HHVM Ticket Rates: పవన్ 'హరిహర వీరమల్లు' టికెట్ రేట్స్ పెరిగాయ్ - ఫస్ట్ 10 రోజుల వరకే...
Hari Hara Veera Mallu Tickets: పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఫస్ట్ 10 రోజులు ధరలు పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది.

Pawan Kalyan's HHVM Ticket Rates Hike In AP: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' ఈ నెల 24న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి 2 వారాలు ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్మాత కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తొలి 10 రోజులు టికెట్ ధరలు పెంచేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ధరలు ఎంతంటే?
ఈ మూవీ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.100 (లోయర్ క్లాస్), రూ.150 (అప్పర్ క్లాస్) పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించగా... మల్టీ ప్లెక్స్‌లో మాత్రం రూ.200 వరకూ పెంచేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ఫస్ట్ 10 రోజులు మాత్రమే టికెట్ రేట్స్ పెంపు వర్తిస్తుంది.
పెయిడ్ ప్రీమియర్స్ ఓకే
టికెట్ ధరలతో పాటే ఈ నెల 23న పెయిడ్ ప్రీమియర్స్‌కు కూడా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంపిక చేసిన కేంద్రాల్లో మాత్రమే ఈ షోస్‌కు అనుమతి ఉండగా... టికెట్ ధర రూ.600గా నిర్ణయించారు. ఈ క్రమంలో థియేటర్ల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భద్రత కల్పించాలని పోలీస్ శాఖకు నిర్దేశించింది.
Also Read: పవన్ కళ్యాణ్ హిట్ సినిమాలు ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు - మూవీస్ లిస్ట్ & స్ట్రీమింగ్ డీటెయిల్స్
తెలంగాణలో...
అయితే, తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే అనుమతుల కోసం ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయగా స్పందించాల్సి ఉంది. చారిత్రక నేపథ్యం ఉన్న మూవీ కావడంతో టికెట్ ధరలు పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అటు ప్రీమియర్, బెనిఫిట్ షోల విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. పవన్ కల్యాణ్ క్రేజ్, ఫ్యాన్స్ కోరిక మేరకు ప్రీమియర్, బెనిఫిట్ షోస్ వేసుకునేందుకు అనుమతి కోరగా దానిపైనా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నెల 23న రాత్రి 9:30 గంటలకు తెల్లవారుజామున 4 గంటలకు బెనిఫిట్ షోస్ వేసుకునేందుకు నిర్మాత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతి కోరారు.
ఈ నెల 21న ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ నెల 21న హైదరాబాద్ శిల్ప కళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ మేరకు టీం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్‌తో పాటు రాజమౌళి, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇతర ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తొలుత విశాఖలో ఈవెంట్ చేస్తారని ప్రచారం సాగినా ఆ తర్వాత లొకేషన్ హైదరాబాద్ చేంజ్ చేశారు.
ఫ్యాన్స్ హంగామా...
చాలా రోజుల తర్వాత పవన్ మూవీ థియేటర్లలో వస్తుండడంతో ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. అటు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నారు. మూవీతో పాటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ స్పీచ్‌పైనా అందరి ఆసక్తి ఉంది. ట్రైలర్‌తోనే అంచనాలు పదింతలు కాగా... ఈ మూవీ ఆడియన్స్ మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని నిర్మాత ఎఎం రత్నం తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ సినిమాలో పవర్ ఫుల్ యోధుడి పాత్రలో పవన్ కనిపించనుండగా... ఆయన సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో ఎ.దయాకరరావు నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తుండగా... అనుపమ్ ఖేర్, జిషు సేన్ గుప్తా, సత్యరాజ్, నాజర్, సునీల్, నోరా ఫతేహి, సుబ్బరాజు, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 24న మూవీ రిలీజ్ కానుంది.






















