అన్వేషించండి

ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ కళ్యాణ్ అరుదైన రికార్డ్ - ఒక్క పోెస్ట్ కూడా పెట్టకుండానే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో అధికారికంగా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.

సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. మంగళవారం ఉదయం పవన్ కళ్యాణ్ ఇన్ స్టాగ్రామ్ లో తన అధికారిక అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నారు. 'ఎలుగెత్తు.. ఎదిరించు.. ఎన్నుకో.. జై హింద్..' అనే నినాదంతో పవన్ కళ్యాణ్ అకౌంట్ క్రియేట్ అయింది. ఇక ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్ పిక్ నే ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ ఎంట్రీతో ఇన్ స్టాగ్రామ్ అంతా షేక్ అయిపోతుంది. ఆయన అలా అడుగు పెట్టారో లేదో భారీ సంఖ్యలో ఫాలోవర్స్ వచ్చి పడుతున్నారు. ఇప్పటివరకు ఇన్ స్టాగ్రామ్ లో ఆయన ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. కానీ అని ఫాలోవర్స్ మాత్రం వేల సంఖ్యలో చేరుతున్నారు.

కేవలం అభిమానులే కాకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు ఆయన్ని ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. దీంతో కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 1.7 మిలియన్ల ఫాలోవర్స్ పవన్ కళ్యాణ్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో చేరారు. అంటే 17 లక్షల మంది ఫాలోవర్స్ అన్నమాట. ఒక్కరోజులోనే ఇంతమంది ఫాలోవర్స్ ని సాధించిన సెలబ్రిటీగా పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఇక ఈరోజుతో పవన్ కళ్యాణ్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో 2 మిలియన్ ఫాలోవర్స్ చేరారు. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఫుల్ ఖుషి అవుతున్నారు. 'ఇది కదా పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే'.. 'కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు'.. అంటూ ఫ్యాన్స్ అయితే తమ అభిమాన హీరోని ఆకాశానికి ఎత్తేస్తూ కాలర్ ఎగరవేస్తున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే స్టార్ హీరోకి ఇన్ స్టా లో ఒక్క రోజులో 17 లక్షలకు పైగా ఫాలోవర్స్ దక్కలేదు.

ఈ రికార్డ్ కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యమైంది. కాగా పవన్ కళ్యాణ్ ఇన్ స్టా ఎకౌంట్ ని ఆయన టీం హ్యాండిల్ చేస్తారు. ఇక ప్రస్తుతం ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ ఇన్ స్టాగ్రామ్ లో ఫస్ట్ పోస్ట్ ఏం పెడతారోనని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆయన కనుక మొదటి పోస్ట్ పెడితే మరింత మంది ఫాలోవర్స్ పెరిగే అవకాశం ఉందని కచ్చితంగా చెప్పొచ్చు. మరి ముందు ముందు పవన్ కళ్యాణ్ ఇన్ స్టాగ్రామ్ లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వంలో మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన 'బ్రో' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.

రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రాబట్టడమే కాకుండా సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'వినోదయ సీతం' అనే సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. త్వరలోనే సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రాబోతున్నాయి. ముందుగా తమన్ సంగీతం అందించిన పాటలు, ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈనెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాతో పాటు 'ఓజి', 'హరి హర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్.

Also Read : 'సలార్' టీజర్‌లో 'కెజియఫ్ 2' హింట్స్ - ఆ అంశాలు గమనించారా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Hide & Silk: రొమాంటిక్ ఫిల్మ్ 'హైడ్ అండ్ సిల్క్'లో హీరోగా సుహాస్... ప్రోమో రిలీజ్
రొమాంటిక్ ఫిల్మ్ 'హైడ్ అండ్ సిల్క్'లో హీరోగా సుహాస్... ప్రోమో రిలీజ్
Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
The Dirty Picture 2: విద్యా బాలన్ కాదు... తమన్నా - 'ది డర్టీ పిక్చర్ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ?
విద్యా బాలన్ కాదు... తమన్నా - 'ది డర్టీ పిక్చర్ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ?
Vijay Deverakonda Rashmika: తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget