అన్వేషించండి

Prabhas : ‘కల్కి 2898 AD’లో నా పాత్ర చాలా కామెడీగా ఉంటుంది: ప్రభాస్

ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' సినిమాకు సంబంధించి తాజాగా టైటిల్, గ్లిమ్స్ ని కామిక్ కాన్ ఈవెంట్ లో విడుదల చేయగా.. ఈ ఈవెంట్లో ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ కథానాయకుడిగా 'ప్రాజెక్ట్ K' అని వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ గ్లిమ్స్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 'కల్కి 2898 AD' అనే టైటిల్ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియో సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ గ్లిమ్స్ లో విజువల్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ లు గాని హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. ఇప్పటికే గ్లిమ్స్ ని చూసిన చాలామంది ఈ సినిమా ఖచ్చితంగా ఇండియా వైడ్ గా హాలీవుడ్ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా కోసం హిందూ మైథాలజీని మెయిన్ థీమ్ గా తీసుకున్నారు. హిందూ మైథాలజీకి సైన్స్ తో పాటు కొంత ఫిక్షన్ ని కలిపి ఈ సినిమాని తెరకెక్కించారు. హిందూ మైతాలజీ ప్రకారం.. కలియుగాంతంలో విష్ణుమూర్తి కల్కి అవతారంలో మళ్లీ వస్తారని ఉంది. ఇదే లైన్ తో నాగ అశ్విన్ 'కల్కి 2898AD' సినిమాని రూపొందిస్తున్నారు. కల్కి అవతారంలో ప్రభాస్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. సినిమాలో ఈ కల్కి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని గ్లిమ్స్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా కామిక్ కాన్ ఈవెంట్లో మాట్లాడిన ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' సినిమా గురించి, సినిమాలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు ప్రభాస్ మాట్లాడుతూ.." ఇది ఒక సూపర్ హీరో ఫిలిం అని, ఈ సినిమాలో తన క్యారెక్టర్ని నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన తీరు తనకు చాలా బాగా నచ్చిందని, అంతేకాకుండా మొత్తం ప్రాజెక్ట్ కే టీం లో నాగ్ అశ్విన్ చాలా సరదా మనిషని, ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్స్ ని డిజైన్ చేశారని, కానీ సినిమాలో నా పాత్ర  కామెడీగా ఉంటుందని, సినిమాలో నేనే కమేడియన్" అంటూ నవ్వుతూ చెప్పారు. దీంతో ప్రాజెక్ట్ కే గురించి ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ కామెంట్స్ విన్న నెటిజెన్స్ అయితే రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు కల్కి పాత్ర కామెడీగా ఉండడమేంటి? ప్రపంచం మొత్తాన్ని కాపాడే యోధుడి పాత్ర కామెడీగా ఉంటే ఎలా? అలా అయితే ఈ సినిమా కూడా పోయినట్లేనా? అంటూ కామెంట్స్ చేశారు.

అయితే ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' లో తన పాత్ర నిజంగానే కామెడీగా ఉంటుందని చెప్పాడా? లేక అలా సరదాగా అన్నాడా? అనేది తెలియకపోయినా ప్రస్తుతం ప్రభాస్ చేసిన కామెంట్స్  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కాగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాని సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్, కోలీవుడ్ సీనియర్ నటుడు కమలహాసన్, దిశా పటాని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Peddi Trailer : రౌడీ డైరెక్టర్ బుచ్చిబాబు - సెంటరాఫ్ అట్రాక్షన్‌గా జాన్వీ, చరణ్... పెద్ది స్టోరీ రివీల్
రౌడీ డైరెక్టర్ బుచ్చిబాబు - సెంటరాఫ్ అట్రాక్షన్‌గా జాన్వీ, చరణ్... పెద్ది స్టోరీ రివీల్
Peddi Trailer Review : పెద్ది సారూ... ఆటే నా పొగరు - చరణ్ మాస్ ఎంట్రీ To డైలాగ్స్... ట్రైలర్ రివ్యూ
పెద్ది సారూ... ఆటే నా పొగరు - చరణ్ మాస్ ఎంట్రీ To డైలాగ్స్... ట్రైలర్ రివ్యూ
Sudigali Sudheer Movie : సుడిగాలి సుధీర్ కొత్త మూవీ 'సుధీర్ జోకర్' - బర్త్ డే స్పెషల్ వచ్చేసింది
సుడిగాలి సుధీర్ కొత్త మూవీ 'సుధీర్ జోకర్' - బర్త్ డే స్పెషల్ వచ్చేసింది
Peddi Trailer : పెద్ది ట్రైలర్ వచ్చేసింది - రామ్ చరణ్ ఫైర్ ప్యాక్ట్ మాస్ ఎంటర్టైనర్
పెద్ది ట్రైలర్ వచ్చేసింది - రామ్ చరణ్ ఫైర్ ప్యాక్ట్ మాస్ ఎంటర్టైనర్

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 SRH In PlayOffs: ఇ'షాన్ దార్' ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్ కు చేరిన స‌న్ రైజ‌ర్స్, జీటీ కూడా, రాణించిన క్లాసెన్, క‌మిన్స్..
ఇ'షాన్ దార్' ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్ కు చేరిన స‌న్ రైజ‌ర్స్, జీటీ కూడా, రాణించిన క్లాసెన్, క‌మిన్స్..
Telangana Rains: ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 2 రోజులపాటు వర్షాలు.. మరోవైపు దంచికొడుతున్న ఎండలు
ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 2 రోజులపాటు వర్షాలు.. మరోవైపు దంచికొడుతున్న ఎండలు
AP SSC Supplementary Exam Hall Tickets: ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
Telangana Rakshana Sena: తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
Peddi Trailer Review : పెద్ది సారూ... ఆటే నా పొగరు - చరణ్ మాస్ ఎంట్రీ To డైలాగ్స్... ట్రైలర్ రివ్యూ
పెద్ది సారూ... ఆటే నా పొగరు - చరణ్ మాస్ ఎంట్రీ To డైలాగ్స్... ట్రైలర్ రివ్యూ
Two Headed Snake: 2 పాములతో రూ.25 కోట్లు సంపాదించేద్దామనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఏకంగా డీఆర్ఐనే..!
2 పాములతో రూ.25 కోట్లు సంపాదించేద్దామనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఏకంగా డీఆర్ఐనే..!
Tata Nexon లేదా Nissan Magnite .. ధర, మైలేజ్, ఫీచర్ల పరంగా ఏ కారు కొనడం మంచిది?
Tata Nexon లేదా Nissan Magnite .. ధర, మైలేజ్, ఫీచర్ల పరంగా ఏ కారు కొనడం మంచిది?
Sanju Samson VS MS Dhoni: సంజు శాంసన్ సరికొత్త రికార్డు - ఎంఎస్ ధోని ఆల్ టైమ్ ఐపీఎల్ రికార్డును బద్దలు కొట్టిన సీఎస్‌కే వికెట్ కీపర్
సంజు శాంసన్ సరికొత్త రికార్డు - ఎంఎస్ ధోని ఆల్ టైమ్ ఐపీఎల్ రికార్డును బద్దలు కొట్టిన సీఎస్‌కే వికెట్ కీపర్
Embed widget