HHVM Pre Release Event Date: వీరమల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్... ఏపీలో ఎక్కడ చేస్తారంటే?
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏపీలో జరగనుంది. ప్రస్తుతానికి రెండు నగరాలను ఆప్షన్ కింద ఎంచుకున్నారని సమాచారం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. విడుదలకు నాలుగు రోజుల ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం రెండు నగరాలను ప్రస్తుతానికి ఆప్షన్ కింద ఎంపిక చేసి ఉంచారని తెలిసింది.
జూలై 20న వీరమల్లు ఫంక్షన్!
Hari Hara Veera Mallu Pre Release Event: జూలై 20వ తేదీన 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడానికి నిర్మాత ఏం రత్నం సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్ కూడా ఏపీలో చేయనున్నారు.
జూన్ 12వ తేదీన వీరమల్లు విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పుడు తిరుపతిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. కానీ అది జరగలేదు. విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యం కావడం వల్ల సినిమా విడుదల వాయిదా పడడం, ఆ ఫంక్షన్ క్యాన్సిల్ కావడం తెలిసిన విషయాలే. ఇప్పుడు కూడా తిరుపతిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ సిటీకి ప్రయారిటీ ఇచ్చారు. అయితే వర్షాలను బట్టి వేదిక ఎక్కడ అనేది డిసైడ్ అవుతుంది. అయితే తిరుపతిలో లేదంటే విజయవాడలో భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
పవన్ స్పీచ్ మీద సర్వత్రా ఆసక్తి!
వీరమల్లు వేడుకలో పవన్ ఏం మాట్లాడతారు? అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన సినిమా ఫంక్షన్లకు హాజరై రెండేళ్లు అవుతోంది. ఈ మధ్య కాలంలో ఏపీ ఎన్నికలు జరిగాయి. అందులో ఆయన విజయం సాధించారు. అలాగే ఇటీవల కాలంలో వీరమల్లు విడుదల మీద కుట్ర జరిగిందని బలంగా ప్రచారం జరిగింది. దానిపై పవన్ హార్ట్ అయ్యాయని వినిపించింది. అయితే ఇప్పటి వరకు నేరుగా మాట్లాడింది లేదు. దాంతో పవన్ స్పీచ్ మీద ఆసక్తి నెలకొంది.
Also Read: మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ 'మంజుమ్మేల్ బాయ్స్' నిర్మాతల అరెస్ట్, బెయిల్ మీద విడుదల... అసలు ఏమైందంటే?
తెలంగాణకు చెందిన ఒక వీరుడి కథను వీరమల్లుగా తీశారని జరిగిన ప్రచారం పట్ల చిత్ర బృందం స్పందించింది. తమది కల్పిత కథతో తీసిన సినిమా అని పేర్కొంది. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఒక వీరుడి ప్రయాణమే 'హరిహర వీరమల్లు' అని తెలిపింది. ఈ నెల 24న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయనున్నారు.



















