By: ABP Desam | Updated at : 15 Apr 2023 06:20 PM (IST)
పాలక్ తివారీ(Image Credits: Palak Tiwari_Salman Khan/Twitter)
Palak Tiwari : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై నటి పాలక్ తివారీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి. తను చేసిన కామెంట్స్ ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ పాలక్ ఆవేదన వ్యక్తం చేసింది. తనకంటే పెద్దవారి ముందు ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలన్న విషయంలో తనకు తాకు కొన్ని రూల్స్ సెట్ చేసుకున్నానని, అందులో సల్మాన్ కూడా ఒకరు అంటూ పాలక్ క్లారిటీ ఇచ్చింది.
‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’ (2021)లో నటించిన మంచి పేరు తెచ్చుకున్న పాలక్ తివారీ.. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ లేటెస్ట్ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో నటించింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా పోర్టల్ ఇంటరాక్షన్ లో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సల్మాన్ ఖాన్ సెట్స్ లో అమ్మాయిల డ్రెస్సింగ్ ఎలా ఉండాలనుకుంటాడో దాని గురించి ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
తాను ‘అంతిమ్’ సెట్‌లో సల్మాన్‌తో కలిసి నటిస్తున్నప్పుడు జరిగిన సంఘటనను గురించి చెప్పుకొచ్చిన పాలక్.. మహిళలు దుస్తులు ఎలా ధరించాలి అనే విషయంలో సల్మాన్‌కు నిబంధన ఉందని చెప్పింది. ఈ విషయం చాలా మందికి తెలియదని, సెట్స్ లో మహిళలంతా నెక్ లైన్ కి తక్కువ కాకుండా దుస్తులు ధరించాలనే నిబంధన పెట్టాడని తెలిపింది. అంతే కాదు అమ్మాయిలందరినీ సరిగ్గా డ్రెస్ చేసుకోవాలని సల్మాన్ కోరేవాడని పాలక్ చెప్పింది. 'సల్మాన్ ఒక సాంప్రదాయవాది అని.. అతను తనతో పనిచేసే మహిళల భద్రత కోసం ప్రయత్నిస్తాడు' అంటూ సల్మాన్ పై ప్రశంసల వర్షం కురిపించింది.
యంగ్ బ్యూటీ పాలక్ తివారీ మాటలు కొందరికి వేరేలా ప్రచారం జరిగాయి. కొందరు తప్పుగా అర్థం చేసుకుని ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో స్వయంగా పాలక్ తివారీనే ఈ ట్రోలింగ్ పై స్పందించింది. తాను మాట్లాడిన మాటలు కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, తన కంటే పెద్ద వారి ముందు ఎలా డ్రెస్ చేసుకోవాలన్న దానిపై తనకు తానే కొన్ని రూల్స్ పెట్టుకున్నానని చెప్పుకొచ్చింది. తాను అత్యంత ఆరాధించే వాళ్లలో సల్మాన్ సర్ కూడా ఒకరని పాలక్ తెలిపింది.
నటుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో పాలక్ తివారీ ఎఫైర్ పై గత కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇబ్రహీంతో తనకు ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చిన పాలక్.. అతను తనకు మంచి స్నేహితుడని, అతనితో కలిసి సరదాగా సమయాన్ని గడపటం అంటే తనకు ఇష్టమని చెప్పింది. కానీ అది కాల్స్ చేసుకోవడం, మెసేజ్ లు పంపుకోవడం లాంటిది కాదని వెల్లడించింది. ఈ విధంగా చేసిన ఆమె కామెంట్స్ తో ఇటీవల పుట్టుకొచ్చిన రూమర్స్ ఆగిపోతాయా, లేదంటే వాటికి ఇవి మరింత ఆజ్యం పోస్తాయా తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.
కాగా, సల్మాన్ ఖాన్ నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' మూవీని డైరెక్టర్ ఫర్హాద్ సామ్జీ తెరకెక్కించారు. ఈ సినిమాలో పాలక్ తివారీతో పాటు హీరోయిన్ పూజా హెగ్డే, టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్ దగ్గుబాటి, జగపతి బాబు, షెహనాజ్ గిల్, రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్, విజేందర్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 21న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
Bloody Daddy Movie Review - 'బ్లడీ డాడీ' రివ్యూ : జియో సినిమాలో షాహిద్ కపూర్ యాక్షన్ థ్రిల్లర్ - ఎలా ఉందంటే?
Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?
రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు
హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం
Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!
AP TDP Plan : ఓటర్లకు ముందుగానే పథకాల కార్డులు - ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్ !
CM Jagan Gudivada Tour: సీఎం జగన్ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం
IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ