌజీ, స్పిరిట్ ప్రాజెక్టులు పూర్తయ్యాక పూర్తి స్థాయిలో కల్కి సీక్వెల్‌పై ఫోకస్ చేయనున్నారు. ఫస్ట్ పార్ట్‌లో శంభాల అనే ఓ అద్భుత ప్రపంచాన్నే చూపించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అంతకు మించిన స్థాయిలో రెండో పార్ట్ ప్లాన్ చేస్తున్నారు.
ఫస్ట్ పార్ట్‌లో కమల్, అమితాబ్ కలిసి కనిపించలేదు. రెండో పార్టులో ఇద్దరూ కలిసి కనిపించే సీన్స్ ఉన్నాయి. అశ్వత్థామగా అమితాబ్ నటిస్తుండగా... కమల్ హాసన్ నెగిటివ్ రోల్‌లో సుప్రీం యాస్కిన్‌గా కనిపించారు. రెండో పార్టులో ప్రభాస్ కర్ణుడిగా కనిపించనున్నారు. ఇందులో దాదాపు 20 నిమిషాల పాటు వచ్చే కురుక్షేత్ర వార్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతోందనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారు. ఆమె స్థానంలో సాయి పల్లవిని తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మధ్య నాటికి షూటింగ్ పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు























